Published : 23 Dec 2021 15:04 IST

Income Tax New Portal: కొత్త ఆదాయ‌పు ప‌న్ను పోర్ట‌ల్‌లో ప్రొఫైల్ ఎలా అప్‌డేట్ చేయాలి?

ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నుల ఫైలింగ్ గ‌డ‌వు సమీపిస్తోంది. ఈ గ‌డువు తేది డిసెంబ‌రు 31తో ముగియ‌నుంది. ఈ నేప‌ధ్యంలో ప‌న్ను చెల్లింపుదారులు ఆదాయ‌పు ప‌న్ను శాఖ నుంచి వ‌చ్చే ముఖ్య‌మైన స‌మాచారాన్ని పొందాలంటే, మీరు సంబంధిత శాఖ‌కు ఇచ్చిన వివ‌రాలు స‌రిగ్గా ఉండాలి. మీ చిరునామా, ఫోన్ నెంబ‌రు ఏది మారినా త‌క్ష‌ణ‌మే ఆదాయ‌పు ప‌న్ను పోర్టల్‌లో అప్‌డేట్ చేయాలి. అప్పుడే స‌రైన స‌మ‌యంలో మీకు స‌మాచారం చేరుతుంది. ప‌న్నుచెల్లింపుదారులు కొత్త ఈ-ఫైలింగ్ పోర్ట‌ల్‌కి లాగిన్ అయ్యి,  మై ఫ్రొఫైల్‌/అప్‌డేట్ ప్రొఫైల్ స‌ర్వీస్ ఆప్ష‌న్ ద్వారా మీ ప్రొఫైల్ స‌మాచారాన్ని ఎప్పుడైనా అప్‌డేట్ చేయ‌వ‌చ్చు. ఆదాయ‌పు ప‌న్ను శాఖ ప్రొఫైల్ స‌మాచారాన్ని మూడు క్యాట‌గిరీలుగా వ‌ర్గీక‌రించింది. 
* వ్య‌క్తిగ‌త వివ‌రాలు
* కాంటాక్ట్ వివ‌రాలు
* ఇత‌ర వివ‌రాలు

వ్య‌క్తిగ‌త‌, కాంటాక్ట్ విరాల‌ను అప్‌డేట్ చేసే విధానం..
* ముందుగా ఆదాయపు ప‌న్ను ఈ-ఫైలింగ్ పోర్ట‌ల్  “www.incometax.gov.in” కి లాగిన్ అవ్వాలి. 
*లాగిన్ పేజ్‌లో కుడి వైపు పైభాగంలో క‌నిపిస్తున్న‌ ఫ్రొఫైల్ ఫిక్చ‌ర్‌పై క్లిక్ చేసి, డ్రాప్‌డౌన్‌లో ఉండే ‘మై ప్రొఫైల్’ ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి. ఇక్క‌డ అప్‌డేట్ ప్రొఫైల్ ఆప్ష‌న్‌ను ఎంచుకోవ‌చ్చు. 
* తర్వాత‌ ప్రొఫైల్ సెక్ష‌న్‌లో ఉన్న ఎడిట్ బ‌ట‌న్‌పై క్లిక్ చేయాలి. 
* ప్రొఫైల్ సెక్ష‌న్‌లో మీ పేరు, పుట్టిన తేది, జెండ‌ర్‌, పాన్‌, పాన్ లింక్ స్టేట‌స్ త‌దిత‌ర వివ‌రాలు క‌నిపిస్తాయి. ఇక్క‌డ మీ సిటిజ‌న్‌షిప్‌, రెసిడెన్షియ‌ల్ స్టేట‌స్ వంటి వివ‌రాలు ఎడిట్ చేసుకోవ‌చ్చు. మీ ఆధార్, పాన్ అనుసంధాన స్టేట‌స్‌ని చెక్ చేసుకోవ‌చ్చు. 
* మీ వివ‌రాలు ఎడిట్ చేసిన త‌రువాత సేవ్ బ‌ట‌న్‌పై క్లిక్ చేయాలి. 

కాంటెక్ట్ వివ‌రాల అప్‌డేష‌న్‌..
* ఇందుకోసం వ్య‌క్తిగ‌త వివ‌రాల పేజ్‌లో కాంటాక్ట్ సెక్ష‌న్‌లోని ఎడిట్ బ‌ట‌న్‌పై క్లిక్ చేయాలి. 
* ఇక్క‌డ మొబైల్ నెంబ‌రు మార్చుకోవ‌చ్చు. ముందుగా డ్రాప్‌డౌన్ మెనూలో అందుబాటులో ఉన్న దేశం కోడ్ సెల‌క్ట్ చేసుకుని త‌రువాత మీ ప్రైమరీ మొబైల్ నెంబ‌రును ఎంట‌ర్ చేయాలి. ఇక్క‌డ మీరు ఎంట‌ర్ చేసిన మొబైల్ నెంబ‌రు.. మీదే అయితే సెల్ఫ్ అని, లేదంటే మీ జీవిత‌భాగ‌స్వామి, కుమారుడు, కుమార్తె ఏవ‌రి నెంబ‌రు అయితే ఆ రిలేష‌న్‌ను త‌ప్ప‌క ఎంట‌ర్ చేయాలి.
* ఆధార్‌తో అనుసంధాన‌మైన కాంటాక్ట్ నెంబ‌రు ఇచ్చి ఉంటే ‘అప్‌డేట్ యాజ్ ఫ‌ర్ ఆధార్’ పై క్లిక్ చేస్తే, పాప్అప్ విండో ఓపెన్ అవుతుంది. ఇక్క‌డ ధృవీక‌రించాలి. యూఐడిఏఐ వ‌ద్ద రిజిస్ట‌ర్ అయిన మొబైల్ నెంబ‌రుకి ఓటీపీ వ‌స్తుంది. రీడైరెక్ట్ అయిన పేజీలో ఓటీపీని ఎంట‌ర్ చేయాలి. 
* అదే విధంగా రెండో మొబైల్ నెంబ‌రు ఎంట‌ర్ చేయాలి. ఇది పూర్తిగా ఆప్ష‌న‌ల్‌. 
* ఇక్క‌డ మీరు నివాసముంటున్న ఇంటి/ఆఫీస్ మొబైల్‌, ల్యాండ్ లైన్ నెంబ‌ర్ల‌ను ఇవ్వ‌చ్చు. 
* అటు త‌ర్వాత మీ ప్రైమరి ఈ-మెయిల్ ఎంట‌ర్ చేయాలి. ఈ-మెయిల్ మీదే అయితే సెల్ఫ్ అని లేదంటే ఎవ‌రిదైతే వారితో మీకున్న రిలేష‌న్‌ను సెల‌క్ట్ చేసుకోవాలి. ‘అప్‌డేట్ యాజ్ ప‌ర్ ఆధార్’ అని సెలక్ట్ చేసుకోవ‌డం ద్వారా యూఐడిఏఐ డేటా బేస్ ప్ర‌కారం కాంటాక్ట్ వివ‌రాల‌ను పొంద‌వ‌చ్చు. 
* కింద‌కి వ‌స్తే, ఇక్క‌డ చిరునామా ఎంట‌ర్ చేయాలి. నివ‌సిస్తున్న దేశం, ఫ్లాట్‌/డోర్‌/బిల్డింగ్ నెంబ‌రు, పిన్‌ను త‌ప్ప‌కుండా ఎంట‌ర్ చేయాలి. పోస్టాఫీసు, ఏరియా/లొకాలిటి, జిల్లా, న‌గ‌రం, రాష్ట్రం వంటి వివ‌రాల‌తో చిరునామా ఇవ్వాలి. 
* అన్ని వివ‌రాలు పొందుప‌రిచిన త‌రువాత సేవ్ బ‌ట‌న్‌పై క్లిక్ చేయాలి. 

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని