Cyber Attacks: ఈ ఉచిత టూల్స్‌తో మీ డిజిటల్ లైఫ్‌కు భరోసా!
యూజర్ల డేటా లక్ష్యంగా జరుగుతున్న సైబర్ దాడులకు అడ్డుకునేందుకు సైబర్ స్వచ్ఛ కేంద్ర (Cyber Swachhta Kendra) ద్వారా ఉచిత యాంటీ వైరస్‌లను అందిస్తోంది. మొబైల్, కంప్యూటర్‌తోపాటు బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్లు, స్టోరేజ్ డివైజ్‌లకు, యాప్‌లకు ఇవి అందుబాటులో ఉన్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం ఎక్కువ మంది డిజిటల్ లైఫ్‌స్టైల్‌కు అలవాటు పడిపోయారు. గుర్తింపు పత్రాల నుంచి బ్యాంక్ ఖాతాల వివరాల వరకు అన్ని ఆన్‌లైన్‌లోనే. స్మార్ట్‌ఫోన్ వినియోగంపై ఎక్కువ మంది అవగాహన రావడంతో.. యూజర్లకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వాలతో పాటు, ప్రయివేటు సంస్థలు ఆన్‌లైన్ సేవలను అందిస్తున్నాయి. వాటితోపాటు యూజర్ల డేటా లక్ష్యంగా సైబర్ దాడులు పెరిగాయి. ఈ నేపథ్యంలో బాట్‌నెట్ గురించి ప్రభుత్వాలు, సైబర్ సెక్యూరిటీ సంస్థలు యూజర్లను అప్రమత్తం చేస్తున్నా.. రోజూ కొన్ని వేల సైబర్ నేరాలు జరుగుతున్నాయి.
బాట్‌నెట్ దాడుల నుంచి డివైజ్‌లను కాపాడుకునేందుకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, సాంకేతిక సమాచార మంత్రిత్వ శాఖ ఉచితంగా యాంటీ వైరస్‌లను అందిస్తోంది. వీటిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు టెలికాం విభాగం (DoT) ఎస్సెమ్మెస్స్‌ల ద్వారా సైబర్ స్వచ్ఛ కేంద్ర (Cyber Swachhta Kendra - CSK) వెబ్‌సైట్ లింక్‌లను మొబైల్ వినియోగదారులకు పంపుతోంది. దీన్నే బాట్‌నెట్ క్లీనింగ్ అండ్ మాల్‌వేర్ అనాలసిస్ సెంటర్‌గా కూడా పిలుస్తారు. ఇది, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్, యాంటీ వైరస్ కంపెనీలతో కలిసి పనిచేస్తుంది. మరి, ఉచిత యాంటీ వైరస్‌లను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? అసలు బాట్‌నెట్ అంటే ఏంటి? ఇది యూజర్ డివైజ్‌లలోకి ఎలా ప్రవేశిస్తుందో తెలుసుకుందాం.
బాట్‌నెట్ అంటే ఏంటి?
బాట్‌నెట్ అనేది ఒక నెట్‌వర్క్. సైబర్ దాడుల/మోసాలకు పాల్పడే వ్యక్తులు బాట్ అనే మాల్‌వేర్‌ను యూజర్ల స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్లలోని ప్రవేశపెడతారు. దాంతో ఆయా డివైజ్‌లు బాట్‌నెట్ నెట్‌వర్క్ పరిధిలోకి వస్తాయి. హ్యాకర్లు వీటిని పూర్తిస్థాయిలో కంట్రోల్ చేయగలుగుతారు. దీంతో యూజర్ల డేటా సేకరించడంతోపాటు, యూజర్ అనుమతి లేకుండా స్పామ్ కాల్స్ చేయడం, ఇతరులకు మెస్సేజ్‌లు చేయడం వంటివి చేయొచ్చు. బ్యాంకింగ్ వివరాలతోపాటు యూజర్‌నేమ్‌లు, పాస్‌వర్డ్‌లు తెలుసుకునే అవకాశం ఉంటుంది. బాట్ మాల్‌వేర్ ఉన్న మెయిల్, వెబ్‌సైట్, డాక్యుమెంట్‌ను యూజర్లు తమ డివైజ్‌లలో ఓపెన్ చేస్తే, ఇది ఫోన్, కంప్యూటర్‌లోకి ప్రవేశిస్తుంది. బహిరంగ ప్రదేశాల్లో అందుబాటులో ఉండే భద్రతలేని వైఫై నెట్‌వర్క్‌ల ద్వారా కూడా ఇది వ్యాపిస్తుంది.
ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?
ఉచితంగా యాంటీ వైరస్‌లను డౌన్‌లోడ్ చేసుకునేందుకు www.csk.gov.in అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లి సెక్యూరిటీ టూల్స్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అందులో మైక్రోసాఫ్ట్ విండోస్ కంప్యూటర్లతోపాటు ఆండ్రాయిడ్ ఫోన్లకు సీఎస్‌కే అందిస్తున్న వివిధ కంపెనీల యాంటీ వైరస్ డౌన్‌లోడ్ లింక్‌లు కనిపిస్తాయి.
- మైక్రోసాఫ్ట్ విండోస్ ఓఎస్‌తో పనిచేసే కంప్యూటర్ల కోసం క్విక్ హీల్ (Quick Heal), ఇ-స్కాన్ (eScan Antivirus), కే7 సెక్యూరిటీ (K7 Secuirty) కంపెనీలు ఉచిత బాట్ రిమూవల్ టూల్స్‌ను అందిస్తున్నాయి. వీటి డౌన్‌లోడ్ లింక్‌లపై క్లిక్ చేస్తే ఆయా వెబ్‌సైట్‌లు ఓపెన్ అవుతాయి. అందులోనే యాంటీ వైరస్‌లు ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలో వివరిస్తూ టూల్ కిట్ కూడా ఉంటుంది.
క్విక్ హీల్ యాంటీ వైరస్ డౌన్‌లోడ్ కోసం క్లిక్ చేయండి , ఈస్కాన్ యాంటీ వైరస్ డౌన్‌లోడ్ కోసం క్లిక్ చేయండి , కే7 సెక్యూరిటీ యాంటీ వైరస్ డౌన్‌లోడ్ కోసం క్లిక్ చేయండి
- ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం ఈ స్కాన్ కంపెనీ, సీడాక్ హైదరాబాద్ (C-DAC Hyderabad) బాట్ రిమూవల్ యాప్‌ను అందిస్తున్నాయి. వీటిని గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఈ స్కాన్ డౌన్‌లోడ్ లింక్ కోసం క్లిక్ చేయండి , సీడాక్ ఎమ్-కవచ్2 డౌన్‌లోడ్ లింక్ కోసం క్లిక్ చేయండి
- పెన్‌డ్రైవ్, ఎక్స్‌టర్నల్ హార్డ్‌డ్రైవ్, మొబైల్ ఫోన్లతో పాటు ఇతర యూఎస్‌బీ స్టోరేజ్ డివైజ్‌లను కంప్యూటర్‌కి కనెక్ట్ చేస్తుంటాం. కొన్నిసార్లు వాటితో కూడా వైరస్ వచ్చే ప్రమాదం ఉంది. వీటిని నిరోధించేందుకు సీడాక్ (C-DAC) యూఎస్‌బీ ప్రతిరోధ్ (USB Pratirodh) పేరుతో యాంటీ వైరస్‌ను అందిస్తుంది. డౌన్‌లోడ్ కోసం క్లిక్ చేయండి
- మొబైల్ ఫోన్లలానే డెస్క్‌టాప్ కంప్యూటర్లకు కూడా ఎన్నో రకాల యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటి ద్వారా వైరస్ కంప్యూటర్లలో ప్రవేశించకుండా సీడాక్ యాప్‌సమ్‌విద్ (AppSamvid) పేరుతో యాంటీ వైరస్‌ను అందిస్తుంది. డౌన్‌లోడ్ కోసం క్లిక్ చేయండి
- మనకు కావాల్సిన సమాచారం కోసం వెబ్ బ్రౌజింగ్ చేస్తుంటాం. కొన్ని సార్లు మన ప్రమేయం లేకుండా మాల్‌వేర్ లింక్‌లు, వెబ్‌సైట్ల ద్వారా హ్యాకర్స్ దాడి చేస్తారు. దీన్ని నిరోధించేందుకు సీడాక్ సంస్థ బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్‌ను అందిస్తుంది. బ్రౌజర్ జేఎస్ గార్డ్ (Browser JS Guard) పేరుతో గూగుల్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్ ఎక్స్‌టెన్షలలో ఇది అందుబాటులో ఉంది. క్రోమ్ ఎక్స్‌టెన్షన్ - డౌన్‌లోడ్ కోసం క్లిక్ చేయండి, ఫైర్‌ఫాక్స్ ఎక్స్‌టెన్షన్ - డౌన్‌లోడ్ కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Narendra Modi: శివతత్వం ప్రతిబింబించేలా వారణాసి క్రికెట్ స్టేడియం.. నేడు శంకుస్థాపన చేయనున్న నరేంద్ర మోదీ
-
Crime News: కుమారుడిని చంపి.. ఇంటి ముందు పడేసి: ‘మీ సింహమిదిగో’ అంటూ హేళన
-
Nani: అప్పుడే మొదటి సారి ప్రేమలో పడ్డా.. ప్రస్తుతం తనే నా క్రష్: నాని
-
Madhapur Drugs Case: నటుడు నవదీప్‌ను ప్రశ్నిస్తున్న నార్కోటిక్స్ పోలీసులు
-
USA: కెనడా-ఇండియా ఉద్రిక్తతలు.. అమెరికా మొగ్గు ఎటువైపో చెప్పిన పెంటాగన్ మాజీ అధికారి
-
Nara Lokesh: జైలు మోహన్‌కు బెయిల్‌డే వార్షికోత్సవ శుభాకాంక్షలు: లోకేశ్