ఎన్ని జీవిత బీమా పాల‌సీలుంటే మంచిది?

జీవ‌న శైలి అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఒక ట‌ర్మ్ పాల‌సీని త‌ప్ప‌కుండా తీసుకోవాలి

Published : 21 May 2021 15:42 IST

వ‌య‌సు పెరిగే కొద్ది భాద్య‌తలు పెరుగుతాయి. ఒక వ్య‌క్తికి 30 సంవ‌త్స‌రాల వ‌య‌సు ఉన్న‌ప్పుడు ప‌రిమిత హామీ మొత్తంతో కూడిన‌ ఒక జీవిత బీమా పాల‌సీ స‌రిపోవ‌చ్చు. అదే వ్య‌క్తి 50 సంవ‌త్స‌రాల వ‌య‌సుకు చేరేస‌రికి.. ఒక కుటుంబానికి మూల‌ధారం కావ‌చ్చు. సాధార‌ణంగా చిన్న కుటుంబాల‌లో  న‌లుగురు స‌భ్యులుంటారు. వీరితో పాటు సీనియ‌ర్ సిటిజ‌న్లు అయిన త‌ల్లిదండ్రులను భాద్య‌త‌లు చూడాల్సి రావ‌చ్చు. మ‌రి అలాంట‌ప్పుడు, ఉన్న ఒక్క బీమా పాల‌సీ అద‌న‌పు ఖ‌ర్చుల‌కు  స‌రిపోతుందా?

కుటుంబ ఆర్థిక ర‌క్ష‌ణ‌కు, కుటుంబ స‌భ్యుల అవ‌స‌రాలు తీర్చేందుకు ఒక పాల‌సీ స‌రిపోదనుకుంటే.. అవ‌స‌రానికి త‌గిన‌ట్లు.. స‌మయానుసారం అద‌న‌పు పాల‌సీల‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చా? ఒకవేళ కొనుగోలు చేస్తే పాల‌సీల‌న్నింటిని ఎలా నిర్వ‌హించాలి?

రెండు లేదా అంత‌కంటే ఎక్కువ జీవిత బీమాపాల‌సీల‌ను క్లెయిమ్ చేసుకోవ‌డం సాధ్య‌మే. అయితే ఇది పాల‌సీదారుడు బీమా అవ‌స‌రాలు, ఏ ప్లాన్ కొనుగోలు చేశారు అనే అంశాల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. అదేవిధంగా పాల‌సీదారుల‌కు ఎంత వ‌ర‌కు బీమా అందించ‌వ‌చ్చు అనే విష‌యమై బీమా సంస్థ‌ల‌కు కూడా నిర్ధిష్ట మార్గ‌ద‌ర్శ‌కాలు ఉన్నాయి. పాల‌సీ కొనుగోలు చేసిన వ్య‌క్తి ఆదాయం, వ‌య‌సు, ప్రీమియం చెల్లింపుల సామ‌ర్ధ్యం వంటి అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ఎంత మొత్తం హామీగా ఇవ్వ‌చ్చు.. అనేది నిర్ణ‌యిస్తాయి బీమా సంస్థ‌లు. ఏదేమైనా ఒక వ్య‌క్తి రెండ‌వ పాల‌సీ కొనుగోలు చేయాల‌నుకుంటే, రెండు పాల‌సీల గురించి బీమా సంస్థ‌కు స‌మాచారం ఇవ్వాలి. అదేవిధంగా రెండ‌వ జీవిత బీమా పాల‌సీని ఎందుకు ఎంచుకుంటున్నారో తెల‌పాలి. 

రెండు పాల‌సీల‌ను తీసుకున్న వారు, వాటిని నిర్వ‌హించ‌డం చాలా ముఖ్యం. యాక్టీవ్‌గా ఉంచేందుకు క్ర‌మం త‌ప్ప‌కుండా ప్రీమియంల‌ను చెల్లించాల్సి ఉంటుంది. ప్ర‌స్తుతం చాలా వ‌ర‌కు ఆర్థిక లావాదేవీలు డిజిట‌ల్ ప‌ద్ధ‌తిలోనే నిర్వ‌హిస్తున్నారు. ఈ డిజిట‌ల్ విధానంలో పార‌ద‌ర్శ‌కత పెరిగడంతో.. రెండు లేదా అంత‌కంటే ఎక్కువ పాల‌సీల‌ను కొనుగోలు చేసిన వారు  ఇ-ఇన్సురెన్స్ ఖాతా ద్వారా స‌రైన విధంగా పాల‌సీల‌ను నిర్వ‌హించ‌వచ్చ‌ని రెన్యూబై ఇన్సుర్‌టెక్ స‌హా-వ్య‌వ‌స్థాప‌కుడు ఇంద్ర‌నీల్ ఛ‌ట‌ర్జీ తెలిపారు. 

రెండు పాల‌సీలు తీసుకోవ‌డం అనేది కొన్ని విధాలుగా చేస్తే లాభ‌దాయ‌క‌మే. పెరిగిన కుటుంబ భాద్య‌త‌లు, పెద్ద పెద్ద ఆర్థిక  అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లుగా బీమా ఉండాలంటే.. రెండు పాల‌సీలు అవ‌స‌రం కావ‌చ్చు. అలాగే, ఏ కారణం చేత‌నైనా ఒక పాల‌సీ క్లెయిమ్ తిర‌స్క‌రిస్తే, మ‌రొక దానిపై పాలసీదారుడు ఆధార‌ప‌డ‌వ‌చ్చు. ఒక‌టి కంటే ఎక్కువ జీవిత బీమా పాల‌సీల‌ను తీసుకుంటే, వాటి నుంచి మీ వార్షిక ఆదాయానికి 10 రెట్ల వ‌ర‌కు మాత్ర‌మే క్లెయిమ్ చేసుకునే వీలుంది.

ఏమి చేయాలి?
జీవ‌న శైలి అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఒక ట‌ర్మ్ పాల‌సీని త‌ప్ప‌కుండా తీసుకోవాలి. మీ వార్షిక ఆదాయానికి 15 రెట్లు ఎక్కువ‌గా హామీ మొత్తం ఉండేలా చూసుకోవాలి.  లైఫ్ స్టైల్‌, పెరుగుతున్న భాద్య‌తల కార‌ణంగా వ‌చ్చే ఖ‌ర్చుల కోసం అద‌న‌పు పాల‌సీని తీసుకోవ‌చ్చు. క్లెయిమ్ చేసే స‌మ‌యంలో ఎదుర‌య్యే సమస్యలు, జాప్యాలను నివారించడానికి ఒకేసారి అన్ని బీమా సంస్థలకు క్లెయిమ్ దరఖాస్తు చేయ‌కుండా ఉండ‌టం మంచిది. మీ అవ‌స‌రాల‌కు త‌గిన పాల‌సీని ఎంచుకున్నారో లేదో.. బీమా స‌ల‌హాదారుని సంప్ర‌దించి నిర్ధారించుకోవాలని చెట‌ర్జీ తెలిపారు. 

చిన్న వ‌య‌స్స‌లోనే ఎక్కువ మొత్తంలో బీమా క‌వ‌రేజ్‌ను తీసుకోవ‌డం మంచిది. దీని వ‌ల్ల త‌క్కువ ప్రీమియంతో.. ఎక్కువ హామీ పొందేందుకు వీలుంటుంది. క్లెయిమ్ స‌మ‌యంలో స‌మ‌స్య‌లు త‌లెత్త‌కుండా ప్రీమియం స‌మ‌యానికి చెల్లించాలి. అలాగే బీమా సంస్థ‌కు స‌రైన స‌మాచారాన్ని ఇవ్వాలి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని