Loan Recovery: లోన్ రికవరీ ఏజెంట్లు వేధిస్తున్నారా?ఇలా చేయండి..
రుణాలు తీసుకున్న రుణగ్రహీతలు..రుణ సంస్థలకు సంబంధించిన లోన్ రికవరీ ఏజెంట్లతో ఇబ్బందులు ఎదురయితే ఏం చేయాలో ఇక్కడ ఉంది.
ఇంటర్నెట్ డెస్క్: బ్యాంకులు, రుణ సంస్థలు రుణాలను విరివిగా ఇస్తున్నాయి. వినియోగదారులకు రుణ మంజూరు ఎంత వేగంగా జరుగుతుందో.. డిఫాల్ట్‌లు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. అయితే, ఈ డిఫాల్ట్‌ల విషయమై చాలా రుణ సంస్థలు రికవరీ ఏజెంట్ల రూపంలో వినియోగదారులపై కఠినమైన వేధింపులు గురిచేస్తున్నారనే చాలా ఫిర్యాదులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కు వెళ్లాయి. ఇటీవల కాలంలో రికవరీ వేధింపుల సంఘటనలు పెరుగుతున్నాయని ఆర్బీఐ దృష్టికి వచ్చింది. కొవిడ్ తర్వాత బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలు రుణాలు సరిగ్గా వసూలు కాక చాలా ఒత్తిడికి లోనయ్యాయి. దీంతో రికవరీ ఏజెంట్లపై ఒత్తిడిని పెంచాయి. ఫలితంగా, రుణాలు వసూలు చేయడానికి ఈ ఏజెంట్లలో చాలా మంది ఆమోదయోగ్యం కాని పద్ధతులను ఆశ్రయించడం ప్రారంభించాయి.
ఆర్బీఐ ఏం చెబుతోంది?
రికవరీ ఏజెంట్ల చేతిలో ప్రజలు వేధింపులకు గురికాకుండా ఉండేందుకు ఆర్బీఐ గతంలోనే కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. రికవరీ ఏజెంట్ల చర్యల బాధ్యత బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, ఫిన్‌టెక్‌లపై కూడా ఉంటుంది. రికవరీ సమయంలో ఏజెంట్లు మాటలతో లేదా శారీరకంగా రుణగ్రహీతలను భయపెట్టడం లేదా వేధించడం లేదని రుణ సంస్థలు నిర్ధారించుకోవాలని ఆర్బీఐ సూచించింది. రుణ గ్రహీతలను బహిరంగంగా అవమానపరచడం లేదా గోప్యతకు భంగం కలిగించడం వంటి ఉద్దేశంతో వారు ఎటువంటి చర్యలకూ పాల్పడరాదు. రికవరీ ఏజెంట్లు ఫోన్ కాల్స్ ద్వారా లేదా సోషల్ మీడియాలో ఎలాంటి అనుచితమైన సందేశాలను పంపడానికి, బెదిరించడానికి అనుమతి ఉండదు. రికవరీ కాల్లు ఉదయం 8, సాయంత్రం 7 గంటల మధ్య మాత్రమే చేయాలి. అయితే, ఈ మార్గదర్శకాలు అమల్లో ఉన్నప్పటికీ.. ప్రజలు తమ హక్కులపై అవగాహన లేకపోవడంతో ఏజెంట్ల వేధింపులకు గురవుతూనే ఉన్నారు.
రికవరీ ఏజెంట్లు చేసేవి..
బకాయిల రికవరీ కోసం రుణగ్రహీతల స్నేహితులు, కుటుంబ సభ్యులను సంప్రదించడం, వారి పని ప్రదేశంలో లేక ఇరుగుపొరుగు వారి ఎదుట గొడవలు సృష్టించడం వంటి చర్యల ద్వారా పరువు తీసేందుకు రికవరీ ఏజెంట్లు ప్రయత్నిస్తుంటారు. అటువంటప్పుడు బ్యాంకు, ఏజెంట్‌పై పరువు నష్టం దావా వేసే హక్కు రుణగ్రహీతకు ఉంటుంది. అదేవిధంగా, రికవరీ ఏజెంట్ మీ అనుమతి లేకుండా మీ ఆస్తిని అతిక్రమించి ఉంటే, మీరు వారికి వ్యతిరేకంగా కోర్టులో అతిక్రమణ దావా వేయొచ్చు.
వేధింపులను ట్రాక్ చేయండి
చెల్లింపుల్లో డిఫాల్ట్ అయినప్పుడు రికవరీ ఏజెంట్లు కనెక్ట్ కావడానికి ప్రయత్నిస్తున్నట్లయితే.. రుణగ్రహీతలు తప్పనిసరిగా తెలుసుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఏజెంట్ మిమ్మల్ని వేధిస్తున్నట్లయితే, రికవరీ ఏజెంట్ నుంచి వచ్చిన అన్ని కాల్స్, ఇ-మెయిల్స్, ఎస్సెమ్మెస్‌లు ట్రాక్ చేయండి. వేధింపులకు గురవుతున్నట్లు నిరూపించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా, లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపుల ఫిర్యాదును ఎక్కడ చేయాలో.. ఎలా చేయాలో చూద్దాం.
రుణగ్రహీత చేయాల్సినవి
తక్షణ ఉపశమనం కోసం వేధింపులకు గురవుతున్న వ్యక్తి స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయొచ్చు. పోలీసులు ఎటువంటి సాయం అందించకపోయినా లేదా ఫిర్యాదును నమోదు చేయకపోయినా, రుణగ్రహీత బ్యాంకుకు వ్యతిరేకంగా మధ్యంతర ఉపశమనం కోసం కోర్డులో సివిల్ ఇంజంక్షన్ దాఖలు చేసే అవకాశం ఉంటుంది. వేధింపులకు వ్యతిరేకంగా పరిహారం కోరవచ్చు. ఈ వేధింపుల ఆధారాలతో రుణానికి సంబంధించిన అధికారిని లేదా రుణ సంస్థను కూడా సంప్రదించొచ్చు. రుణగ్రహీత థర్డ్-పార్టీ రికవరీ ఏజెంట్ నుంచి ఏ రకమైన వేధింపులకు గురయినా, ఆ చర్యను ఫిర్యాదు రూపంలో నేరుగా బ్యాంకు అంబుడ్స్‌మన్ దృష్టికి తీసుకెళ్లాలి. మీ ఫిర్యాదులను బ్యాంకు అంబుడ్స్‌మన్ పరిష్కరించకపోతే/వేధింపులు ఇంకా కొనసాగితే.. రుణగ్రహీత తప్పనిసరిగా ఆర్బీఐకు ఫిర్యాదును లేఖ రూపంలో/ఇ-మెయిల్ చేసి పూర్తి పరిస్థితిని వివరించాలి. బ్యాంకు లేదా దాని ఏజెంట్లు ఆర్బీఐ మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లయితే ఆర్బీఐ తీవ్రమైన చర్యలు తీసుకుంటుంది.
చివరిగా: రుణాల చెల్లింపుల్లో ఆర్బీఐ మార్గదర్శకాలను ఉల్లంఘించడం, రికవరీ ఏజెంట్లు అనుసరించే చట్టవిరుద్ధ పద్ధతులను ఆర్బీఐ తీవ్రంగా పరిగణిస్తుందని, రుణాలు/అడ్వాన్సుల విషయంలో ఆర్బీఐ సర్క్యులర్ చాలా కచ్చింతంగా పేర్కొంది. అవసరమైతే రుణగ్రహీతకు సంబంధించిన నిర్దిష్ట ప్రాంతంలో రికవరీ ఏజెంట్లను నిషేదిస్తుంది. మార్గదర్శకాలను నిరంతరం ఉల్లంఘిస్తే.. ఆయా రుణ సంస్థలపై కఠిన చర్యలు కూడా తీసుకుంటుంది. అయితే, నిజమైన ఫిర్యాధులపై మాత్రమే ఆర్బీఐ కఠిన చర్యలు తీసుకుంటుందని గమనించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Flash Pay: కీ చైన్‌తో పేమెంట్స్.. ఫెడరల్ బ్యాంక్ నుంచి ఫ్లాష్ పే
Federal Bank flash pay: ఫెడరల్ బ్యాంక్ స్మార్ట్ కీ చైన్‌ను తీసుకొచ్చింది. కాంటాక్ట్ లెస్ పేమెంట్ల కోసం దీన్ని వినియోగించుకోవచ్చు. -
పిల్లల పేరిట ఎఫ్డీ
పెట్టుబడికి రక్షణ, రాబడికి హామీ ఉన్న పథకాల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీ) ముందుంటాయి. పిల్లల చదువులు, ఇతర అవసరాల కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటున్న తల్లిదండ్రులు వీటికి ప్రాధాన్యం ఇస్తుంటారు -
సిబిల్ నివేదికలో తప్పులుంటే
రుణం తీసుకోవాలంటే.. బ్యాంకులు ముందుగా పరిశీలించేది క్రెడిట్ నివేదికనే. ఇందులో ఎలాంటి తప్పులూ దొర్లకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే మనకు అవసరం ఉన్నప్పుడు రుణం కోసం వెళ్తే దరఖాస్తును తిరస్కరించే అవకాశం ఉంది. -
Personal Loans: వ్యక్తిగత రుణాల వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయ్?
ప్రస్తుతం అన్ని బ్యాంకులు వ్యక్తిగత రుణాలను అందిస్తున్నాయి. వివిధ బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు ఎంతెంతో ఇక్కడ చూద్దాం... -
Home loan: జీరో ప్రాసెసింగ్ ఫీజు.. 8.3% వడ్డీకే హోమ్‌లోన్
Bank of India home loan offer: బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణాలపై వడ్డీ తగ్గించింది. ప్రాసెసింగ్ ఫీజు సైతం రద్దు చేసింది. మార్చి 31 వరకు ఈ ఆఫర్ ప్రకటించింది. -
ప్రత్యేక ఎఫ్డీలను ప్రారంభించిన నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్లపై గరిష్ఠంగా 9.25% వడ్డీ వరకు పొందొచ్చు. -
Credit Card: క్రెడిట్ కార్డును పరిమితికి మించి వాడుకోవచ్చా?
Credit Card: క్రెడిట్ వాడకంపై తరచూ ఎదురయ్యే కొన్ని కీలక సందేహాలకు ఇటీవల ఆర్బీఐ సమాధానాలు ఇచ్చింది. అవేంటో చూద్దాం..! -
వ్యక్తిగత రుణాలు మోసాల బారిన పడొద్దు
ఎలాంటి హామీ లేకుండా లభించే వ్యక్తిగత రుణాలు అవసరమైనప్పుడు ఎంతో ఉపయోగపడతాయి. మన అవసరాలను ఆసరాగా తీసుకొని, సైబర్ మోసగాళ్లు మన కష్టార్జితాన్ని కాజేసేందుకు సిద్ధంగా ఉంటారు. -
Gold Loans: బంగారు రుణాలపై వడ్డీ రేట్లు ఏ బ్యాంకులో ఎంతెంత?
సురక్షితమైన రుణం కాబట్టి బ్యాంకులు బంగారంపై సరసమైన వడ్డీ రేట్లకు వేగంగా రుణాలందిస్తున్నాయి. వివిధ బ్యాంకులు వసూలుచేసే వడ్డీ రేట్లు ఇక్కడ చూద్దాం.. -
FD Rates: సీనియర్ సిటిజన్ల ఎఫ్డీలపై వడ్డీ రేట్లు ఇవే..
చాలా ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు అత్యధిక వడ్డీ రేటును అందిస్తున్నాయి. 1, 3, 5 ఏళ్ల ఎఫ్డీలపై వడ్డీ రేట్లను ఇక్కడ చూడండి. -
పొదుపు ఖాతాలో ఎంత డబ్బు ఉండాలి?
వ్యక్తిగత ఆర్థిక విషయాల్లో పొదుపు ఖాతాకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. మనం చేసే ఆదాయ-వ్యయాలన్నింటికీ ఆధారం ఇదే. బ్యాంకు, మీరు ఎంచుకున్న ఖాతా రకాన్ని బట్టి, ఇందులో కనీస నిల్వ ఎంత ఉండాలన్నది ఆధారపడి ఉంటుంది. వేతనం ఖాతాలో సున్నా నిల్వ ఉన్నా ఇబ్బందేమీ ఉండదు. -
Car Loans: కారు రుణాలపై ఏ బ్యాంకులో వడ్డీ రేట్లు ఎంతెంత?
దాదాపుగా అన్ని బ్యాంకులు వాహన రుణాలందిస్తున్నాయి. ఈ రుణాలకై వివిధ బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు ఇక్కడ చూద్దాం. -
Credit Cards: హెచ్డీఎఫ్సీ నుంచి ఐదు కొత్త బిజినెస్ క్రెడిట్ కార్డులు
Credit Cards: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఇటీవల నాలుగు కొత్త బిజినెస్ క్రెడిట్ కార్డులను విడుదల చేసింది. వాటి ఫీచర్లు, జాయినింగ్ ఫీజు, అర్హతల వంటి వివరాలను చూద్దాం.. -
Two wheeler insurance: బైక్ ఇన్సూరెన్స్.. ఇవన్నీ తెలుసుకున్నాకే..!
Two wheeler insurance: మీ టూవీలర్‌కు బీమా చేయించాలని చూస్తున్నారా? మంచి పాలసీ తెలుసుకోలేకపోతున్నారా? ఈ కింది విషయాలపై ఓ లుక్కేయండి. -
గృహరుణం ఇప్పుడేం చేయాలి?
ఏడాది కాలంగా రెపో రేటు 6.50 శాతం వద్ద కొనసాగుతోంది. దీన్ని పెంచకపోవడం మంచి పరిణామమే. అదే సమయంలో ద్రవ్యోల్బణం స్థిరంగా ఉన్నప్పటికీ, వడ్డీ రేట్లను తగ్గించేంతగా సహకరించడం లేదు. -
కార్పొరేట్ బాండ్లు ఎంచుకోండి జాగ్రత్తగా
మన దేశంలో అత్యంత సురక్షితమైన, ప్రజాదరణ పొందిన పొదుపు పథకాల్లో బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీ) ముందుంటాయి. నిర్ణీత కాలానికి, స్థిరమైన వడ్డీని అందించే వీటిని చాలామంది ఇష్టపడతారు. -
Saving Account: పొదుపు ఖాతా గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
బ్యాంకులో పొదుపు ఖాతా అనేది ఖాతాదారుడికి ఒక విభిన్నమైన ఆర్థిక సాధనం. ఇది ఖాతాదారుడికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. -
Fixed Deposits: ఎఫ్డీలపై వడ్డీ రేట్లను సవరించిన ఐసీఐసీఐ
ఐసీఐసీఐ బ్యాంకు ఎంపిక చేసిన కొన్ని కాలవ్యవధుల ఎఫ్డీలపై వడ్డీ రేట్లు పెంచింది. ఈ బ్యాంకులో సీనియర్ సిటిజన్లు గరిష్ఠంగా 7.75% వడ్డీని పొందుతారు. -
కారు రుణంపై టాపప్
మీకు ఇప్పటికే కారు రుణం ఉందా? అత్యవసరంగా డబ్బు కావాలా? కారు రుణంపై టాపప్ తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. మంచి రుణ చరిత్ర ఉన్న వారికి బ్యాంకులు సులభంగానే ఈ టాపప్‌ను అందిస్తాయి. -
Emergency Loan: అత్యవసరంగా డబ్బు అవసరం పడినప్పుడు ఉన్న ఆప్షన్స్ ఏంటి?
చాలా మందికి అత్యవసరంగా నగదు అవసరం ఏర్పడొచ్చు. అలాంటప్పుడు మెరుగైన క్రెడిట్ స్కోరున్నా, కొన్ని కేటగిరీల ఆస్తులున్నా సరే వేగంగా రుణం పొందొచ్చు. -
Credit Card: క్రెడిట్ కార్డు కనీస మొత్తం చెల్లిస్తుంటే
క్రెడిట్ కార్డు బిల్లును మొత్తం ఒకేసారి చెల్లించాలి. కొన్నిసార్లు చేతిలో డబ్బు లేకపోతే.. కనీస మొత్తం మనల్ని ఆకర్షిస్తుంటుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 100 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్‌ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్‌కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్‌కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!