దీర్ఘకాల వాహన బీమా పాలసీ ప్రభావం ఎలా ఉంటుంది?

ఒక సంవత్సర కాలవ్యవధిలో సమగ్ర పాలసీ, మూడు, ఐదు సంవత్సరాల దీర్ఘకాలిక థర్డ్ పార్టీ లైబిలిటీ కవర్ ను అందించవచ్చు

Published : 22 Dec 2020 15:24 IST

ఇటీవలి సుప్రీంకోర్టు ఉత్తర్వులను అనుసరిస్తూ, ఇన్సూరెన్సు రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) కొత్త కార్లు, ద్విచక్ర వాహనాలకు దీర్ఘ-కాలిక బీమా కవర్ ను తప్పనిసరి చేసింది. అన్ని సాధారణ బీమా సంస్థలు ఈ కవర్ ను అందించాల్సిందిగా ఐఆర్డీఏఐ ఆదేశించింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, థర్డ్ పార్టీ లైబిలిటీ కార్లకు మూడు సంవత్సరాలు, ద్విచక్ర వాహనాలకు ఐదు సంవత్సరాలు ఉంటుంది. అయితే, బీమా సంస్థలు కార్లకు మూడు సంవత్సరాలు, బైక్ లకు ఐదు సంవత్సరాల కాలవ్యవధితో సమగ్ర బీమా పాలసీలను అందించే అవకాశాన్ని రెగ్యులేటరీ కల్పించింది. అలాగే వారు ఒక సంవత్సర కాలవ్యవధిలో సమగ్ర పాలసీ, మూడు, ఐదు సంవత్సరాల దీర్ఘకాలిక థర్డ్ పార్టీ లైబిలిటీ కవర్ ను అందించవచ్చు.

కొత్త కార్లు, ద్విచక్ర వాహనాలకు దీర్ఘకాల ఉత్పత్తుల కోసం ఐఆర్డీఏఐ మూడు ఆప్షన్స్ ను ప్రవేశపెట్టింది :

  • స్టాండలోన్ 3/5 సంవత్సరాలు థర్డ్ పార్టీ మాత్రమే

  • ప్యాకేజీ 3/5 సంవత్సరాల పాలసీ (థర్డ్ పార్టీతో కలిపి & 3/5 సంవత్సరాల ప్రమాద కవరేజ్)

  • బండిల్డ్ 3/5 సంవత్సరాల పాలసీ (3/5 సంవత్సరాల థర్డ్ పార్టీ కవరేజ్ & ఒక సంవత్సరం ప్రమాద కవరేజ్)

మూడు / ఐదు సంవత్సరాల ప్యాకేజీ పాలసీకి సంబంధించి, మీరు అధిక మొత్తంలో ప్రీమియం చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీరు మూడు సంవత్సరాల పాటు చెడ్డ బీమాదారుని వలలో కూరుకుపోవచ్చు.

ఈ కొత్త ఉత్పత్తి నిర్మాణాలు కొత్త వాహనాలకు మాత్రమే వర్తిస్తాయి. అందువలన, ఇది కొత్త కార్లను కొనుగోలు చేసే వారిపై ప్రభావితం చూపుతుంది.

సెడాన్ సెగ్మెంట్ కార్ల కోసం (ఈ సంఖ్యలను సూచించారు):

ప్రస్తుత ప్యాకేజీ పాలసీ (ఒక సంవత్సరం) : రూ. 30000

స్టాండలోన్ థర్డ్ పార్టీ (మూడు సంవత్సరాలు) : రూ. 11500

ప్యాకేజీ పాలసీ (మూడు సంవత్సరాలు) : రూ. 75000

బండిల్డ్ పాలసీ (మూడు సంవత్సరాలు థర్డ్ పార్టీ & ఒక సంవత్సరం ఓడీ) : రూ. 37000

ప్రీమియం ఓడీ కాంపోనెంట్ మాత్రమే నో క్లెయిమ్ బోనస్ అందిస్తుంది. కావున దీర్ఘకాలిక థర్డ్ పార్టీ పాలసీలో కాకుండా, బండిల్డ్ లేదా ప్యాకేజ్డ్ పాలసీలకు మాత్రమే ఎన్సీబీ వర్తిస్తుంది.

ఐఆర్డీఏఐ ప్రకారం, పాలసీ టర్మ్ పూర్తయినప్పటికీ ఎన్సీబీ వర్తిస్తుంది, అనగా ప్యాకేజ్డ్ కి మూడు సంవత్సరాలు, బండిల్డ్ కి ఒక సంవత్సరం. ప్యాకేజ్డ్ పాలసీ క్లెయిమ్ ఫ్రీ టర్మ్ ( మూడు సంవత్సరాలు) 4వ సంవత్సరం పాలసీ కవర్ పై 35 శాతం తగ్గింపును పొందుతుంది, అయితే బండిల్డ్ పాలసీ క్లెయిమ్-ఫ్రీ టర్మ్ ( ఒక సంవత్సరం) 2వ సంవత్సరం పునరుద్ధరణలో 20 శాతం తగ్గింపును పొందుతుంది.

దీర్ఘకాలిక పాలసీల లాభాలు & నష్టాలు:

ఈ నిర్ణయం వలన కలిగే ప్రధాన ప్రయోజనం ఏమిటంటే, ఇది బీమా & బీమాలేని వాహనాల మధ్య తేడాను తగ్గిస్తుంది. ప్రారంభం నుంచి దీర్ఘకాల బీమా ప్లాన్లు అందుబాటులోకి వచ్చిన తరువాత, ఈ ఉత్పత్తుల బీమా వ్యాప్తి కూడా పెరుగుతుంది. అలాగే ఒక సంవత్సర కాలపరిమితి కలిగిన బీమా ముగిసిన తర్వాత ఎలాంటి బీమా కవర్ లేకుండా వాహనాలను నడిపే వారి సంఖ్యను కూడా ఇది తగ్గిస్తుంది. దీర్ఘకాలిక పాలసీల ద్వారా ప్రజలు వారి వాహనాలకు దీర్ఘకాలిక బీమా కవర్ ను కలిగి ఉంటారు. ఇది ప్రతి సంవత్సరం బీమా పాలసీ గడువు తేదీని గుర్తుంచుకునే అవసరం లేకుండా వాహనదారులకు విముక్తిని కలిగిస్తుంది.

అయితే, ఈ దీర్ఘకాలిక పాలసీలలో ఒకే ఒక పెద్ద లోపం ఏమిటంటే, వినియోగదారులు పెద్ద మొత్తంలో ప్రీమియంను ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది. ఏదేమైనా, మూడు లేదా ఐదు సంవత్సరాల వ్యవధిలో లాక్ చేరిన ప్రీమియం మొత్తంతో వినియోగదారులు లాభం పొందుతారు. పాలసీ ప్రారంభంలోనే వినియోగదారుడు మొత్తం ప్రీమియంను చెల్లించాల్సి ఉంటుంది. డబుల్ బీమా లేదా విక్రయం లేదా బీమా చేసిన వాహనం బదిలీ చేసిన సందర్భాల్లో తప్ప మిగిలిన సందర్బాల్లో ఒకసారి జారీ చేసిన పాలిసీని రద్దు చేయడం కుదరదు.

ఏం చేయాలి?

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ నిర్ణయం కారణంగా బీమా కొనుగోలుదారులు ప్రాధమికంగా డీలర్లు ఎంపిక చేసుకున్న బీమా సంస్థల వలలో చిక్కుకుంటారు. అయినప్పటికీ, చాలా మంది వినియోగదారులకు తెలియని విషయం ఏమిటంటే, కారు లేదా బైక్ డీలర్ ఎంపిక చేసుకున్న బీమా సంస్థల నుంచి బీమా తీసుకోవడం తప్పనిసరి కాదు. మీకు నమ్మకమున్న బీమా సంస్థ నుంచి వాహన బీమాను కొనుగోలు చేయచ్చు. అయితే మీరు కారు / బైకు బీమాను కొనుగోలు చేసే ముందు ఆన్ లైన్ లో ధరలను తనిఖీ చేయడం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని