Post Office: మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌లో గరిష్ఠంగా ఎంత వడ్డీ పొందొచ్చు?

ప్రతి నెలా వడ్డీని అందుకోవడానికి వీలున్న మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌ ఖాతాపై డిపాజిట్‌ పరిమితిని పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు.

Updated : 04 Feb 2023 13:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పోస్టాఫీస్‌ మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌ (POMIS)లో వ్యక్తిగతంగా రూ.4.50 లక్షలు, జాయింట్‌గా రూ.9 లక్షలు డిపాజిట్‌ చేయడానికి ఇప్పటి వరకు అనుమతి ఉండేది. ఇప్పుడు ఇంకాస్త డిపాజిట్‌ చేయడానికి అవకాశం ఏర్పడింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2023 బడ్జెట్‌ ప్రసంగంలో పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌ (POMIS) ఖాతా డిపాజిట్‌ పరిమితిని ఒక ఖాతాకు రూ.4.50 లక్షల నుంచి రూ.9 లక్షలకు, జాయింట్‌ ఖాతాకు రూ.15 లక్షలకు పెంచనున్నట్లు ప్రకటించారు.

పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకం (POMIS) ఖాతాను ఎక్కువగా గ్యారెంటీ నెలవారీ వడ్డీ ఆదాయం కోసం చూస్తున్న పౌరులు, సీనియర్‌ సిటిజన్లు ఉపయోగిస్తున్నారు. ఈ పథకం వడ్డీ రేటు ఇప్పుడు 7.10 శాతంగా ఉంది. ప్రతి నెలా దీనిలో వడ్డీ అందుకోవచ్చు. ఒకవేళ ప్రతి నెలా వచ్చే వడ్డీని ఖాతాదారుడు క్లెయిమ్‌ చేయకపోతే అటువంటి వడ్డీ మొత్తం ఎటువంటి అదనపు వడ్డీని పొందదు. POMIS  ఖాతాలో రూ.9 లక్షలు డిపాజిట్‌ చేస్తే నెలవారీ వడ్డీ ఆదాయం రూ.5,325, జాయింట్‌ ఖాతాలో రూ.15 లక్షలు డిపాజిట్‌ చేస్తే నెలవారీ ఆదాయం రూ.8,875 లభిస్తుంది. ఈ స్కీమ్‌లో కనీసం రూ.1000 పెట్టుబడి పెట్టవచ్చు. ఈ నెలవారీ ఆదాయం పథకం 5 సంవత్సరాల లాక్‌-ఇన్‌ వ్యవధితో వస్తుంది.

ఈ ఖాతాలో రూ.1 లక్ష నుంచి రూ.15 లక్షల వరకు డిపాజిట్‌పై ప్రతి నెలా ఎంత వడ్డీ అందుకోవచ్చో ఈ కింది పట్టికలో చూడండి..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు