Updated : 04 May 2022 10:45 IST

LIC IPO: ఎల్‌ఐసీ ఐపీఓకి ఇలా దరఖాస్తు చేసుకోండి!

ఇంటర్నెట్‌ డెస్క్‌: మదుపర్లంతా ఆసక్తిగా ఎదురు చూసిన భారతీయ జీవిత బీమా సంస్థ పబ్లిక్‌ ఇష్యూ (LIC IPO) ప్రారంభమైంది. మే 4న సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభమై 9న ముగియనుంది. షేర్లు మే 17న స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్‌ కానున్నాయి. రిటైల్‌ విభాగంలో తన పాలసీదారులు కోసం ఎల్‌ఐసీ ప్రత్యేకంగా 2.21 కోట్ల (0.35%) షేర్లను కేటాయించింది. వీరికి ఒక్కో షేరుపై రూ.60 రాయితీ సైతం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లూ పాలసీలకు ప్రీమియం చెల్లిస్తున్న పాలసీదారులు ఎల్‌ఐసీలో వాటాదారులుగా మారేందుకు అవకాశం లభించింది.

పాలసీదారులు ఐపీఓలో పాల్గొనాలంటే..

 • మీ శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌)ను ఎల్‌ఐసీ పాలసీకి జత చేయాలి. అయితే, పాలసీకి ఆధార్‌నూ జత చేయడం ద్వారా.. ఎల్‌ఐసీ ఆన్‌లైన్‌ వెబ్‌సైటులో అనేక లావాదేవీలు చేసేందుకు సులువవుతుంది.
 • సాధారణంగా జీవిత బీమా పాలసీ తీసుకునేందుకు పాన్‌ కార్డు తప్పనిసరి కాదు. కానీ, ఎల్‌ఐసీ తన పాలసీదారులకు షేర్లను కేటాయించేందుకు దీన్ని ప్రామాణికంగా తీసుకుంటోంది కాబట్టి, ఇప్పుడు అవసరం అవుతోంది. 
 • పాన్‌ను నమోదు చేసేందుకు.. ముందుగా ఎల్‌ఐసీ అధీకృత వెబ్‌సైట్‌  https://licindia.in/ వెబ్‌సైటులోకి వెళ్లండి. అక్కడ ఆన్‌లైన్‌ పాన్‌ రిజిస్ట్రేషన్‌ అనే లింకు కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేసి, అక్కడున్న సమాచారాన్ని జాగ్రత్తగా చదవండి. అడిగిన వివరాలను నమోదు చేయండి. ఓటీపీ ద్వారా వాటిని అధీకృతం చేయండి. 
 • ఆ తర్వాత మీ పాలసీ- పాన్‌ అనుసంధానం అయ్యిందా లేదా చూసుకునేందుకూ అక్కడే ఏర్పాటు ఉంది. దీనికన్నా ముందు ఎల్‌ఐసీ వెబ్‌సైటులో మీ పాలసీ సంఖ్య ఆధారంగా ఆన్‌లైన్‌ యూజర్‌ ఖాతాను సృష్టించుకోండి. దీనివల్ల మీ పని ఇంకా సులభం అవుతుంది.
 • ఇక ఐపీఓలో షేర్ల కోసం దరఖాస్తు చేయాలంటే డీమ్యాట్‌ ఖాతా ఉండాల్సిందే. పాన్‌, ఆధార్‌, బ్యాంక్‌ ఖాతా వివరాలు.. వీటితో డీమ్యాట్‌ ఖాతా తీసుకోవడం ఎంతో సులభం. మీకు డీమ్యాట్‌ ఖాతా లేకపోతే.. చివరి నిమిషం వరకూ ఎదురుచూడకుండా మీకు నచ్చిన స్టాక్‌ బ్రోకర్‌ ద్వారా వీలైనంత వెంటనే దీన్ని తీసుకోండి.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

 • అర్హతగల మదుపర్లు ‘అప్లికేషన్‌ సపోర్టెడ్‌ బై బ్లాక్డ్‌  ఎమౌంట్‌’ (Application Supported by Blocked Amount-ASBA) ప్రక్రియ ద్వారా ఐపీఓకి దరఖాస్తు చేసుకోవాలని సెబీకి సమర్పించిన ముసాయిదా పత్రాల్లో ఎల్‌ఐసీ పేర్కొంది.

 • ASBA ఖాతా లేనివారు యూపీఐ ఆధారిత యాప్‌ల ద్వారా కూడా దరఖాస్తు చేసుకోచ్చు. భీమ్‌తో పాటు పేటీఎం, గూగుల్‌ ప్లే, ఫోన్‌ పే, మొబిక్విక్‌ యాప్‌లు యూపీఐని ఉపయోగించి ఐపీఓకి దరఖాస్తు చేసుకునేందుకు అనుమతిస్తున్నాయి.

నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా దరఖాస్తు చేసుకునే ప్రక్రియ..

 • నెట్‌ బ్యాంకింగ్‌ ఖాతాలోకి లాగిన్‌ కావాలి

 • ఇన్వెస్ట్‌మెంట్స్ విభాగంలోకి వెళ్లి ఐపీఓ/ఈ-ఐపీఓపై క్లిక్‌ చేయాలి
 • డిపాజిటరీ వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలు నింపి ధ్రువీకరించాలి
 • ఇన్వెస్ట్‌ ఇన్‌ ఐపీఓపై క్లిక్‌ చేయాలి
 • దరఖాస్తు చేయాలనుకుంటున్న ఐపీఓపై క్లిక్‌ చేయాలి. ఇక్కడ ఎల్‌ఐసీ ఐపీని ఎంచుకోవాలి
 • మీరు పాలసీదారులైతే ఆ విభాగంలోకి వెళ్లి షేర్ల సంఖ్య, ధరను ఎంటర్‌ చేయాలి
 • షరతులను పూర్తిగా చదవి చెక్‌బాక్స్‌ను క్లిక్‌ చేయాలి
 • ‘అప్లయ్‌ నౌ’ పై క్లిక్‌ చేసి ప్రక్రియను పూర్తి చేయాలి
 • మీ డబ్బు బ్యాంకు ఖాతాలో బ్లాక్‌ అయిపోతుంది
 • మీకు షేర్లు కేటాయించినట్లు ధ్రవీకరించగానే ఆ డబ్బులు ఖాతా నుంచి డెబిట్‌ అవుతాయిలేదంటే నిర్ణయించిన తేదీన ఆ డబ్బులు మీరు వినియోగించుకోవడానికి అందుబాటులోకి వస్తాయి.

* లేదంటే యూపీఐని సపోర్ట్‌ చేసే గ్రో, జీరోదా, అప్‌స్టాక్స్‌... వంటి ఇన్వెస్ట్‌మెంట్‌ యాప్స్‌ నుంచి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆయా యాప్‌లలో ఐపీఓ సెక్షన్‌కి వెళ్లి ఎల్‌ఐసీ ఐపీఓని సెలెక్ట్‌ చేసుకొని పాలసీదారుల పోర్షన్‌పై క్లిక్‌ చేస్తే సరిపోతుంది.

దరఖాస్తు పూర్తయిన తర్వాత మీకు షేర్లు కేటాయించారో.. లేదో.. https://www.bseindia.com/investors/appli_check.aspx వెబ్‌సైట్‌కి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. అక్కడ మీ ఐపీఓ దరఖాస్తు వివరాలు, పాన్‌ నెంబర్‌ని ఎంటర్‌ చేసి వివరాలు తెలుసుకోచ్చు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని