Debit Card: SBI డెబిట్‌ కార్డు పోయిందా? ఏం చేయాలి?

ఎస్‌బీఐ ఏటీఎం/డెబిట్‌ కార్డును ఏదైనా కారణంతో పోగొట్టుకున్నప్పుడు, ఆ కార్డు దుర్వినియోగం కాకుండా..కార్డును బ్లాక్‌ చేయడానికి అనేక పద్ధతులు ఉన్నాయి, అవేంటో ఇక్కడ చూడండి.

Published : 30 Nov 2022 16:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్టేట్‌ బ్యాంక్‌ ఆప్‌ ఇండియా (SBI) ఖాతాదారులు తమ డెబిట్‌ కార్డులను పొగొట్టుకున్న(లేదా  దొంగతనం జరిగినా) సందర్భంలో అనేక పద్ధతుల్లో తమ డెబిట్‌ కార్డును బ్లాక్‌ చేయొచ్చు. కస్టమర్‌ కేర్‌ నంబర్‌కు కాల్‌ చేయడం; బ్యాంకు శాఖను సందర్ళించడం; ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌; విదేశాల్లో (యూఎస్‌ఏ, కెనడా) ఉండే ఖాతాదారులు కూడా తమ డెబిట్‌ కార్డును బ్లాక్‌ చేయవచ్చు.

ఎస్‌బీఐ వెబ్‌సైట్‌ ప్రకారం.. మీ ఎస్‌బీఐ డెబిట్‌ కార్డును బ్లాక్‌ చేసే ముందు గమనించవలసిన ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. మీ మొబైల్‌ నంబర్‌ బ్యాంకు ఖాతాకు లింక్‌ అయ్యుండాలి. మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ నమోదు చేసిన తర్వాత కార్డు స్ర్కీన్‌పై పాక్షికంగా ప్రదర్శితమవుతుంది. అప్పుడు మీరు బ్లాక్‌ చేయాలనుకుంటున్న కార్డు నంబరును ఎంచుకుని, సబ్మిట్‌ బటన్‌పై క్లిక్‌ చేయండి. కార్డు బ్లాక్‌ అవుతుంది. అయితే కార్డు బ్లాక్‌ అయిన తర్వాత ఆన్‌లైన్‌లో దాన్ని అన్‌బ్లాక్‌ చేయలేరు.

వెబ్‌సైట్‌కు వెళ్లి బ్లాక్‌ చేయడం

స్టెప్‌ 1: ఎస్‌బీఐ కార్డును బ్లాక్‌ చేసే (డైరక్ట్‌ లింక్‌) https://retail.onlinesbi.sbi/retail/blockatmcard.htmను సందర్శించండి.


స్టెప్‌ 2: 

  • ఖాతా నంబర్‌ను నమోదు చేయండి.
  • దేశాన్ని ఎంచుకోండి.
  • రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌ను నమోదు చేయండి.
  • క్యాప్చా నంబరును నమోదు చేయండి.
  • సబ్‌మిట్‌పై క్లిక్‌ చేయండి.

టోల్‌ ఫ్రీ నంబర్‌కు కాల్‌ ద్వారా..

1800 11 2211 లేదా 1800 425 3800 టోల్‌ ఫ్రీ నంబరుకు కాల్‌ చేసిన తర్వాత మీరు పొందే సూచనలను పాటించడం ద్వారా, సులభంగా మీ కార్డును బ్లాక్‌ చేయొచ్చు.

SMS ద్వారా బ్లాక్‌

మీరు బ్యాంకుకు ముందే నిర్వచించిన SMS సందేశాన్ని పంపడం ద్వారా మీ ఎస్‌బీఐ ఏటీఎం/డెబిట్‌ కార్డును నిలిపివేయవచ్చు. 567676 నంబరుకు డెబిట్‌ కార్డు నంబరులోని చివరి 4 అంకెలను జోడించి SMS జోడించి పంపాల్సి ఉంటుంది. ఉదాహరణకు చివరి 4 అంకెలు 1234 అయితే BLOCK1234  పంపండి. SMS పంపడానికి బ్యాంకు ఖాతాతో అనుసంధానం (లింక్‌) అయిన మొబైల్‌ ఫోన్‌ నంబరునే ఉపయోగించాలి. బ్యాంకు SMSను స్వీకరించిన తర్వాత మీకు నిర్ధారణ SMS వస్తుంది. SMS నోటిఫికేషన్‌లో టికెట్‌ నంబరు, బ్లాక్‌ చేసిన తేదీ, బ్లాక్‌ చేసిన సమయం ఉంటాయి.

బ్యాంకు శాఖను సందర్శించడం ద్వారా

ఖాతాదారుడు సమీపంలోని శాఖను సందర్శించి ఏటీఎం/డెబిట్‌ కార్డును బ్లాక్‌ చేయమని బ్యాంకు అధికారిని అభ్యర్థించవచ్చు.

చివరిగా: తిరిగి కొత్తగా వేరే డెబిట్‌ కార్డును పొందేటప్పుడు కార్డు రుసుమును బ్యాంకు వసూలు చేస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని