SBI: ఓటీపీ ఆధారిత ఏటీఎమ్ క్యాష్ విత్‌డ్రా ఎలా ప‌నిచేస్తుంది?

ఏటీఎమ్‌ల వ‌ద్ద జ‌రిగే మోసాల‌ను నివారించ‌డంలో ఓటీపీ ఆధారిత ఏటీఎమ్ విత్‌డ్రాలు ఉపయోగపడతాయి.

Updated : 11 Apr 2022 15:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్: స్టేట్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఖాతాదారుల కోసం ఓటీపీ (వన్ టైమ్ పాస్‌వ‌ర్డ్‌) ఆధారిత ఏటీఎమ్ విత్‌డ్రాల‌ను అందిస్తోంది. జన‌వ‌రి 2020 నుంచి ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. ₹10 వేలు అంత‌కంటే ఎక్కువ విలువ గ‌ల లావాదేవీల‌కు డెబిట్ కార్డు పిన్ నంబ‌రుతో పాటు రిజిస్ట‌ర్డ్ మొబైల్ నంబ‌రుకు బ్యాంకు పంపిన ఓటీపీనీ ఎంట‌ర్ చేయాలి. 

ఏటీఎమ్ నుంచి ఓటీపీ ద్వారా న‌గ‌దు విత్‌డ్రా చేసుకునే విధానం..

  • ఎస్‌బీఐ ఏటీఎమ్‌ల వ‌ద్ద నగ‌దు విత్‌డ్రా చేసుకునేందుకు ఓటీపీ అవ‌స‌రం. న‌గ‌దు విత్‌డ్రా స‌మ‌యంలో బ్యాంకు మీ రిజిస్ట‌ర్డ్ మొబైల్ నెంబ‌రుకు ఓటీపీ పంపిస్తుంది.
  • ఓటీపీ అనేది నాలుగు అంకెల నంబ‌రు. దీంతో ఒకసారి ఒక లావాదేవీ మాత్ర‌మే చేయ‌గ‌ల‌రు. 
  • ఒక‌సారి మీరు కావాల్సిన నగదు మొత్తాన్ని ఏటీఎమ్ స్క్రీన్‌పై ఎంట‌ర్ చేసిన త‌ర్వాత ఓటీపీ స్క్రీన్ క‌నిపిస్తుంది.
  • మీ మొబైల్ నంబ‌రుకి వ‌చ్చిన ఓటీపీని ఎంట‌ర్ చేసి న‌గ‌దు విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. 

ఏటీఎమ్‌ల వ‌ద్ద జ‌రిగే మోసాలకు చెక్ పెట్టేందుకు ఏటీఎమ్‌ల‌ ద్వారా కార్డ్ ర‌హిత‌ నగదు ఉపసంహరణలు చేసుకునేలా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ఈ సదుపాయం తీసుకొచ్చింది. అన్ని బ్యాంకులు ఈ సౌకర్యాన్ని అందించాలని సూచించింది. యూపీఐ వ్యవస్థను ఉపయోగిస్తున్న అన్ని బ్యాంకులు, ఏటీఎంలలో కార్డ్‌లెస్‌ క్యాష్‌ విత్‌డ్రా సదుపాయం కల్పించనున్న‌ట్లు ఆర్‌బీఐ తెలిపింది. ఈ విధానం ద్వారా భౌతికంగా కార్డులు లేకున్నా సుల‌భంగా న‌గ‌దు ఉప‌సంహ‌రించుకోవ‌చ్చు. అలాగే కార్డ్ స్కిమ్మింగ్‌, క్లోనింగ్ వంటి మోసాల‌ను అడ్డుకోవ‌చ్చ‌ని ఆర్‌బీఐ ఉద్దేశం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని