LIC on Whatsapp: వాట్సాప్‌లో ఎల్‌ఐసీ సేవల కోసం ఎలా రిజిస్టర్ అవ్వాలి?
LIC on Whatsapp: పాలసీదారులకు మెరుగైన సేవలందించేందుకు ఓ వాట్సాప్ (Whatsapp) నంబర్‌ను LIC అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా 10 రకాల సేవలు పొందొచ్చు.
ఇంటర్నెట్ డెస్క్: జీవిత బీమా రంగ దిగ్గజం లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ (LIC) పాలసీదారులకు ఎంతగానో ఉపయోగపడే సేవలను ప్రారంభించింది. వాట్సాప్ (Whatsapp)లో 10 రకాల సేవలను అందుబాటులోకి తెచ్చింది. పాలసీదారులు ఎల్‌ఐసీ కేటాయించిన వాట్సాప్ నంబర్‌కు హాయ్ (Hi) అని సందేశం పంపిస్తే చాలు.. సేవలను సులువుగా పొందొచ్చు. ప్రీమియం బకాయిలు, బోనస్ సమాచారం వంటి వివరాలు తెలుసుకోవచ్చు. పాలసీ వివరాలను ఎల్‌ఐసీ పోర్టల్‌లో నమోదు చేసుకొన్న వారు, తమ మొబైల్ నంబరు నుంచి ఈ సేవలను పొందే వీలుంది. ఇంతకీ ఏయే సేవలు లభిస్తాయి? ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? వివరాలను ఎలా పొందాలి? వంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
వాట్సాప్‌లో సేవలు ఎలా?
- ఎల్‌ఐసీ అధికారిక వాట్సాప్ నంబర్ 89768 62090ను మీ మొబైల్‌లో సేవ్ చేసుకోవాలి.
- వాట్సాప్ ఓపెన్‌చేసి ఎల్‌ఐసీ చాట్ బాక్స్‌లోకి వెళ్లాలి.
- HI అని సందేశం పంపగానే.. మీకు 11 ఆప్షన్లు కనిపిస్తాయి.
- ప్రీమియం బకాయి తేదీ తెలుసుకోవడానికి 1.. మీ పాలసీపై వచ్చే లోన్ వివరాలు తెలుసుకోవడానికి 4 వంటి ఆప్షన్లను ఎంచుకోవాల్సి ఉంటుంది.
ఆప్షన్లివే..
1. ప్రీమియం బకాయి
2. బోనస్ సమాచారం
3. పాలసీ స్థితి
4. పాలసీపై వచ్చే రుణ సమాచారం
5. రుణం తిరిగి చెల్లింపు
6. రుణంపై వడ్డీ
7. ప్రీమియం చెల్లింపు సర్టిఫికెట్
8. యులిప్- యూనిట్ల స్టేట్‌మెంట్
9. ఎల్‌ఐసీ సేవలకు సంబంధించిన లింకులు
10. ఆప్ట్ ఇన్/ఆప్ట్ ఔట్ సేవలు
11. సంప్రదింపులు పూర్తిచేయండి.
రిజిస్టర్ ఇలా..
ఎల్‌ఐసీ పోర్టల్‌లో నమోదు చేసుకొంటేనే ఈ సేవలను వాట్సాప్‌లో పొందే వీలుంటుంది. ఒకవేళ మీ మొబైల్ నంబర్‌ను గానీ, మీ ఎల్‌ఐసీ పాలసీ వివరాలను గానీ నమోదు చేసుకోకపోతే ఈ సేవలను పొందలేరు. ఒకవేళ మీరు రిజిస్టర్ చేసుకోకపోయి ఉంటే..
- www.licindia.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
- అందులో కస్టమర్ పోర్టల్ ఆప్షన్‌ను ఎంచుకోండి..
- మీరు కొత్త యూజర్ అయితే New Userపై క్లిక్ చేసి పూర్తి వివరాలు నమోదు చేయండి.
- ఒకవేళ మీరు పాత యూజర్ అయితే యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి.
- అందులో బేసిక్ సర్వీసెస్ విభాగంలో యాడ్ పాలసీని క్లిక్ చేసి ఎన్ని పాలసీలు ఉంటే అన్ని పాలసీల వివరాలు అక్కడ నమోదు చేయొచ్చు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Tanuku: శ్రీరామనవమి వేడుకల్లో అపశ్రుతి.. దగ్ధమైన ఆలయ పందిరి
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Movies News
Dasara Movie Review: రివ్యూ: ‘దసరా’.. నాని సినిమా ఎలా ఉందంటే?
-
India News
Lalit Modi: రాహుల్ గాంధీపై దావా వేస్తా: లలిత్ మోదీ
-
Sports News
IPL 2023: ఈ ఐపీఎల్‌కు దూరమైన కీలక ఆటగాళ్లు వీరే..
-
Crime News
Suicide: చదువుకోమని చెప్పారని.. 9 ఏళ్ల చిన్నారి ఆత్మహత్య