అటల్ పెన్షన్ స్కీంలో చేరడానికి ఎంత చెల్లించాలి?
ఈ పథకం కింద చందాదారుడు నెలకు రూ. 1000, రూ. 2000, రూ. 3000, రూ. 4000, రూ. 5000 వరకు మాత్రమే పెన్షన్ గా పొందగలరు....
ఈ పథకం కింద చందాదారుడు నెలకు రూ. 1000, రూ. 2000, రూ. 3000, రూ. 4000, రూ. 5000 వరకు మాత్రమే పెన్షన్ గా పొందగలరు.
అటల్ పెన్షన్ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అసంఘటిత రంగం వారి కోసం ప్రవేశపెట్టింది. దీనిని మే 2015 సంవత్సరంలో ప్రారంభించారు. ఈ పథకాన్ని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) నిర్వహిస్తుంది. ఇప్పటి వరకు ఈ పథకం కింద 1.08 కోట్ల మంది చందాదారులు నమోదు చేసుకోగా, ఇది రూ. 4500 కోట్ల ను సేకరించింది. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన భారతీయులు ఈ పథకంలో చేరవచ్చు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, అటల్ పెన్షన్ యోజన హామీ ఇచ్చిన పింఛను ప్రయోజనాలను కచ్చితంగా అందిస్తుంది. ఇది చందాదారులకు, వారి జీవిత భాగస్వాములకు హామీ ఇచ్చిన పింఛను ప్రయోజనాలను నిలబెట్టుకోవడానికి కావలసిన నిధులను సమకూరుస్తుంది. ఈ పథకం కింద చందాదారుడు నెలకు రూ. 1000, రూ. 2000, రూ. 3000, రూ. 4000, రూ. 5000 వరకు మాత్రమే పెన్షన్ గా పొందగలరు. పథకంలో చేరే సమయంలో చందాదారుడు పైన తెలిపిన వాటిలో ఎంత మొత్తాన్ని పెన్షన్ గా పొందాలనుకుంటున్నాడో ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే, ప్రభుత్వం అనేక మంది నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకుని పెన్షన్ పరిమితిని నెలకు రూ. 10000 వరకు పెంచాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. చిన్న వయస్సులోనే ఈ పథకంలో చేరడం ద్వారా తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రయోజనాలను పొందొచ్చని నిపుణుల అభిప్రాయం
అటల్ పెన్షన్ యోజన పథకంలో పెట్టుబడులు పెట్టడానికి మీరు తెలుసుకోవలసి ఐదు విషయాలను కింద తెలియచేశాము :
- వయస్సు అర్హత:
వ్యక్తి వయస్సు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. అలాగే వారికి 60 సంవత్సరాలు వయస్సు వచ్చినప్పటి నుంచి పెన్షన్ చెల్లిస్తారు.
- చెల్లించాల్సిన కనీస మొత్తం:
ఈ పథకంలో చేరాలనుకునే వారు చెల్లించాల్సిన మొత్తం రూ. 42 నుంచి రూ. 210 మధ్య ఉంటుంది. ఇది చందాదారుడి పథకంలో చేరిన సమయంలో అతని వయస్సు, పెన్షన్ స్లాబ్ ఆధారంగా మారుతూ ఉంటుంది. అలాగే చెల్లించాల్సిన మొత్తం ప్రతినెలా చందాదారుడి బ్యాంకు ఖాతా నుంచి ఆటోమేటిక్ గా డెబిట్ అవుతుంది. చందాదారుడు ప్రతి నెలా, మూడు నెలలకోసారి లేదా ఆరు నెలలకోసారి చెల్లించే ఆప్షన్ ను ఎంచుకోవచ్చు. ఉదాహరణకు ఒక వ్యక్తి 18 సంవత్సరాల వయస్సులో ఈ పథకంలో చేరితే, అతను నెలకు రూ. 1000 పెన్షన్ పొందడానికి ప్రతి నెలా రూ. 42 చెల్లించాల్సి ఉంటుంది.
- పథకం ప్రయోజనాలు:
ముందుగా నిర్దేశించిన స్లాబ్ ప్రకారం చందాదారుడు ఈ పథకం కింద నెలకు రూ. 1000, రూ. 2000, రూ. 3000, రూ. 4000, రూ. 5000 వరకు మాత్రమే పెన్షన్ గా పొందగలరు. ఉదాహరణకు ఒక చందాదారుడు 18 సంవత్సరాల వయస్సులో ఈ పథకంలో చేరితే, అతను 60 సంవత్సరాల తరవాత నెలకు రూ. 5000 పెన్షన్ పొందడానికి ఇప్పటి నుంచి ప్రతి నెలా రూ. 210 చెల్లించాల్సి ఉంటుంది. అదే 40 సంవత్సరాల వయస్సు ఉన్న వ్యక్తి 60 సంవత్సరాల తరవాత నెలకు రూ. 5000 పెన్షన్ పొందడానికి ప్రతి నెలా రూ. 1454 చెల్లించాల్సి ఉంటుంది. ఎంత చిన్న వయస్సులో ఈ పథకంలో చేరితే అంత ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.
- ఆదాయ పన్ను ప్రయోజనాలు:
నేషనల్ పెన్షన్ సిస్టమ్ మాదిరిగానే ఈ పెన్షన్ పథకం కింద చెల్లించే మొత్తానికి కూడా పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80సీసీడీ (1బీ) కింద చెల్లించిన మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. సెక్షన్ 80సీసీడీ (1బీ) ఆదాయ పన్ను మినహాయింపు ప్రకారం ప్రస్తుత పరిమితి రూ. 50,000 గా ఉంది.
- పథకంలో చేరడం, నిష్క్రమించడం ఎలా:
ఈ పథకంలో చేరాలనుకునే వారికి ఏదైనా బ్యాంకులో లేదా పోస్ట్ ఆఫీసు లో పొదుపు ఖాతా తప్పనిసరిగా ఉండాలి. అటల్ పెన్షన్ యోజన చందాదారులు కేవలం కొన్ని సందర్భాల్లో మాత్రమే 60 సంవత్సరాల వయస్సులోపు పథకం నుంచి ముందస్తు నిష్క్రమణ అయ్యే అవకాశం ఉంది. అవి మరణం / నయం కాని వ్యాధులు సోకిన సందర్భాల్లో మాత్రమే ముందస్తు నిష్క్రమణకు అనుమతిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే