బ్యాంకు లాక‌ర్‌ను మూసివేయ‌డం ఎలా?

విలువైన ఆభ‌ర‌ణాలు, ద‌స్తావేజులు భ‌ద్రంగా ఉంచుకునేందుకు లాక‌ర్ స‌దుపాయాన్ని బ్యాంకులు క‌ల్పిస్తాయి. లాక‌ర్‌తో అవ‌స‌రం లేదు అనుకున్న స‌మ‌యంలో దాన్ని ఎలా మూసివేయాలో తెలుసుకుందాం...

Published : 18 Dec 2020 18:06 IST

విలువైన ఆభ‌ర‌ణాలు, ద‌స్తావేజులు భ‌ద్రంగా ఉంచుకునేందుకు లాక‌ర్ స‌దుపాయాన్ని బ్యాంకులు క‌ల్పిస్తాయి. లాక‌ర్‌తో అవ‌స‌రం లేదు అనుకున్న స‌మ‌యంలో దాన్ని ఎలా మూసివేయాలో తెలుసుకుందాం.

లాక‌ర్ల‌లో వ‌స్తువుల‌ను స‌రిచూసుకోవ‌డం

ఎప్పుడూ లాక‌ర్ల‌లో దాచుకునే వ‌స్తువుల జాబితాను సిద్దంగా ఉంచుకోవాలి. ఎందుకంటే లాక‌ర్ల‌లో ఏయే వ‌స్తువులు ఉన్నాయో బ్యాంకు వారికి సైతం తెలిసే అవ‌కాశం ఉండ‌దు క‌నుక‌. మీ జాబితాను తీసుకుని బ్యాంకుకు వెళ్ల‌వ‌చ్చు.

బ్యాంకు మేనేజ‌ర్‌కు ద‌ర‌ఖాస్తు చేయ‌డం

  • లాక‌ర్‌ను మూసివేసేందుకు బ్యాంకు మేనేజ‌ర్‌ను ఉద్దేశిస్తూ లేఖ రాయాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తు ఫారంలో కింది వివ‌రాల‌ను పేర్కొనాల్సి ఉంటుంది.
  • లాక‌రు నంబ‌రు, లాక‌రు ర‌కం, స్వంత‌దారుడి పూర్తిపేరు, ఫోన్ నంబ‌రు, లాక‌రును క‌లిగి ఉన్న కాలం, సంత‌కం మొద‌లైన‌వి.
  • వీటితో పాటు వ్య‌క్తిగ‌త గుర్తింపు కార్డును జ‌త‌ప‌రచ‌వ‌ల‌సి ఉంటుంది.

లాక‌రును ఖాళీచేయ‌డం

లాక‌రును బ్యాంకుకు స్వాధీన‌ప‌రిచేముందు అందులో ఉన్న వ‌స్తువుల‌న్నింటినీ తీసుకోవాలి. జాబితాను చేతిలో ఉంచుకుని ఒక్కో వ‌స్తువును తీసివేయ‌గానే టిక్ చేసుకోవ‌డం మంచిది. ఈ విధంగా చేస్తే విలువైన వ‌స్తువుల‌ను కోల్పోకుండా ఉంటారు.

అక్‌నాలెడ్జ్‌మెంట్‌

పై మూడు ప్ర‌క్రియ‌లు పూర్త‌యిన త‌ర్వాత బ్యాంక్ మేనేజ‌ర్ అధికారిక ముద్ర క‌లిగిన అక్‌నాలెడ్జ్‌మెంట్‌ను ఇస్తారు. అక్‌నాలెడ్జ్‌మెంట్‌లో లాక‌రు క‌లిగి ఉన్న వ్య‌క్తి పేరు, బ్యాంకు శాఖ, లాక‌రు క‌లిగి ఉన్న కాలం వంటి వివ‌రాలు ఉంటాయి. లాక‌రు కాల‌ప‌రిమితికి ముందే లాక‌రును స్వాధీన‌ప‌రిస్తే మిగిలిన కాలానికి సంబంధించి లాక‌రు హ‌క్కుదారుడికి కొన్ని బ్యాంకులు రీఫండ్ చేస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని