Aadhaar card: ఆధార్‌కార్డ్‌పై పేరు, పుట్టిన తేదీ, చిరునామా ఎన్నిసార్లు మార్చుకోవచ్చు?
Aadhaar card Update: ఆధార్ కార్డుపై మీ వివరాలు తప్పుగా ఉన్నాయా? వాటిని సవరించాలనుకుంటున్నారా? మరి ఎన్నిసార్లు సవరించాలనే దానిపై పరిమితులున్నాయని తెలుసా?
ఇంటర్నెట్ డెస్క్: ఆధార్ కార్డ్ ప్రాముఖ్యత గురించి చెప్పాల్సిన అవసరం లేదు. హాస్పిటల్ నుంచి బ్యాంకులు, కాలేజీలు, రేషన్ షాపులు ఇలా ప్రతిదగ్గర ఆధార్ కార్డ్ (Aadhaar card) అవసరం పడుతోంది. ముఖ్యంగా అధికారిక గుర్తింపు కార్డుగా దీనికి ఉన్న ప్రాముఖ్యత అంతాఇంతా కాదు. ఈ నేపథ్యంలో ఆధార్ కార్డుపై ఉండే వివరాలు తప్పుల్లేకుండా ఉండడం చాలా ముఖ్యం. ఒకవేళ పొరపాటున ఏమైనా తప్పులున్నా.. సరిచేయించుకుంటే భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
అయితే, 2019లో యూఐడీఏఐ (UIDAI) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆధార్ కార్డు (Aadhaar card)పై ఉండే వివరాలను సవరించడంపై పరిమితి విధించింది. పేరు, పుట్టిన తేదీ, జెండర్ వంటి వివరాలను పరిమిత సంఖ్యలో మాత్రమే మార్చడానికి వీలు కల్పించింది.
పేరు: యూఐడీఏఐ కార్యాలయం మెమోరాండం ప్రకారం.. ఆధార్‌కార్డు (Aadhaar card)పై పేరును రెండుసార్లు మాత్రమే మార్చుకోవడానికి వీలుంటుంది.
పుట్టిన తేదీ: పుట్టిన తేదీని ఒకసారి మాత్రమే మార్చుకోవడానికి యూఐడీఏఐ అనుమతిస్తోంది. అదీ ఆధార్ తొలిసారి తీసుకున్న సమయంలో ఉన్న తేదీకి మూడు సంవత్సరాలు అటూఇటూ మాత్రమే మార్చాలి. ఆధార్ (Aadhaar card) నమోదు సమయంలో పుట్టిన తేదీకి సంబంధించి ఎలాంటి పత్రాలు రుజువుగా సమర్పించనట్లయితే.. దాన్ని ‘డిక్లేర్డ్’ లేదా ‘అప్రాగ్జిమేట్’గా పేర్కొంటారు. తర్వాత ఎప్పుడైనా మార్చుకోవాల్సి వచ్చినప్పుడు కచ్చితంగా ఒక ధ్రువపత్రం సమర్పించాల్సి ఉంటుంది. అయితే, డిక్లేర్డ్ లేదా అప్రాగ్జిమేట్‌గా నమోదై ఉన్నవారికి మాత్రం మూడు సంవత్సరాలు అటూఇటూ నిబంధన వర్తించదు.
జెండర్: ఆధార్ కార్డులో జెండర్ వివరాలు కేవలం ఒకసారి మాత్రమే మార్చడానికి వీలుంటుంది.
ఫొటో: ఆధార్ కార్డ్ (Aadhaar card)పై ఉండే ఫొటోను సవరించుకోవడంపై మాత్రం ఎలాంటి పరిమితి లేదు. దగ్గర్లో ఉన్న ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లి ఫొటోను అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో మార్చడం సాధ్యం కాదు.
చిరునామా: అడ్రస్‌ను మార్చుకోవడంపై కూడా యూఐడీఏఐ ఎలాంటి పరిమితి విధించలేదు. అయితే, చిరునామాను ధ్రువీకరిస్తూ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.
పరిమితికి మించి చేయాలంటే..
పేరు, పుట్టిన తేదీ, జెండర్ వివరాలను పరిమితికి మించి మార్చడానికి వీల్లేదు. ఒకవేళ పరిమితి దాటిన తర్వాత మార్పులు చేయాలనుకుంటే మాత్రం ప్రత్యేక పద్ధతిని అనుసరించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్‌హోల్డర్ దగ్గర్లోని ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లాలి. పరిమితి మంచి సవరణలు చేస్తున్న నేపథ్యంలో అప్‌డేట్‌ను స్వీకరించమని ప్రత్యేకంగా మెయిల్ లేదా పోస్ట్ ద్వారా విజ్ఞప్తి చేయాల్సి ఉంటుంది. ఎందుకు మార్చాల్సి వస్తుందో స్పష్టంగా వివరించాలి. దీనికి ఆధార్ (Aadhaar card) వివరాలు, సంబంధిత పత్రాలు, యూఆర్‌ఎన్ స్లిప్‌ను జత చేయాలి. help@uidai.gov.in మెయిల్ ఐడీకి మెయిల్ పంపాల్సి ఉంటుంది. ప్రత్యేకంగా కోరితే తప్ప ప్రాంతీయ ఆధార్ కార్యాలయాన్ని వ్యక్తిగతంగా సంప్రదించాల్సిన అవసరం లేదు. సంబంధిత అధికారులు విజ్ఞప్తిని క్షుణ్నంగా పరిశీలించి మార్పు సమంజసమేనని భావిస్తే.. అందుకు అనుగుణంగా మార్పులు చేసేందుకు అనుమతి ఇస్తారు. ఈ మేరకు చేయాల్సిన మార్పులకు సంబంధించిన వివరాలను టెక్నికల్ విభాగానికి పంపిస్తారు. కొన్ని రోజుల్లోనే మారిన వివరాలతో కొత్త ఆధార్ కార్డు మీ ఇంటికి వస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Nara Bhuvaneswari: చంద్రబాబు ఏం తప్పు చేశారని జైల్లో నిర్బంధించారు?: నారా భువనేశ్వరి
-
Ganesh Immersion: ట్యాంక్ బండ్లో పీవోపీ విగ్రహాల నిమజ్జనం చేయొద్దు: హైకోర్టు
-
Disease X: మరో మహమ్మారి ముప్పు పొంచి ఉంది: బ్రిటన్ శాస్త్రవేత్తలు
-
IND w Vs SL w: జెమీమా, మంధాన కీలక ఇన్నింగ్స్‌లు.. భారత్ స్కోరు 116/7
-
2000 Note: ₹2 వేల నోట్ల మార్పిడికి ఇంకా 5 రోజులే గడువు!
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు