LIC IPO: ఎల్ఐసీ పాల‌సీతో పాన్ లింక్ అయ్యిందా? స్టేట‌స్ చెక్‌ చేయండిలా..

ఎల్‌ఐసీ ఐపీఓలో పాల్గొనాలంటే, పాలసీదార్లు.. వారి ఎల్ఐసీ పాల‌సీతో పాన్‌ వివరాలను అనుసంధానించ‌డం తప్పనిసరి.

Updated : 17 Feb 2022 15:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) వ‌చ్చే నెల‌ (మార్చి 2022)లో పబ్లిక్‌ ఇష్యూ (LIC IPO)కు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఎల్‌ఐసీ ఉద్యోగులు, పాలసీదార్లు కూడా ఈ ఐపీవోలో పాల్గొని రాయితీతో షేర్లకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఎల్ఐసీ క‌ల్పించింది. అయితే, ఐపీవోలో పాల్గొనాలకునే పాల‌సీదారులు, వారి శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌) వివరాలను, పాల‌సీతో తప్పనిసరిగా అనుసంధానించి ఉండాలని ఎల్‌ఐసీ స్పష్టంచేసింది. ఒక‌వేళ ఇప్పటి వరకు పాన్ నంబర్‌ను పాల‌సీతో అనుసంధానించ‌క‌పోతే ఫిబ్రవరి 28లోపు పాలసీదారులు ఈ పనని పూర్తి చేయాలి.

పాన్‌ రిజిస్ట్రేషన్ స్టేటస్‌ చెక్‌ చేసే విధానం..

  • ముందుగా https://licindia.in/Home/Online-PAN-Registration లింక్‌ని క్లిక్ చేసి పేజ్ కింది భాగంలో కనిపిస్తున్న చెక్ పాల‌సీ పాన్ స్టేట‌స్ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.
  • ఇక్కడ పాల‌సీ నంబ‌ర్‌, పుట్టిన తేదీ వివ‌రాలు న‌మోదు చేయండి.
  • ఆ త‌ర్వాత పాన్‌ వివరాలు, క్యాప్చా కోడ్‌ను ఎంట‌ర్ చేసి స‌బ్మిట్ చేయండి.
  • ఎల్ఐసీ పాల‌సీ, పాన్ అనుసంధాన స్థితి మీ కంప్యూట‌ర్/సెల్ ఫోన్ స్క్రీన్‌పై క‌నిపిస్తుంది.

ఒకవేళ మీ పాన్, మీ జీవిత బీమా పాలసీకి లింక్ అవ్వకపోతే ఇప్పుడే అనుసంధానం చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు ఒక ఫారం పూర్తి చేయాల్సి ఉంటుంది.

  • ముందుగా ఎల్ఐసీ ఇండియా వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వాలి.
  • స్క్రీన్‌ కింది భాగంలో పాన్ ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్ ఆప్షన్‌ (https://licindia.in/Home/Online-PAN-Registration) కనిపిస్తుంది.
  • పేజీ ఓపెన్ చేసిన త‌ర్వాత కింది భాగంలో క‌నిపిస్తున్న ప్రాసెస్ బ‌ట‌న్‌పై క్లిక్ చేస్తే వేరొక పేజికి రీ-డైరెక్ట్ అవుతుంది. 
  • ఈ పేజీలో ఒక ఫారం ఉంటుంది. దాన్ని పూర్తి చేయాలి.
  • మొద‌ట‌గా పాన్ కార్డులో ఉన్నట్లు పుట్టిన తేదీని ఎంట‌ర్ చేయండి.
  • జెండర్, ఈ-మెయిల్ ఐడీ, పాన్ వివరాలు ఎంట‌ర్ చేయాలి.
  • ఆ త‌ర్వాత‌ పాన్ కార్డులో ఉన్న విధంగా మీ పూర్తి పేరు ఎంట‌ర్ చేయండి.
  • మీ మొబైల్ నంబ‌ర్‌, పాల‌సీ నంబర్‌ ఇచ్చిన త‌ర్వాత‌ కింద ఒక బాక్స్ క‌నిపిస్తుంది. స‌రైన వివ‌రాలు తెలిపినట్లుగా కింద క‌నిపిస్తున్న బాక్సులో టిక్ చేయాలి. ఈ బాక్సులో టిక్ చేస్తేనే ముందుకు వెళ్లగలుగుతారు.
  • కిందికి వ‌స్తే మీకు క్యాప్చా కోడ్ క‌నిపిస్తుంది. దాన్ని ఎంట‌ర్ చేసి గెట్ ఓటీపీపై క్లిక్ చేయాలి. 
  • మీ మొబైల్‌కి ఓటీపీ వ‌స్తుంది. ఓటీపీని ఎంట‌ర్ చేసి స‌బ్మిట్ చేయాలి.
  • మీ అభ్యర్థనను ఆమోదించిన‌ట్లు కంప్యూట‌ర్‌/మొబైల్ స్క్రీన్‌పై క‌నిపిస్తుంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని