Credit Card: ఖ‌ర్చు చేసిన డ‌బ్బుపైనే వ‌డ్డీ చెల్లించాలా? ఈ కార్డును ప‌రిశీలించండి..

త‌క్ష‌ణ‌మే రుణం పొందాలా?.. ఉప‌యోగించిన మొత్తంపైనే వ‌డ్డీ చెల్లించాలా?  క్రెడిట్ కార్డు ద్వారా ఉచితంగా ఏటీఎమ్ వ‌ద్ద డ‌బ్బు విత్‌డ్రా చేసుకోవాలా? అయితే స్టాష్‌ఫిన్ సంస్థ‌ క్రెడిట్ లైన్ కార్డు ఈ ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. 

Updated : 28 Mar 2022 15:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అత్య‌వ‌స‌రంగా డ‌బ్బు కావాలా? వ్య‌క్తిగ‌త రుణం తీసుకుంటే ప్రాసెసింగ్‌కి సమయం ప‌డుతుంది. అలాగే, తీసుకున్న మొత్తం రుణంపై వ‌డ్డీ వ‌ర్తిస్తుంది. పైగా ఈఎంఐ రూపంలోనే చెల్లింపులు చేయాలి. క్రెడిట్ కార్డు ఉప‌యోగించి ఏటీఎం ద్వారా విత్‌డ్రా చేసుకుంటే అధిక ఛార్జీలు పడతాయి. ఈ రెండింటినీ స‌మ‌న్వ‌యం చేస్తూ మ‌రింత స్మార్ట్‌గా ప‌నిచేస్తుంది క్రెడిట్ లైన్‌ కార్డు. ఇందులో మంజూరైన మొత్తం లిమిట్ వ‌ర‌కు డ‌బ్బు విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. తీసుకున్న రుణంపై కాకుండా.. ఉప‌యోగించిన మొత్తంపై మాత్ర‌మే వ‌డ్డీ వ‌ర్తిస్తుంది. అదేవిధంగా ఈఎంఐ రూపంలోనూ లేదా ఏక‌ మొత్తంలోనూ మీ సౌల‌భ్యం మేర‌కు చెల్లింపులు చేయొచ్చు. స్టాష్‌ఫిన్ సంస్థ‌ క్రెడిట్ లైన్ కార్డు అందుబాటులో తీసుకొచ్చింది.

స్టాష్‌ఫిన్ క్రెడిట్ కార్డు ఫీచ‌ర్లివీ..

స్టా‌ష్‌ఫిన్ ఫిన్‌టెక్ సంస్థ త‌మ వెబ్‌సైట్‌, యాప్ ద్వారా డిజిట‌ల్‌గా రుణం మంజూరు చేస్తుంది. ఈ సంస్థ‌ ‘ఆల్ ఇన్ వన్’ గా ప‌నిచేసే క్రెడిట్ లైన్ కార్డును జారీ చేస్తుంది. ఈ కార్డు.. క్రెడిట్ కార్డ్ కంటే స్మార్ట్‌గా ప‌నిచేస్తుంది. అలాగే వ్య‌క్తిగ‌త రుణం కంటే సుల‌భంగా ల‌భిస్తుంది. ఒక కార్డు నుంచి వినియోగ‌దారుడు కోరుకునే అన్ని ప్ర‌యోజ‌నాల‌ను ఈ కార్డు అందిస్తుంది. త‌క్ష‌ణ రుణ స‌దుపాయంతో పాటు, రీపేమెంట్ ఫ్లెక్సిబిలిటీ, ప్ర‌త్యేక‌మైన ఆఫ‌ర్లు, ఆక‌ర్ష‌ణీయ‌మైన రివార్డు ప్రోగ్రామ్‌లు, ఉచిత ఏటీఎం విత్‌డ్రాలు, ప్ర‌తి ఖ‌ర్చుపై క్యాష్‌బ్యాక్‌లు ల‌భిస్తాయి. హిడెన్ ఛార్జీలు, ఫీజులు ఉండ‌వు. వైబ్‌సైట్‌ల నుంచి రిటైల్ అవుట్‌లెట్‌ల వ‌ర‌కు ఎక్క‌డైనా సుల‌భంగా చెల్లింపులు చేయొచ్చు. స్టాష్‌ఫిన్ క్రెడిట్ కార్డు ద‌ర‌ఖాస్తు చేసిన నాలుగు గంటల్లోపే నిధుల‌ను పంపిణీ చేస్తుంది.

వ్య‌క్తిగ‌త రుణం తీసుకుంటే.. ఈఎంఐ ద్వారా చెల్లింపులు చేస్తారు. క్రెడిట్ కార్డులో దాదాపు 45 రోజుల వ‌డ్డీ ర‌హిత కాల‌వ్య‌వ‌ధి ఉంటుంది. గ‌డువులోపు చెల్లింపులు చేయొచ్చు. మ‌రి స్టాష్‌ఫిన్ క్రెడిట్ లైన్ కార్డుల చెల్లింపులు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

స్టాష్‌ఫిన్ ప్రత్యేకమైన ‘రెడ్యూసింగ్‌ బ్యాలెన్స్‌’ ఫీచర్‌తో వ‌స్తుంది. స‌కాలంలో ఈఎంఐ చెల్లింపులు చేస్తే అవుట్‌ స్టాండింగ్ మొత్తంపై వ‌డ్డీ త‌గ్గడంతో పాటు రివార్డు పాయింట్లు ల‌భిస్తాయి. సాధార‌ణ ఆఫ‌ర్ల‌తో పాటు ముఖ్య‌మైన రోజుల్లో అధిక రివార్డులు మాత్ర‌మే కాకుండా స్టాష్ క్యాష్‌ను పొందొచ్చు. ఈ స్టాష్ క్యాష్‌ రీడీమ్ చేసుకుని ఈఎంఐ చెల్లింపులు చేయొచ్చు.

వ‌డ్డీ రేట్లు, ఇత‌ర ఛార్జీలు..
స్టాష్‌ఫిన్‌ ఆల్-ఇన్-వన్ క్రెడిట్ లైన్ కార్డ్ పూర్తిగా ఉచితం. వినియోగదారులకు తక్కువ వడ్డీ రేటుతో ఆర్థిక ప్రయోజనాలను అందిస్తుంది. వ‌డ్డీ రేట్లు అంద‌రికీ ఒకేలా ఉండ‌వు. రుణం తీసుకున్న వ్య‌క్తి క్రెడిట్ హిస్ట‌రీ ఆధారంగా వ‌డ్డీ విధిస్తారు. వ్య‌క్తిగ‌త రుణం మాదిరిగా తీసుకున్న మొత్తం రుణానికి కాకుండా ఉప‌యోగించిన మొత్తానికి మాత్రమే వడ్డీ చెల్లింపులు చేయొచ్చు. హిడెన్ ఛార్జీలు లేకుండా అత్యంత పార‌ద‌ర్శ‌కంగా ప‌నిచేస్తుంద‌ని సంస్థ వెల్ల‌డించింది.

ఇత‌ర ప్ర‌యోజ‌నాలు..
స్టాష్‌ఫిన్ కార్డు తీసుకున్న వారికి సైన‌ప్ బోన‌స్ కింద రూ.1500 స్టాష్‌క్యాష్, ఇంకా రూ.3450 విలువైన ప్ర‌యోజ‌నాలు లభిస్తాయి. కార్డును ఉప‌యోగించి చేసిన ప్ర‌తి ఖ‌ర్చుపై 1 శాతం వ‌ర‌కు క్యాష్ బ్యాక్ ల‌భిస్తుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులకు రిఫ‌ర్ చేస్తే అదనపు స్టాష్ క్యాష్ లభిస్తుంది. అంతే కాకుండా ఉచిత ఏటీఎం విత్‌డ్రాలను అందిస్తుంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ షాపింగ్‌తో పాటు, ప్ర‌యాణాల‌కు, రెస్టారెంట్ల వ‌ద్ద కార్డును ఉప‌యోగించ‌వ‌చ్చు. రిప‌బ్లిక్ డే, ఇంట‌ర్నేష‌న‌ల్ విమెన్స్ డే, క్రెడిట్ సీజ‌న్‌లో ప్ర‌త్యేక‌మైన సేల్స్ ఉంటాయి. ఈ స‌మ‌యంలో మరిన్ని అవార్డ్స్‌, ఇంకా స్టాష్‌క్యాష్‌ను గెలుచుకోవ‌చ్చు.

చివ‌రిగా: క్రెడిట్ లైన్ కార్డ్‌, క్రెడిట్ కార్డు, వ్య‌క్తిగ‌త రుణం.. ఏదైనా స‌కాలంలో చెల్లింపులు చేసిన‌ప్పుడు మాత్ర‌మే ప్ర‌యోజ‌నాలు అందుతాయి. లేదంటే అధిక వ‌డ్డీ చెల్లించాల్సి వ‌స్తుంద‌ని గుర్తుంచుకోండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని