FDs: NRO ఎఫ్‌డీలపై ఏ బ్యాంకు వడ్డీ ఎంత?
ఇప్పుడు NRO ఫిక్స్‌డ్ డిపాజిట్లపై భారత్‌లో ఉన్న అన్ని రకాల బ్యాంకులు అత్యధిక వడ్డీ రేటు అందిస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: విదేశాల్లో నివసించే NRIలు.. భారత్‌లో సంపాదించే/పొందే ఆదాయాన్ని ఇక్కడ బ్యాంకుల్లో ఎఫ్‌డీలుగా మదుపు చేయొచ్చు. ఇందుకుగాను NRO ఖాతా బాగా ఉపయోగపడుతుంది. ఆర్‌బీఐ రెపొరేటు పెంపుతో ఈ ఖాతాల ఎఫ్‌డీలపై కూడా బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచాయి. NRIలు తమ డబ్బును NRO ఎఫ్‌డీలుగా బ్యాంకుల్లో డిపాజిట్ చేసి అధిక వడ్డీని సంపాదించొచ్చు. ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం భారతదేశంలో నివాసముండే బంధువులతో కూడా ఖాతాను జాయింట్‌గా నిర్వహించొచ్చు. భారత్‌లో ఆర్జించే చట్టపరమైన ఏ ఆదాయాన్ని అయినా భారతీయ కరెన్సీ రూపంలో NRO ఖాతాలో భద్రపరచుకోవచ్చు. అంతేకాకుండా భారతీయ కరెన్సీలో డబ్బు అవసరమైనప్పుడు.. NRO ఖాతా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
భారత బ్యాంకుల్లో ఎఫ్‌డీలు చేయాలనుకునే NRIలు ఫెమా (FEMA) నిబంధనల ప్రకారం తప్పనిసరిగా NRO ఖాతాను కలిగి ఉండాలి. విదేశాలతో పోలిస్తే ఈ ఖాతాపై వడ్డీ ఎక్కువే ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం పన్ను విధిస్తారు. నిబంధనల ప్రకారం NRO ఖాతా ద్వారా సంపాదించే వడ్డీని విదేశీ ఖాతాకు బదిలీ చేయొచ్చు.
వివిధ బ్యాంకుల 5 ఏళ్ల NRO ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు ఎంతెంత ఉన్నాయో కింది పట్టికలో..
నోట్: ఈ డేటా 2022 నవంబర్ 22 నాటిది. రూ. 2 కోట్ల వరకు డిపాజిట్లపై ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Technology News
E-Waste: ఈ-వ్యర్థాల నియంత్రణ దిశగా భారత్ అడుగులు!
-
General News
TTD: తిరుమలలో ఆగమశాస్త్రాన్ని విస్మరిస్తున్నారు: రమణ దీక్షితులు
-
Movies News
Rajinikanth: అనుమతి లేకుండా అలా చేస్తే చర్యలు తప్పవు :రజనీకాంత్
-
India News
Narendra Modi : ఆదివాసీ సేవలో విరిసిన ‘పద్మా’లు: మోదీ
-
Movies News
Anurag Kashyap: సుశాంత్ చనిపోవడానికి ముందు మెసేజ్ వచ్చింది: అనురాగ్ కశ్యప్
-
General News
Taraka Ratna: కర్ణాటక సీఎం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు: మంత్రి సుధాకర్