ఎన్పీఎస్ స్టేట్మెంట్ ను ఎలా డౌన్లోడ్ చేయాలి?

కేవలం పెట్టుబడి ఒక్కటే కాకుండా, మంచి పన్ను ఆదా సాధనంగా కూడా ఎన్పీఎస్ పనిచేస్తుంది....

Published : 19 Dec 2020 17:03 IST

కేవలం పెట్టుబడి ఒక్కటే కాకుండా, మంచి పన్ను ఆదా సాధనంగా కూడా ఎన్పీఎస్ పనిచేస్తుంది.

నేషనల్ పెన్షన్ స్కీం (ఎన్పీఎస్) స్టేట్ మెంట్ ను ఎలా డౌన్ లోడ్ చేయాలి? అలాగే ఎన్పీఎస్ బ్యాలన్స్ ను ఆన్ లైన్ లో ఎలా తనిఖీ చేయాలనే విషయాలను తెలుసుకోవడం కోసం ఎన్పీఎస్ చందాదారులు ఎల్లప్పుడూ శోదిస్తూ ఉంటారు. అలాంటి వారి కోసం ఎన్పీఎస్ స్టేట్ మెంట్ ను ఎలా డౌన్ లోడ్ చేయాలో దశల వారీగా మేము కింద తెలియచేశాము. జాతీయ పింఛను పథకం (ఎన్పీఎస్) అనేది పదవీ విరమణ ప్రణాళిక కోసం ఉత్తమ పెట్టుబడుల పధకాలలో ఒకటి. కేవలం పెట్టుబడి ఒక్కటే కాకుండా, మంచి పన్ను ఆదా సాధనంగా కూడా ఎన్పీఎస్ పనిచేస్తుంది. సెక్షన్ 80 సీసీడీ (1బీ) కింద రూ. 50000 అదనపు పన్ను ప్రయోజనాన్ని ఎన్పీఎస్ అనుమతిస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో మినహాయింపు కింద ఈ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. మీరు ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80 సీ కింద రూ. 1.5 లక్షల పరిమితికి మించకుండా క్లెయిమ్ చేసుకోవచ్చు. 80 సీసీడీ (1) కింద వేతన జీవులతో పాటు, స్వయం ఉపాధి పొందేవారికి కూడా మినహాయింపు అందుబాటులో ఉంటుంది.

ఒకవేళ మీరు ఎన్పీఎస్ లో పెట్టుబడి చేసినట్లయితే, మీరు ఆదాయ పన్ను మినహాయింపును దాఖలు చేయడానికి ఎన్పీఎస్ స్టేట్ మెంట్ ను పెట్టుబడి రుజువు కింద సమర్పించాలి. ఒకసారి మీరు రుజువుని సమర్పించిన తర్వాత, మీ సంస్థ దానిని ధృవీకరించి, ఆర్థిక సంవత్సరానికి టీడీఎస్ తగ్గింపును చేస్తారు. ఒకవేళ మీరు ఎన్పీఎస్ చందాదారులు అయినట్లయితే, ఎన్పీఎస్ స్టేట్ మెంట్ ను సులభంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. https://www.npscra.nsdl.co.in/ వెబ్ సైట్ నుంచి ఎన్పీఎస్ స్టేట్ మెంట్ ను పొందవచ్చు. ఎన్పీఎస్ ఖాతాలోకి లాగిన్ అవ్వడం ద్వారా వాలంటరీ కాంట్రిబ్యూషన్ స్టేట్మెంట్ ను కూడా చందాదారులు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఎన్పీఎస్ స్టేట్ మెంట్ ను డౌన్లోడ్ చేయడానికి కింద స్టెప్స్ ను అనుసరించండి:

  • మొదట, మీరు సీఆర్ఏ వెబ్ సైట్ ద్వారా మీ ఎన్పీఎస్ ఖాతాకు లాగిన్ అవ్వాలి. దాని కోసం Https://www.cra-nsdl.com/CRA/ కి వెళ్లండి
  • పీఆర్ఏఎన్, పాస్ వర్డ్ నమోదు చేసి లాగిన్ అవ్వండి.
  • ఒకసారి మీరు ప్రవేశించిన తర్వాత, నావిగేషన్ బార్ ను మీరు చూడగలరు.
  • నావిగేషన్ బార్ లో ట్రాన్సాక్షన్ స్టేట్ మెంట్ మెనూకి వెళ్ళండి. సబ్-మెనూ కింద, మీరు “హోల్డింగ్ స్టేట్ మెంట్”, “ట్రాన్స్యాక్షన్ స్టేట్ మెంట్” ను చూడగలరు.
  • "ట్రాన్స్యాక్షన్ స్టేట్ మెంట్"పై క్లిక్ చేసినట్లయితే, మీరు ఎన్పీఎస్ స్టేట్ మెంట్ ను డౌన్ లోడ్ చేయగలరు.

ఎన్పీఎస్ వాలంటరీ కాంట్రిబ్యూషన్ స్టేట్మెంట్ ను డౌన్లోడ్ చేయడానికి కింది స్టెప్స్ ను అనుసరించండి.

  • ఎన్పీఎస్ సీఆర్ఏ వెబ్ సైట్ ను సందర్శించి, మీ పీఆర్ఏఎన్, పాస్ వర్డ్ ను నమోదు చేసి లాగిన్ అవ్వండి.
  • మీరు లాగిన్ అయిన తర్వాత మెయిన్ మెనూలోని “view” ఆప్షన్ కు వెళ్ళండి.
  • మీరు ప్రధాన మెనూ “view” కింద అందుబాటులో ఉన్న “Statement of Voluntary Contribution under NPS” కు వెళ్ళాలి.

వివిధ ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన ఎన్పీఎస్ కాంట్రిబ్యూషన్ స్టేట్ మెంట్ లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ స్టేట్ మెంట్ డౌన్లోడ్ అయిన తర్వాత దానిని ప్రింట్ తీసి, పెట్టుబడి రుజువుగా మీ సంస్థకి సమర్పించవచ్చు.

ఎన్పీఎస్ & ఉమాంగ్ యాప్ ద్వారా ఎన్పీఎస్ బ్యాలెన్స్ తనిఖీ:

మీరు ఎన్పీఎస్ యాప్ ద్వారా ఎన్పీఎస్ బాలన్స్ ను తనిఖీ చేయవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ లో ఈ యాప్ సులభంగా అందుబాటులో ఉంటుంది. ఎన్పీఎస్ యాప్ ద్వారా ఎన్పీఎస్ బ్యాలెన్స్ ను ఎలా తనిఖీ చేయాలో కింద చూడండి.

  • మీ స్మార్ట్ ఫోన్ లోని గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఎన్పీఎస్ యాప్ ను డౌన్ లోడ్ చేసి, ఇన్ స్టాల్ చేయండి.
  • అనంతరం యాప్ ను తెరిచి, లాగిన్ పై క్లిక్ చేయండి.
  • పీఆర్ఏఎన్, పాస్ వర్డ్ ను ఎంటర్ చెయ్యండి.
  • మీరు సీఆర్ఏ పై అందుబాటులో ఉన్న తాజా ఖాతా వివరాలను యాక్సెస్ చేయవచ్చు.
  • మీ ప్రస్తుత హోల్డింగ్స్, అన్ని ఇతర ఖాతా వివరాలను మీరు చూడవచ్చు.
  • మీరు ఈ యాప్ ద్వారా మీ కాంట్రిబ్యూషన్ ను కూడా సమర్పించవచ్చు.

ఒక యాప్ ద్వారా ఎన్పీఎస్ బ్యాలెన్స్ ను తనిఖీ చేయడం సులువైన, తెలివైన మార్గం.

ఎన్పీఎస్ బ్యాలెన్స్ ను యాప్ ద్వారా తనిఖీ చేసుకునే సదుపాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. ఎన్పీఎస్ సేవా సౌకర్యం ఉమాంగ్ యాప్ ద్వారా అందుబాటులో ఉంటుంది. ఒకే వేదిక కింద ఈ-గవర్నమెంట్ సేవలను అందించే ఉద్దేశంతో ప్రభుత్వం ఉమాంగ్ యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. మీరు వెబ్ సైట్ నుంచి లేదా గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉమాంగ్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని