Elon Musk: ట్విటర్‌ అకౌంట్‌తో మస్క్‌కు ఏడాదికి ₹8.2 కోట్లు..!

Elon Musk: బిలియనీర్‌ ఎలాన్‌మస్క్‌ (Elon Musk) కేవలం తన ట్విటర్‌ ఖాతా ద్వారా ఏడాదికి రూ.8.2 కోట్లు ఆర్జిస్తున్నాడు.

Published : 26 Apr 2023 17:08 IST

 

ఇంటర్నెట్‌డెస్క్‌: మైక్రో బ్లాగింగ్‌ వెబ్‌సైట్‌ ట్విటర్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచీ అందులో ఎన్నో మార్పులు చేశారు ఎలాన్‌మస్క్‌ (Elon Musk). బ్లూ టిక్‌ (blue tick)కు ఛార్జీలు వసూలు చేయడం ప్రారంభించారు. తాజాగా యూజర్లు తమ కంటెంట్‌ నుంచి డబ్బు సంపాదించుకునేందుకు మానిటైజేషన్‌ ఆప్షన్‌ తీసుకొచ్చారు. సుదీర్ఘ సమాచారం నుంచి ఎక్కువ నిడివి గల వీడియోల వరకు దేనికైనా సబ్‌స్క్రిప్షన్‌ ఆప్షన్‌ పెట్టుకొని డబ్బులు ఆర్జించుకోవచ్చని తెలిపారు.

ఈ సబ్‌స్క్రిప్షన్‌ ఆప్షన్‌ గురించి తెలపడడంలో భాగంగా మస్క్‌ ఒక స్క్రీన్‌షాట్‌ను పోస్ట్‌ చేశాడు. యూజర్లు మానిటైజేషన్ ఫీచర్‌ను ఎనేబుల్‌ చేసుకోవడం ద్వారా సబ్‌స్క్రిప్షన్‌కు వెళ్లొచ్చని పేర్కొన్నారు. అలా తన అకౌంట్‌ ఫాలోవర్లు, సబ్‌స్క్రైబర్ల సంఖ్యను రివీల్‌ చేశాడు. దీంతో మస్క్‌ ట్విటర్‌ ఖాతాకు 24,700 మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారనే విషయం వెల్లడైంది. 

ట్విటర్‌ సబ్‌స్క్రిప్షన్‌ ధర అమెరికాలో నెలకు 5 డాలర్లు ఉంది. ఇందులో యాపిల్‌ ఇన్‌ యాప్‌ పర్చేజ్‌, ట్విటర్‌ రెవెన్యూ షేర్‌ పోనూ ఒక్కో సబ్‌స్క్రైబర్‌ నుంచి 3.39 డాలర్లు చొప్పున కంటెంట్‌ క్రియేటర్‌కు ట్విటర్‌ చెల్లిస్తుంది. ఆ లెక్కన మస్క్‌కు ప్రస్తుతం 24,700 మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. అంటే ఒక్కో సబ్‌స్క్రైబర్‌ నుంచి నెలకు రూ.277 చొప్పున మస్క్‌కు వస్తుంది. ఈ లెక్కన నెలకు తన సబ్‌స్క్రైబర్ల ద్వారా రూ.68,42,000.. అంటే ఏడాదికి రూ.8.2 కోట్లన్నమాట!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని