PAN Card: పాన్‌ కార్డు పోయిందా..? ఇలా చేస్తే ఇంటికే కొత్త కార్డు!

కొత్త కార్డు కావాలంటే ఏం చేయాలి? ఒకవేళ నంబర్‌ గుర్తు లేకపోతే పరిస్థితి ఏంటి? అత్యవసరంగా పాన్‌ పొందాలంటే ఉన్న మార్గాలేంటి..?

Updated : 17 Aug 2022 11:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మన నిత్య జీవితంలో ఆధార్‌లానే పాన్‌ కార్డు కూడా భాగంగా మారిపోయింది. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు పూర్తి చేయాలంటే చాలా వరకు పాన్‌ అవసరమవుతోంది. అయితే, ఒకవేళ పాన్‌ కార్డు పోగొట్టుకుంటే పరిస్థితి ఏంటి? దీనికి పరిష్కారం ఉందంటోంది ఐటీ శాఖ. మరి కొత్త కార్డు కావాలంటే ఏం చేయాలి? ఒకవేళ నంబర్‌ గుర్తు లేకపోతే పరిస్థితి ఏంటి? అత్యవసరంగా పాన్‌ పొందాలంటే ఉన్న మార్గమేమిటో ఇప్పుడు చూద్దాం..

పాన్‌ రీప్రింట్‌

  • Step1: పాన్‌ కార్డును పోగొట్టుకున్న వాళ్లు కొత్తగా కార్డు కోసం దరఖాస్తు చేయొచ్చు.
  • Step2: పాన్‌ వివరాలు గుర్తుంటే నేరుగా https://www.onlineservices.nsdl.com/paam/ReprintEPan.html  లేదా https://www.pan.utiitsl.com/PAN_ONLINE/homereprint వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
  • Step3: రిక్వెస్ట్‌ ఫర్‌ రీప్రింట్‌ పాన్‌ కార్డుపై క్లిక్‌ చేయాలి.
  • Step4: పాన్ కార్డు, ఆధార్‌, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేయాలి.
  • Step5: కొత్త కార్డు పొందేందుకు రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. అదే విదేశాల్లో ఉన్న వాళ్లు పాన్‌ కార్డు పొందాలంటే రూ.959 చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను శాఖ వద్ద ఉన్న చిరునామాకు కార్డును పంపిస్తారు.

సత్వరమే కావాలంటే..?

  • Step1: తక్షణ ఇ-పాన్‌ను డౌన్‌లోడ్ చేయడానికి https://www.incometax.gov.in/iec/foportal పోర్టల్‌కు వెళ్లాలి.
  • Step2: ఎడమవైపు దిగువ భాగంలో Instant E-PAN క్లిక్ చేయండి.
  • Step3: New E PAN వద్ద క్లిక్ చేయండి.
  • Step4: మీ ఆధార్ కార్డు నంబర్‌ను నమోదు చేయండి.
  • Step5: నిబంధనలు, షరతులను జాగ్రత్తగా చదివాక Accept బటన్ క్లిక్ చేయండి.
  • Step6: మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్‌ చేయండి.
  • Step7: వివరాలను జాగ్రత్తగా చెక్‌ చేయండి. మీ ఇ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి Confirm క్లిక్ చేయండి.
  • Step8: మీ ఇ-మెయిల్ ఐడీకి ఇ-పాన్ వ‌స్తుంది. అక్కడ ఇ-పాన్ పీడీఎఫ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

వివరాలు గుర్తు లేకపోతే..?
ఒకవేళ మీరు పోగొట్టుకున్న పాన్‌కార్డు వివరాలు మీకు గుర్తు లేకపోతే ఐటీ శాఖకు మీరు ఇ-మెయిల్‌ చేయొచ్చు. adg1.systems@incometax.gov.in లేదా jd.systems1.1@incometax.gov.inకు కొత్త కార్డు కోరుతూ మెయిల్‌ ద్వారా కోరవచ్చు. అలాగే, ఒకవేళ మీ పాన్‌తో ఆధార్‌ అనుసంధానం చేసి లేకపోతే 2022 మార్చి 31లోగా ఆ ప్రక్రియను పూర్తి చేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని