Updated : 05 May 2022 20:29 IST

LIC IPO: ఎల్ఐసీ ఐఓపీకి ద‌ర‌ఖాస్తు చేయాలా..

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశ స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో అతిపెద్ద ఐపీఓగా నిలిచిన ఎల్ఐసీ ప‌బ్లిక్ ఇష్యూ (LIC IPO) మే 4న ప్రారంభ‌మైంది. మే 9 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ప‌బ్లిక్ ఇష్యూ ద్వారా సంస్థలో 3.50 శాతం వాటాకు సమానమైన 22.13 కోట్ల షేర్లను విక్రయించి రూ.21,000 కోట్లు స‌మీక‌రించ‌నుంది. ధరల శ్రేణి రూ. 902-949గా ప్రకటించారు. అయితే, పాలసీదార్లకు రూ.60; రీటైలర్లు, ఉద్యోగులకు రూ.45 చొప్పున డిస్కౌంటు (తగ్గింపు) ఇస్తున్నారు. ఎల్ఐసీ ఐపీఓలో 1 లాట్ సైజు 15 షేర్లు. రిటైల్ ఇన్వెస్టర్లు గ‌రిష్ఠంగా 14 లాట్స్ వరకు తీసుకోవచ్చు.

ఎల్ఐసీ ఐపీఓకి వివిధ మార్గాల ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకునే విధానం..
నెట్ బ్యాంకింగ్ ద్వారా..

 • ముందుగా మీ నెట్ బ్యాంకింగ్‌కు లాగిన్ అవ్వాలి
 • ఇన్వెస్ట్మెంట్‌ (పెట్టుబ‌డులు) ఆప్ష‌న్‌లో అందుబాటులో ఉన్న ‘ఐపీఓ/ఇ-ఐపీఓ’ పై క్లిక్ చేయాలి
 • కావాల్సిన వివ‌రాల‌ను తెలిపి రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ పూర్తిచేయాలి
 • త‌ర్వాత పెట్టుబ‌డుల‌కు ‘ఎల్ఐసీ ఐపీఓ’ ఆప్ష‌న్‌ను ఎంచుకుని కావాల్సిన షేర్లు, బిడ్ ప్రైస్‌ ఎంట‌ర్ చేయాలి
 • స‌బ్మిట్/అప్లై నౌ బ‌ట‌న్‌పై క్లిక్ చేసి ఆర్డ‌ర్‌ను ప్లేస్ చేసుకోవ‌చ్చు.

గ‌మ‌నిక‌: బ్యాంకును బ‌ట్టి ద‌ర‌ఖాస్తు చేసుకునే ద‌శ‌ల‌లో చిన్న చిన్న మార్పులు ఉండ‌వ‌చ్చు. 

డీ మ్యాట్ ఖాతా ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకునే విధానం..

 • ముందుగా మీ డీ మ్యాట్ ఖాతాకు లాగిన్ అవ్వాలి
 • మెయిన్ మెనూలో కనిపిస్తున్న ఐపీఓ సెక్ష‌న్‌ను క్లిక్ చేయాలి.
 • ఎల్ఐసీ ఐపీఓ ట్యాబ్ ఎంపిక చేసుకుని మీరు పాల‌సీదార్లు అయితే పాల‌సీ హోల్డ‌ర్ల కేట‌గిరీని, రీటైల్ పెట్టుబ‌డిదారులు రీటైల‌ర్ల కేటగిరీ.. ఇలా మీకు సంబంధించిన కేట‌గిరీని ఎంచుకోవాలి.
 • ఇక్క‌డ మీ స‌మాచారాన్ని ఎంట‌ర్ చేసి బిడ్‌ని ప్లేస్ చేసి స‌బ్మిట్‌పై క్లిక్ చేయాలి.
 • మెనూలో కనిపిస్తున్న ‘అప్లై నౌ’ ఎంచుకుని యూపీఐ (UPI) లేదా ఇత‌ర ఆన్‌లైన్ పేమెంట్ ద్వారా చెల్లింపులు చేయ‌వ‌చ్చు.

జీరోధా ద్వారా ద‌ర‌ఖాస్తు చేసే విధానం..

 • మొబైల్ యాప్‌కి లాగిన‌య్యి, మీ ఖాతా వివరాలకు వెళ్లి, కన్సోల్ కింద ఉన్న ఐపీఓ ఎంపికను ఎంచుకోండి.
 • ఇప్పుడు యూపీఐ ఐడీని ఎంట‌ర్ చేసి ఎల్ఐసీ ఐపీఓని ఎంపిక చేసుకుని బిడ్ ఆప్ష‌న్‌పై క్లిక్ చేయాలి.
 • ఇక్క‌డ పెట్టుబ‌డిదారుని ర‌కాన్ని (వ్య‌క్తులు లేదా ఉద్యోగులు లేదా పాల‌సీదార్లు) ఎంచుకోవాలి.
 • మీకు కావాల్సిన లాట్ సైజ్‌, క‌టాఫ్‌ ప్రైస్ ఎంట‌ర్ చేయాలి.
 • మ‌రొక సారి నిర్ధారించుకుని స‌బ్మిట్ చేయాలి.
 • ఐపీఓ ప్రాసెస్ చేసేందుకు యూపీఐ యాప్‌కు వ‌చ్చిన ఆదేశాన్ని అంగీక‌రించాలి.

పేటీఎం మ‌నీ యాప్ ద్వారా..

 • పేటీఎం మ‌నీ యాప్‌కి లాగిన‌య్యి హోం స్క్రీన్‌లో క‌నిపిస్తున్న ఐపీఓ సెక్ష‌న్‌పై క్లిక్ చేయాలి.
 • అక్క‌డ ప్ర‌స్తుతం నడుస్తున్న, ఇటీవ‌లే ముగిసిన, త్వ‌ర‌లో అందుబాటులోకి రానున్న ఐపీఓల జాబితా క‌నిపిస్తుంది.
 • సబ్‌స్క్రిప్షన్ కోసం ఓపెన‌యిన ఐపీఓ ఆప్ష‌న్‌పై క్లిక్ చేసి, ఎల్ఐసీ ఐపీఓపై క్లిక్ చేయాలి.
 • ఇక్క‌డ ఐపీఓ ద‌ర‌ఖాస్తు ఫారం పూరించి, పెట్టుబ‌డిదారుని ర‌కం (వ్య‌క్తులు లేదా ఉద్యోగులు లేదా పాల‌సీదార్లు), బిడ్డింగ్ పరిమాణం, క‌ట్‌-ఆప్ మొత్తం మొద‌లైన‌వి ఎంట‌ర్ చేయాలి.
 • ఇప్పుడు, మీ యూపీఐ ఐడీ (UPI ID)ని జోడిస్తే, మీరు చేసిన‌ అత్యధిక బిడ్ ప్రకారం నిధులు బ్లాక్ చేస్తారు. ఇందుకోసం యూపీఐ యాప్‌కి వ‌చ్చిన ఆదేశాన్ని అంగీక‌రిస్తే ద‌ర‌ఖాస్తు పూర్త‌వుతుంది.

అప్‌స్టాక్స్ ద్వారా..

 • ముందుగా అప్‌స్టాక్స్ అప్లికేష‌న్ లేదా వెబ్‌సైట్‌కి మీ వివ‌రాల‌తో లాగిన‌వ్వాలి. 
 • డిస్క‌వ‌ర్ ట్యాబ్‌లో ఉండే ఇన్వెస్ట్ ఐపీఓపై క్లిక్ చేయాలి.
 • ఐపీఓ ఆప్ష‌న్ ఎంచుకున్న త‌ర్వాత ‘ఓవ‌ర్ వ్యూ’, ‘టైమ్‌లైన్‌’, ‘అప్లై’ అని మూడు ఆప్ష‌న్లు క‌నిపిస్తాయి. ఇక్క‌డ ఐపీఓ ద‌ర‌ఖాస్తు కోసం ‘అప్లై’ పై క్లిక్ చేయాలి. ఓవ‌ర్ వ్యూ, టైమ్‌లైన్ ట్యాబ్‌ల గురించి మ‌రింత స‌మాచారాన్ని 'మోర్ ఇన్ఫ‌ర్మేష‌న్‌'పై క్లిక్ చేసి తెలుసుకోవ‌చ్చు.
 • మీరు 'అప్లై'పై క్లిక్ చేసిన త‌ర్వాత ద‌ర‌ఖాస్తు పేజీకి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్క‌డ పెట్టుబ‌డిదారుని ర‌కం (వ్య‌క్తులు లేదా ఉద్యోగులు లేదా పాల‌సీదార్లు), ఇత‌ర అవ‌స‌ర‌మైన‌ వివ‌రాలు, ఇచ్చి ప్రొసీడ్‌పై క్లిక్ చేయాలి.
 • త‌ర్వాత యూపీఐ ఐడీని ఎంట‌ర్ చేసి ‘క‌న్మర్మ్‌’ పై క్లిక్ చేయాలి. యూపీఐ యాప్‌కి వ‌చ్చిన ఆదేశాన్ని అంగీక‌రిస్తే ద‌ర‌ఖాస్తు పూర్త‌వుతుంది.
 • స్టేట‌స్ ట్యాబ్ కింద ద‌ర‌ఖాస్తు స్థితిని తెలుసుకోవ‌చ్చు.

గుర్తుంచుకోండి: ఐపీఓకి ద‌ర‌ఖాస్తు చేసి బిడ్ చేసిన మొత్తం బిడ్ ఖ‌రారు అయ్యేంత‌వ‌ర‌కు బ్లాక్‌చేస్తారు. బిడ్ ఆమోదం పొందిన తరువాత పెట్టుబ‌డిదారుల ఖాతా నుంచి డ‌బ్బు డిడ‌క్ట్ చేస్తారు. ఎల్ఐసీ పాల‌సీల‌ను పాన్ కార్డు అనుసంధానించిన పాల‌సీదార్లు మాత్ర‌మే పాల‌సీదార్ల కేట‌గిరీ కింద‌ ఐపీఓకి ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు. ఐపీఓలో రిస్క్ ఉంటుంది కాబట్టి మదుపు చేసే ముందు ఆర్థిక సలహాదారుడిని సంప్రదించడం మంచిది.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని