Aadhar Card: మాస్క్‌డ్ ఆధార్ కార్డును ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

ఇటీవలి కాలంలో ఆధార్ కార్డు వినియోగదారులు, అనేక ఆన్‌లైన్ మోసాలకు గురవుతుండడం మనం చూస్తూనే ఉన్నాం

Updated : 17 Aug 2022 11:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభుత్వ రాయితీలతో పాటు, వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందేందుకు అవసరమైన ముఖ్యమైన పత్రాలలో ఆధార్ కార్డు ఒకటి. అలాగే ఏదైనా బ్యాంకులో ఖాతాను తెరిచేందుకు కూడా ఆధార్‌ ఉండాల్సిందే. అయితే, ఇటీవలి కాలంలో ఆధార్ కార్డు వినియోగదారులు, అనేక ఆన్‌లైన్ మోసాలకు గురవుతుండడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి మోసాలకు గురికాకుండా వినియోగదారులకు భద్రత కల్పించడానికి, యూనిక్‌ ఐడెంటిఫికేషన్ అధారిటీ అఫ్ ఇండియా (యూఐడీఏఐ) మాస్క్‌డ్ ఆధార్ను ప్రవేశపెట్టింది.

యూఐడీఏఐ జారీ చేసే ఈ మాస్క్‌డ్ ఆధార్ కార్డులో, చివరి 4 అంకెలు మాత్రమే కనిపిస్తాయి. మొదటి 8 అంకెలు 'XXXX - XXXX' అని కనిపిస్తాయి. ఈ విధంగా కార్డును జారీ చేయడం ద్వారా వినియోగదారుడి ఆధార్ నంబర్ అపరిచితులకు కనిపించదు, దీంతో ఆధార్ దుర్వినియోగం కాకుండా ఉంటుంది. 

ఎలా డౌన్‌లోడ్ చేయాలంటే...

  • అధికారిక యూఐడీఏఐ వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి, డౌన్‌లోడ్ ఆధార్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • ఆధార్ / వీఐడీ /ఎన్‌రోల్‌మెంట్ ఐడీ ఆప్షన్‌ను ఎంచుకుని, మాస్క్‌డ్ ఆధార్ ఆప్షన్ టిక్ చేయండి.
  • మీ వివరాలు నమోదు చేసి, రిక్వెస్ట్ ఓటీపీ ఆప్షన్ పై క్లిక్ చేయండి. 
  • అప్పుడు ఆధార్‌తో రిజిస్టర్‌ అయి ఉన్న మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.
  • ఓటీపీని నమోదు చేసి, డౌన్‌లోడ్ ఆధార్ పై క్లిక్ చేయండి. వెంటనే మీ మాస్క్‌డ్ ఆధార్ కార్డు డౌన్‌లోడ్ అవుతుంది.
  • మాస్క్‌డ్ ఆధార్ పీడీఎఫ్ ఫార్మాట్‌లో అందుబాటులో ఉంటుంది. పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ కూడా ఇస్తున్నారు. 
  • ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసిన తర్వాత దాని పాస్‌వర్డ్ మీ ఈ -మెయిల్‌కికి వస్తుంది. దాంతో మీ మాస్క్‌డ్‌ ఆధార్‌ను వాడుకోవచ్చు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని