చిరిగిన నోటును మార్చండిలా!

క‌రెన్సీ నోటు చిరిగిందంటే చాలా మంది తీసుకోరు. కొన్ని షాపుల్లో అయితే నోటు చిరిగితే తీసుకోడానికి విముఖ‌త చూపుతారు. మ‌రి ఈ పాత న‌లిగిన చిరిగిన నోట్ల‌ను మార్చేందుకు అవ‌కాశం ఉంది మీకు తెలుసా?చిన్న నోట్ల‌యితే ఫ‌ర్వాలేద‌ని ఉంచేసుకుంటాం కానీ పెద్ద..

Published : 16 Dec 2020 17:56 IST

క‌రెన్సీ నోటు చిరిగిందంటే చాలా మంది తీసుకోరు. కొన్ని షాపుల్లో అయితే నోటు చిరిగితే తీసుకోడానికి విముఖ‌త చూపుతారు. మ‌రి ఈ పాత న‌లిగిన చిరిగిన నోట్ల‌ను మార్చేందుకు అవ‌కాశం ఉంది మీకు తెలుసా?

చిన్న నోట్ల‌యితే ఫ‌ర్వాలేద‌ని ఉంచేసుకుంటాం కానీ పెద్ద నోట్లు రూ. 500, రూ. 2000 అయితే మాత్రం మార్చుకోవాల‌నే అనుకుంటాం. ఈ నోట్ల‌ను బ్యాంకుల్లో మార్చుకోవ‌చ్చు. రిజ‌ర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నోట్ రిఫండ్ నిబంధ‌న‌లు 2009 ఆ అధికారాన్ని ప్ర‌జ‌ల‌కు క‌ల్పిస్తుంది.

చిరిగిన లేదా బాగా న‌లిగిన క‌రెన్సీ నోట్ల‌ను మార్చుకునేందుకు ఆర్‌బీఐ కొన్ని వెసులుబాట్ల‌ను క‌లిపించింది.

  1. బ్యాంకు బ్రాంచీల్లో చిరిగిన నోట్ల‌ను ఇవ్వ‌డం ద్వారా కొత్త నోట్ల‌ను పొందేందుకు వీలుంటుంది.
  2. చిరిగిన‌, ఏదైనా లోపం క‌లిగిన నోట్ల‌ను బ్యాంకులు మార్పిడి చేసుకోవాలి.
  3. కాయిన్లు, నోట్ల‌ను లావాదేవీల‌లో భాగంగా తీసుకోవ‌డం లేదా త‌గిన కొత్త కాయిన్లు,నోట్ల‌ను బ‌దులుగా అందించాలి.

గ‌మ‌నిక: ఏ బ్యాంకు కూడా చిన్నవైన చిరిగిన నోట్లు,కాయిన్ల‌ను తీసుకోకుండా ఉండ‌కూడ‌దని ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.

రిజ‌ర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నోట్ రిఫండ్ నిబంధ‌న‌లు 2009 హ‌క్కులు

రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా చ‌ట్టంలో 1934 సెక్ష‌న్ 28 ప్ర‌కారం , సెక్ష‌న్ 58(2) చూస్తే , ఏ వ్య‌క్తి కూడా ప్ర‌భుత్వం నుంచి లేదా ఆర్‌బీఐ నుంచి పోయిన‌,దొంగిలించిన నోట్ల‌కు బ‌దులుగా పొందే అవ‌కాశం లేద‌ని పేర్కొంటుంది.

రిజ‌ర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నోట్ రిఫండ్ నిబంధ‌న‌లు 2009 ప్ర‌కారం దేశంలో పౌరులంద‌రికీ ఇది అందుబాటులో ఉండేందుకు అన్ని బ్యాంకు బ్రాంచీల‌కు ఈ స‌దుపాయం క‌లిపిస్తున్నారు

చిరిగిన లేదా న‌లిగిన‌ నోటు

చిరిగిన నోటు లేదా న‌లిగిన నోటు అంటే క‌రెన్సీ నోటు ఏదైనా రెండు భాగాలు లేదా అంత‌కంటే ఎక్కువ భాగాలుగా చిరిగి,నోటులో ఎటువంటి భాగం పోకుండా ఉంటే దాన్ని చిరిగిన నోటు కింద ప‌రిగ‌ణిస్తారు. రోజు వారీ వినియోగంలో భాగంగా బాగా న‌లిగిపోయిన వాటిని ప‌రిగ‌ణిస్తారు.

బాగా చిరిగిన నోటు గురించి

క‌రెన్సీ నోట్లు ఎంత విలువ క‌లిగిన‌వైనా బాగా చిరిగిన‌,కాలిన నోట్ల‌ను కొట్టేసిన నోట్ల‌ను మార్పిడి చేసేందుకు అనుమ‌తి ఉండ‌దు. ఎందుకంటే అవి మాములు నోట్లుగా గుర్తించేందుకు అవ‌కాశం ఉండందు కాబ‌ట్టి మ‌నం వాటిని జారీచేసిన కార్యాల‌యానికి పంపిస్తే అక్క‌డ త‌గు ప‌రిశీల‌న చేస్తారు.

చిన్న మొత్తంలో అయితే ఉచితం

చిరిగిన నోట్లు సంఖ్య 20 లేదా విలువ రూ.5000 లోపు ఉంటే బ్యాంకులు వాటిపై ఎటువంటి ఛార్జీలు తీసుకోకుండా ఉచితంగానే కొత్త‌ నోట్లు ఇవ్వ‌డం లేదా డిపాజిట్ గా తీసుకోవ‌డం చేస్తారు.

పెద్ద మొత్తంలో అయితే చార్జీలు

మొత్తం నోట్ల సంఖ్య 20 లేదా విలువ రూ.5000 కంటే ఎక్కువ‌గా ఉంటే వాటికి స్లిప్ జారీ చేసే త‌రువాత విలువ‌ను ఖాతాలోకి జ‌మ‌చేస్తారు. వాటిపై కొంత రుసుమ వ‌సూలు చేస్తారు. మొత్తం చిరిగిన నోట్లు రూ.50000కంటే ఎక్కువ‌గా ఉంటే బ్యాంకు వారు త‌గిన ప‌ద్ధ‌తుల ప్ర‌కారం వాటిని తీసుకుంటారు. దీనికి సంబంధించి కావాల‌ని క‌ట్ చేస్తే చ‌ట్టంలో నిబంధ‌న‌ 6(3)(ii) ప్ర‌కారం ఆ నోట్లు చెల్ల‌వు.

సందేశాలు, స్లోగ‌న్‌లు రాసుంటే

రిజ‌ర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నోట్ రిఫండ్ నిబంధ‌న‌లు 2009 నిబంధ‌న‌ 6(3) (iii)ప్ర‌కారం నోటు ప్ర‌ధాన ఫీచ‌ర్ ఉండే చోటుపై ఏవైనా రాసుంటే ఆ నోటు చెల్ల‌దు. అదే విధంగా నోటు రూపంమారినా 6(3) (ii) ప్ర‌కారం ఆనోటు మార్పు చేసేందుకు అవ‌కాశం ఉండ‌దు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని