
PPF: పీపీఎఫ్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలి?
అత్యంత ప్రజాదరణ పొందిన చిన్న మొత్తాల పొదుపు పథకాలలో పీపీఎఫ్ ఒకటి. పెట్టుబడులకు ప్రభుత్వ హామీతో పాటు మంచి రాబడి అందిస్తున్న పథకం. ఇందులో అసలు, వడ్డీ రెండింటిపై పన్ను ఆదా చేసుకోవచ్చు. ప్రస్తుతం వార్షికంగా 7.1శాతం వడ్డీ లభిస్తుంది. ఈ పథకంలో గరిష్టంగా సంవత్సరానికి రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఖాతా నిర్వహణ కోసం వార్షికంగా కనీసం రూ.500 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. పీపీఎఫ్ ఖాతాకు 15 సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది. కాలపరిమితి పూర్తైన అనంతరం కూడా 5ఏళ్ళ చొప్పున ఖాతాను కొనసాగించవచ్చు.
పీపీఎఫ్ ఖాతా బ్యాలెన్స్ తరచుగా కాకపోయినా ఏడాదికి ఒకసారైనా చెక్ చేసుకోవడం మంచిది. డిపాజిట్‌పై వచ్చే వడ్డీ ఆదాయాన్ని తెలుసుకోవడమే కాకుండా మెచ్యూరిటీ సమయానికి ఎంత మొత్తం చేతికి వస్తుందో ఒక అంచనాకి రావచ్చు. అంతేకాకుండా పీపీఎఫ్‌లో ఖాతా తెరిచిన 7వ సంవత్సరం నుంచి పాక్షిక విత్‌డ్రాలను ప్రభుత్వం అనుమతిస్తుంది. ఒకవేళ ఖాతాలోని మొత్తాన్ని పాక్షికంగా విత్‌డ్రా చేసుకోవాలన్నా బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకోవడం అవసరం.
పోస్టాఫీసులు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో మాత్రమే కాకుండా కొన్ని ప్రైవేట్ రంగ బ్యాంకులలోనూ పీపీఎఫ్ ఖాతాను తెరవచ్చు. ఖాతాలోని మొత్తాన్ని ఆన్లైన్, ఆఫ్‌లైన్ రెండు విధానాలలోనూ తెలుసుకోవచ్చు.
ఆఫ్‌లైన్‌లో పీపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకునే విధానం..
పీపీఎఫ్ ఖాతాదారులకు బ్యాంక్ ఒక ప్రత్యేక పాస్ పుస్తకాన్ని అందిస్తుంది. ఇందులో ఖాతా నంబరు, బ్యాంకు బ్రాంచ్ వివరాలు, మీ ఖాతాలో బ్యాలెన్స్ క్రెడిట్/డెబిట్ వివరాలు మొదలైనవి ఉంటాయి. బ్యాంక్/పోస్టాఫీసు బ్రాంచ్‌కి వెళ్లి పాస్‌బుక్‌ని అప్డేట్ చేసుకోవడం ద్వారా పీపీఎఫ్ బ్యాలెన్స్‌ను తెలుసుకోవచ్చు. కొన్ని బ్యాంకుల్లో ఆటోమేటెడ్ పాస్‌బుక్ అప్డేటెడ్ యంత్రాలు అందుబాటులో ఉంటాయి. వాటి ద్వారా కూడా పాస్‌బుక్ అప్డేట్ చేసుకోవచ్చు.
ఆన్లైన్ ద్వారా తెలుసుకోవాలంటే ఈ కింది అంశాలను నిర్ధారించుకోవాలి..
* ముందుగా మీకు పీపీఎఫ్ ఖాతా ఉన్న అదే బ్యాంకులో పొదుపు ఖాతా ఉండాలి.
* మీ బ్యాంకు పొదుపు ఖాతా పీపీఎఫ్ ఖాతాతో అనుసంధానమై ఉండాలి.
* మీ పొదుపు ఖాతాకు ఆన్లైన్ యాక్సిస్ ఉండాలి. నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్, పాస్వర్డ్ బ్యాంకు నుంచి పొందవచ్చు.
* ఐసీఐసీఐ బ్యాంక్ పీపీఎఫ్ ఖాతా మాదిరిగా కొన్ని బ్యాంకులు ఇతర బ్యాంకులో ఉన్న పొదుపు ఖాతాకు పీపీఎఫ్ ఖాతాను లింక్ చేసుకునే సదుపాయాన్ని అందిస్తున్నాయి.
* ఆన్లైన్ యాక్సిస్‌తో పాటు, పొదుపు ఖాతా ద్వారా నిధులను పీపీఎఫ్ ఖాతాకు బదిలీ చేసే సదుపాయం ఉందని నిర్ధారించుకోవాలి.
* ఒకవేళ మీ పీపీఎఫ్ ఖాతా, పొదుపు ఖాతాకు లింకయ్యి లేకపోయినా, నెట్ బ్యాంకింగ్ యాక్సిస్ లేకపోయినా బ్యాంకికి వెళ్లి సంబంధిత ఫారంలను పూర్తి చేసి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్లైన్లో చెక్ చేసుకునే విధానం..
* ముందుగా మీ బ్యాంక్ ఖాతా, నెట్ బ్యాంకింగ్ రెండు క్రియాశీలకంగా ఉన్నాయని నిర్ధారించుకోవాలి.
* మీ నెట్ బ్యాంకింగ్ ద్వారా పీపీఎఫ్ ఖాతాకు లాగినవ్వాలి.
* ఒకసారి లాగిన్ అయితే మీ ప్రస్తుత పీఎఫ్ బ్యాలెన్స్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
* నెట్ బ్యాంకింగ్ ద్వారా పీపీఎఫ్ ఖాతాకు ఆన్లైన్ ద్వారానే నిధులను బదిలీ చేయవచ్చు. ఇందుకు గానూ బ్యాంక్ వారికి స్టాండర్డ్ సూచనలు ఇవ్వచ్చు. అలాగే ఖాతా స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవడం, రుణం కోసం దరఖాస్తు చేయడం.. వంటివి కూడా ఆన్లైన్ ద్వారానే చేసుకోవచ్చు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs ENG: ముగిసిన రెండో రోజు ఆట.. టీమ్ఇండియాదే పైచేయి
-
Politics News
నరేగా.. మోదీకి ఇష్టం లేని పథకం: రాహుల్ గాంధీ
-
India News
President Election: నామినేషన్ ఉపసంహరణ గడువు పూర్తి.. రాష్ట్రపతి రేసులో ఆ ఇద్దరే!
-
Sports News
RaviShastri: బుమ్రా బ్యాటింగ్‌కు రవిశాస్త్రి ఫిదా.. బీసీసీఐ ప్రత్యేక వీడియో..!
-
General News
Health: ఉబ్బిన సిరలకు సూపర్ గ్లూ..ఏంటో తెలుసుకోండి
-
General News
Andhra News: ఈఏపీసెట్-2022కు ఏర్పాట్లు పూర్తి... ఏపీ, తెలంగాణలో పరీక్షాకేంద్రాలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- IND vs ENG: ముగిసిన రెండో రోజు ఆట.. టీమ్ఇండియాదే పైచేయి
- RaviShastri: బుమ్రా బ్యాటింగ్‌కు రవిశాస్త్రి ఫిదా.. బీసీసీఐ ప్రత్యేక వీడియో..!
- Vikram: విక్రమ్ న్యూ ఏజ్ కల్ట్ క్లాసిక్.. అందుకు నా అర్హత సరిపోదు: మహేశ్‌బాబు
- Diabetes food chart: ఇవి తినండి...షుగర్ తగ్గించుకోండి
- తప్పుడు కేసుపై 26 ఏళ్లుగా పోరాటం.. నిర్దోషిగా తేలిన 70ఏళ్ల వృద్ధుడు
- Raghurama: రెండేళ్ల తర్వాత భీమవరం రానున్న రఘురామ.. అభిమానుల బైక్ ర్యాలీ
- Health Tips:అధిక రక్తపోటుతో కిడ్నీలకు ముప్పు..నివారణ ఎలాగో తెలుసా..?
- Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో చిచ్చు రేపిన యశ్వంత్‌సిన్హా పర్యటన
- IND vs ENG: యువరాజ్ సింగ్‌ను గుర్తుచేసిన బుమ్రా
- social look: లవ్‌లో పడిన రష్మి.. జిమ్‌లో పడిన విద్యురామన్.. ‘శ్రద్ధ’గా చీరకడితే..