Income Tax: కో-బ్రౌజింగ్ అంటే ఏంటి.. పన్ను చెల్లింపుదారులకు ఎలా సాయపడుతుంది?
కో-బ్రౌజింగ్..ల్ప్డెస్క్ ఏజెంట్లు రియల్ టైమ్‌లో పన్ను చెల్లింపుదారులకు సహాయపడేందుకు అనుమతిస్తుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్సైట్లో కో-బ్రౌజింగ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త ఫీచర్ సాయంతో పన్ను చెల్లింపుదారులు.. రిటర్నులు దాఖలు చేసే సమయంలో ఏజెంట్ల సాయం తీసుకోవచ్చు. దీని ద్వారా ఏజెంట్లు ఐటీఆర్ దాఖలు చేయడంలో పన్ను చెల్లింపుదారుల బ్రౌజర్ స్క్రీన్ వీక్షించి వారికి సాయపడతారు.
ఎలా సాయపడుతుంది?
ఒక్క బటన్ క్లిక్ చేయడం ద్వారానే హెల్ప్‌డెస్క్ ఏజెంట్లు రియల్ టైమ్‌లో పన్ను చెల్లింపుదారులకు సాయపడేందుకు కో-బ్రౌజింగ్ అనుమతిస్తుంది. దీని ద్వారా హెల్ప్‌డెస్క్ ఏజెంట్లు, పన్ను చెల్లింపుదారుని స్క్రీన్‌ను చూడడంతో పాటు ఐటీఆర్ ఫారం, ఇతర చట్టబద్ధమైన ఫారంలను పూర్తిచేయడంలో సాయపడొచ్చు. సెట్టింగులను మార్చడం, లావాదేవీలను పూర్తిచేయడం, రిఫరెన్స్ మెటీరియల్ వెతకడం, పత్రాలను అప్లోడ్ చేయడం వంటివి కూడా చేయవచ్చు.
బ్రౌజింగ్ ట్యాబ్‌లో రియల్‌టైమ్‌లో పన్ను చెల్లింపుదారులకు దిశానిర్దేశం చేయడంతో పాటు, స్క్రోల్ చేడయం, టెక్ట్స్ టైప్ చేయడం, ఆసక్తి ఉన్న ప్రాంతాలను హైలైట్ చేయడం వంటివి కూడా ఏజెంట్లు చేయవచ్చు. కో-బ్రౌజింగ్‌ను సులభంగా ఉపయోగించుకోవచ్చు. కస్టమర్లు దీన్ని లైవ్‌చాట్, ఫోన్‌తో సులభంగా కనెక్ట్ చేయవచ్చు.
బ్రౌజింగ్ సెక్షన్ ఏవిధంగా ప్రారంభించాలి?
- ముందుగా ఇన్కమ్ ట్యాక్స్ వెబ్‌సైట్‌కు లాగిన్ అవ్వాలి.
- లాగిన్ అయిన తర్వాత పేజీ కింద భాగంలో కో-బ్రౌజ్ హెల్ప్ ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేయాలి.
- ఇప్పుడు స్క్రీన్‌పై పాప్-అప్ విండో కనిపిస్తుంది. దాన్ని ఎగ్రీ చేసి, కంటిన్యూపై క్లిక్ చేస్తే ఒక స్పెషల్ పిన్ జనరేట్ అవుతుంది. దీన్ని ఏజెంట్‌తో పంచుకోవాలి.
- పన్ను చెల్లింపుదారుడు షేర్ చేసిన పిన్ను ఎంటర్ చేసి ఏజెంట్ సెక్షన్ ప్రారంభించి, కావాల్సిన సాయం అందించవచ్చు.
- పన్ను చెల్లింపుదారులు సమాధానాలను పొందిన తర్వాత ఏ సమయంలోనైనా స్టాప్ బటన్‌పై క్లిక్ చేసి సెషన్ ముగించవచ్చు. అటు తర్వాత ఏజెంట్ పన్ను చెల్లింపుదారుల బ్రౌజర్‌ను చూడలేరు.
ఏజెంట్ ఇతర సమాచారం చూడగలరా?
లేదు. పన్ను చెల్లింపుదారుల డెస్క్‌టాప్ లేదా కంప్యూటర్లో ఏ ఇతర డేటాను చూడడానికి కో-బ్రౌజింగ్ ఏజెంట్‌ను అనుమతించదు. అలాగే, కో-బ్రౌజింగ్ సెషన్‌ను ప్రారంభించే ముందు పన్ను చెల్లింపుదారు ఏజెంట్ అభ్యర్థనను ఆమోదించాలి.
కో-బ్రౌజింగ్, స్క్రీన్ షేరింగ్ కంటే అనుకూలం ఎందుకు?
థర్డ్‌పార్టీ ప్రమేయం ఉండదు: స్క్రీన్ షేరింగ్‌లో అయితే పన్ను చెల్లింపుదారులు, ఏజెంట్లు ఇద్దరూ జూమ్ లేదా గూగుల్ మీట్ వంటి థర్డ్ పార్టీ అప్లికేషన్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలి. కో-బ్రౌజింగ్‌తో నేరుగా కనెక్ట్ చేసుకోవచ్చు.
ఇతర సమాచారం: స్క్రీన్ షేరింగ్‌లో ఏజెంట్లు, పన్ను చెల్లింపుదారుల మొత్తం డెస్క్టాప్ను చూడగలుగుతారు. కాబట్టి, ఏమైనా పాప్-అయ్యే నోటిఫికేషన్లు, ఇతర సమాచారాన్ని కూడా చూసే అవకాశం ఉంటుంది. కానీ, కో-బ్రౌజింగ్‌లో ఏజెంట్లు, పన్ను చెల్లింపుదారుని క్రియాశీలక విండోను మాత్రమే చూడగలుగుతారు. ఇతర ఏవిధమైన సమాచారం చూడలేరు.
సాయం: స్క్రీన్ షేరింగ్‌లో ఏజెంట్లు, పన్ను చెల్లింపుదారులకు సూచనలు మాత్రమే చేయగలరు. స్క్రీన్‌పై ఎలాంటి పనులూ చేయలేరు. కానీ కో-బ్రౌజింగ్‌లో ఏజెంట్లు.. డేటాను హైలైట్ చేయడం, టైప్ చేయడం, ఫారాలను పూరించడం వంటి కొన్ని పనులు చేయగలుగుతారు.
డేటా మాస్కింగ్: కో-బ్రౌజింగ్, డేటా మాస్కింగ్ ఫీచర్‌తో వస్తుంది. ఇది పన్నుచెల్లింపుదారుల పాస్వర్డులు వంటి రహస్య సమాచారం ఏజెంట్లకు చేరకుండా రక్షణ కల్పిస్తుంది. కానీ, స్క్రీన్ షేరింగ్ మాస్కింగ్ ఫీచర్‌ను అందించదు. పన్నుచెల్లింపుదారుల స్క్రీన్‌పై చేసే ప్రతిదీ ఏజెంట్‌కు కనిపిస్తుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Kangana Ranaut: ‘పఠాన్’ విజయంపై నిర్మాత ట్వీట్.. కంగనా రనౌత్ కామెంట్!
-
Politics News
Rahul Gandhi: ‘అలా అయితే మీరు నడవొచ్చు కదా’.. అమిత్ షాకు రాహుల్ సవాల్!
-
India News
S Jaishankar: శ్రీ కృష్ణుడు, హనుమాన్లు ప్రపంచంలోనే గొప్ప దౌత్యవేత్తలు
-
General News
Hyderabad Metro: ప్రైవేటు ఆస్తుల సేకరణ సాధ్యమైనంత వరకు తగ్గించండి: ఎన్వీఎస్ రెడ్డి
-
World News
ఐదు నెలలుగా విమానాశ్రయంలోనే.. రష్యన్ పౌరుల ‘ది టెర్మినల్’ స్టోరీ!
-
Movies News
Pooja Hegde: సోదరుడి వివాహం.. పూజా హెగ్డే భావోద్వేగం!