PM Kisan: మీ ఖాతాలోకి పీఎం-కిసాన్‌ డబ్బులు వచ్చాయా? చెక్‌ చేసుకోండిలా!

దేశవ్యాప్తంగా ఉన్న రైతుల‌కు ప్ర‌యోజ‌నం చేకూర్చేందుకు కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కం ప్ర‌ధానమంత్రి కిసాన్ స‌మ్మాన్‌ నిధి (PM-Kisan)

Published : 25 Jun 2022 19:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశవ్యాప్తంగా ఉన్న రైతుల‌కు ప్ర‌యోజ‌నం చేకూర్చేందుకు కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కం ప్ర‌ధానమంత్రి కిసాన్ స‌మ్మాన్‌ నిధి (PM-Kisan). రైతుల‌కు పెట్టుబ‌డి సహాయం అందించాల‌నే ఉద్దేశంతో ప్ర‌భుత్వం ఈ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. సంవ‌త్స‌రానికి మూడు దఫాల్లో రూ.6 వేలు రైతుల‌ ఖాతాకు నేరుగా జ‌మ చేస్తోంది. ఒక్కో విడతలో ఒక్కో రైతుకి రూ.2 వేలు చొప్పున విడుద‌ల చేస్తూ వ‌స్తోంది.

కేంద్ర ప్ర‌భుత్వం ఇప్పటి వరకు ఈ పథకం కింద 10 వాయిదాలను విడుద‌ల చేసింది. నేడు (మే 31, 2022) 11వ వాయిదా నిధుల‌ను విడుద‌ల చేసినట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాలు తెలిపాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో పీఎం సమ్మాన్ నిధి కార్యక్రమం కింద 10 కోట్ల మందికి పైగా రైతులకు రూ.21,000 కోట్లు జ‌మ చేసినట్లు కేంద్ర ప్ర‌భుత్వం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

పీఎం కిసాన్ లబ్ధిదారుడు 11వ వాయిదా డ‌బ్బును పొందేందుకు ఈ-కేవైసీ త‌ప్ప‌నిస‌రిగా చేయాలి. ఆధార్ ఆధారిత ఓటీపీ ద్వారా లేదా బ‌యోమెట్రిక్ ఆధారంగా స‌మీపంలోని సీఎస్‌సీ కేంద్రానికి వెళ్లి ఈ-కేవైసీ పూర్తిచేసుకోవ‌చ్చు. ఈ-కేవైసీ గ‌డ‌వు కూడా నేటితో ముగియనుంది. అందువ‌ల్ల ఇంకా ఈ-కేవైసీ పూర్తిచేయ‌ని వారు ఉంటే వెంట‌నే ఈ ప‌ని పూర్తి చేయండి. 

11వ విడత డ‌బ్బు ఖాతాలో జ‌మ‌య్యిందా? తెలుసుకోండిలా..

* ముందుగా పీఎమ్ కిసాన్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/కి వెళ్లాలి.

* కుడి వైపున క‌నిపిస్తున్న ఆప్ష‌న్ల‌లో బెనిఫిషియ‌రీ స్టేట‌స్ ఆప్ష‌న్ ఉంటుంది.

* సెల‌క్ట్ చేసుకున్న త‌ర్వాత ఆధార్ లేదా ఖాతా నెంబ‌రును ఎంట‌ర్ చేసి 'గెట్ డేటా' పై క్లిక్ చేయాలి.

* స్టేట‌స్ స్క్రీన్‌పై క‌నిపిస్తుంది. ఒక‌వేళ మీరు పీఎం కిసాన్‌కు రిజిస్ట‌ర్ చేసుకుని, ఈ-కేవైసీ పూర్తి చేసి ఉంటే ఖాతాలోకి డ‌బ్బు జ‌మ‌వుతుంది.

* అలాగే ల‌బ్ధిదారుల జాబితాలో పేరు ఉందో.. లేదో.. కూడా చెక్ చేసుకోవ‌చ్చు.

* బెనిఫిషియ‌రీ స్టేట‌స్ కింద బెనిఫిషియ‌రీ లిస్ట్ ఆప్ష‌న్ క‌నిపిస్తుంది.

* ఈ ఆప్ష‌న్‌పై క్లిక్ చేస్తే మ‌రొక పేజీకి రీడైరెక్ట్ అవుతుంది.

* ఇక్క‌డ ల‌బ్ధిదారుని రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, బ్లాక్, గ్రామాల‌ను ఎంచుకుని 'గెట్ రిపోర్ట్‌'పై క్లిక్ చేస్తే ల‌బ్ధిదారుల జాబితా క‌నిపిస్తుంది.

పీఎం కిసాన్ హెల్ప్‌లైన్ నెంబ‌రు 155261 / 011-24300606కు కాల్ చేసి కూడా స‌మాచారం తెలుసుకోవ‌చ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని