Credit Cards: మొదటిసారి క్రెడిట్ కార్డు పొందడం ఎలా? ఏమేం కావాలి?
చాలా మంది క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. బ్యాంకులు కూడా తగిన ఆదాయ రుజువులు ఉన్నవారికి విరివిగానే ఈ కార్డులను మంజూరు చేస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఇప్పుడు తగిన ఆదాయం ఉండి బ్యాంకు ఖాతా కలిగిన చాలామంది క్రెడిట్ కార్డును ఉపయోగిస్తున్నారు. పాన్ కార్డు సమాచారంతోనే ఆ వ్యక్తి ఆర్థికపరమైన లావాదేవీలను, స్థితిగతులను అంచనా వేసి.. బ్యాంకులే క్రెడిట్ కార్డులను తీసుకోమని ఖాతాదారులను అభ్యర్థిస్తున్నాయి.
క్రెడిట్ కార్డుతో ఉపయోగం
కార్డును తెలివిగా ఉపయోగించగలిగితే క్రెడిట్ కార్డుతో మీరు డెబిట్ కార్డు కంటే మెరుగైన సౌకర్యాలను పొందొచ్చు. ప్రయాణ బుకింగ్‌లు, షాపింగ్, క్యాష్ బ్యాక్‌లు, సినిమా టికెట్లపై తగ్గింపులు, రివార్డు పాయింట్లు, ఈ-కామర్స్ సంస్థల ఆన్లైన్ అమ్మకాలపై అందజేసే ప్రత్యేక డిస్కౌంట్లు లాంటివి ఎన్నో పొందొచ్చు. ఆన్లైన్ షాపింగ్‌కు, చెల్లింపులకు భౌతిక నగదుతో పనిలేదు. ఆన్లైన్ చెల్లింపుల కార్యకలాపాలకు ఎక్కువ మంది క్రెడిట్ కార్డులే ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా క్రెడిట్ కార్డుల నో-కాస్ట్ ఈఎంఐ వంటి సౌకర్యాలు ఇప్పుడు చాలా మంది వినియోగదారులు ఉపయోగించుకుంటున్నారు. ఇలాంటి ఎన్నో ఉపయోగాలు ఉండడం వల్ల క్రెడిట్ కార్డులు వ్యవస్థీకృత మార్కెట్లో నగదుకు ప్రత్యామ్నాయంగా విస్తృతంగా చలామణీ అవుతున్నాయి.
మొదటిసారి కార్డు పొందడం సులభమేనా?
ముఖ్యంగా మొదటిసారి అనుకూలమైన నిబంధనలు, షరతులతో మంచి క్రెడిట్ పరిమితితో, మెరుగైన కార్డును పొందడం కొంచెం కష్టమే. కార్డు జారీకి అధిక క్రెడిట్ స్కోరు అవసరం. మునుపటి క్రెడిట్ చరిత్ర లేకుండా మంచి క్రెడిట్ స్కోరు ఉండదు. అందుచేత ముందుగా తక్కువ మొత్తంలో ఛార్జీలు ఉండే, తక్కువ ప్రయోజనాలు లభించే కార్డును తీసుకోవడం ఉత్తమం. ఈ కార్డును ఉపయోగిస్తూ గడువు తేదీలోపు బకాయిలు తీరుస్తుంటే ఆటోమేటిక్‌గా క్రెడిట్ స్కోరు పెరుగుతుంది. ఈ క్రెడిట్ స్కోరుతో మార్కెట్లో అందుబాటులో ఉండే మెరుగైన కార్డును పొందొచ్చు.
మెరుగైన క్రెడిట్ స్కోరుతో ప్రయోజనాలు..
ఒకసారి క్రెడిట్ కార్డు పొందిన తర్వాత గడువు తేదీలోపు చెల్లింపులు ఉంటే.. క్రెడిట్ స్కోరు బాగా మెరుగవుతుంది. దీంతో అదనపు సౌకర్యాలు, ప్రయోజనాలు కలిగిన వేరే క్రెడిట్ కార్డులను కూడా పొందొచ్చు. ఆ తర్వాత యాడ్-ఆన్ కార్డులను కూడా పొందొచ్చు. వ్యక్తిగత రుణాలు లభిస్తాయి. ముఖ్యంగా అతిపెద్ద రుణమైన గృహ రుణాన్ని తక్కువ వడ్డీ రేటుకే పొందవచ్చు.
దరఖాస్తు ఎలా చేయాలి?
మీరు కార్డును పొందాలనుకునే బ్యాంకు సమీప బ్రాంచ్‌ను సందర్శించి క్రెడిట్ కార్డు ప్రతినిధిని కలిసి మీ ఆదాయం, అవసరాల వివరాలు తెలపండి. బ్యాంకు ప్రతినిధి వివిధ క్రెడిట్ కార్డుల సమాచారం మీకు చెబుతారు. మొదటిసారి కార్డును కావాలనుకునేవారు అందులో తక్కువ వార్షిక ఫీజు (లేదా ఫీజు లేని) గల కార్డును ఎంపిక చేసుకోవడం మంచిది. అవసరమైన పత్రాలు (ముఖ్యంగా బ్యాంకు స్టేట్మెంట్, పాన్)లతో పాటు కార్డు దరఖాస్తు ఫారంను పూర్తిచేసి వారికి సమర్పించండి. దరఖాస్తు, ఇతర పత్రాలతో బ్యాంకు సంతృప్తి చెందితే, కార్డు మంజూరవుతుంది. ఇంకా సులభంగా కార్డును పొందడానికి, మీరు బ్యాంకు వెబ్‌సైట్‌ను సందర్శించి, ఆఫర్లో ఉన్న వివిధ క్రెడిట్ కార్డ్‌ల ఫీచర్లను ఛార్జీలతో పోల్చి, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హతలు
వయసు: ఆన్లైన్, ఆఫ్‌లైన్ దరఖాస్తు ప్రాసెస్ కోసం అవసరమైన పత్రాలు, అర్హతలు ఒకే విధంగా ఉంటాయి. క్రెడిట్ కార్డుకు అర్హత పొందడానికి దరఖాస్తుదారు వయసు కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి. చాలా సందర్భాల్లో యాడ్-ఆన్ కార్డు పొందడానికి కనీసం 15 ఏళ్లు నిండాలి.
నివాసం: భారత పౌరులు కొత్త క్రెడిట్ కార్డు పొందడానికి అర్హులు. ప్రవాస భారతీయులు (ఎన్నారైలు) నిర్దిష్ట క్రెడిట్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అనుమతి ఉంటుంది.
ఆదాయం: దరఖాస్తుదారుడు స్థిరమైన ఆదాయాన్ని కలిగి ఉండాలి. అది జీతం లేదా వృత్తిపరమైన ఆదాయం కావచ్చు. క్రెడిట్ కార్డు జారీ సంస్థలు కనీసం రూ.2 లక్షల వార్షిక ఆదాయాన్ని ఆశిస్తున్నాయి. కార్డు కేటగిరీని బట్టి ఆదాయాన్ని లెక్కలోకి తీసుకుంటారు. అయితే, ఆదాయన్ని బట్టి కార్డు మంజూరు అనేది క్రెడిట్ కార్డు జారీ సంస్థలపై ఆధారపడి ఉంటుంది. క్రెడిట్ స్కోరు లేనివారికి, క్రెడిట్ కార్డును జారీ చేయడానికి వారి ప్రస్తుత ఆదాయ స్థాయిని పరిగణనలోకి తీసుకుంటారు.
గుర్తింపు రుజువు: పాస్‌పోర్ట్, పాన్ కార్డు, ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్.. ఏదైనా ఒక పత్రాన్ని గుర్తింపు రుజువుగా సమర్పించొచ్చు.
చిరునామా రుజువు: పాస్‌పోర్ట్, ఓటరు ఐడీ, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు, ఆస్తి పత్రాలు, లీజు/అద్దె ఒప్పందం, గత 3 నెలల యుటిలిటీ బిల్లులు.. ఏదో ఒకటి సమర్పించాలి.
ఆదాయ రుజువు: ఆదాయపు పన్ను రిటర్న్స్, గత 3 నెలల జీతం స్లిప్‌లు, ఉద్యోగ నియామక పత్రం అవసరం పడతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డెబిట్ కార్డు ఛార్జీలను పెంచిన ఎస్బీఐ
డెబిట్ కార్డులపై నిర్వహణ ఛార్జీలను ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సవరించింది. కొత్త ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. -
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
యాక్సిస్ బ్యాంకు కస్టమర్లు కొందరు తమ క్రెడిట్ కార్డుల్లో అనధికారిక లావాదేవీలు జరుగుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. దీనిపై బ్యాంక్ స్పందించింది. -
Flash Pay: కీ చైన్‌తో పేమెంట్స్.. ఫెడరల్ బ్యాంక్ నుంచి ఫ్లాష్ పే
Federal Bank flash pay: ఫెడరల్ బ్యాంక్ స్మార్ట్ కీ చైన్‌ను తీసుకొచ్చింది. కాంటాక్ట్ లెస్ పేమెంట్ల కోసం దీన్ని వినియోగించుకోవచ్చు. -
పిల్లల పేరిట ఎఫ్డీ
పెట్టుబడికి రక్షణ, రాబడికి హామీ ఉన్న పథకాల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీ) ముందుంటాయి. పిల్లల చదువులు, ఇతర అవసరాల కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటున్న తల్లిదండ్రులు వీటికి ప్రాధాన్యం ఇస్తుంటారు -
సిబిల్ నివేదికలో తప్పులుంటే
రుణం తీసుకోవాలంటే.. బ్యాంకులు ముందుగా పరిశీలించేది క్రెడిట్ నివేదికనే. ఇందులో ఎలాంటి తప్పులూ దొర్లకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే మనకు అవసరం ఉన్నప్పుడు రుణం కోసం వెళ్తే దరఖాస్తును తిరస్కరించే అవకాశం ఉంది. -
Personal Loans: వ్యక్తిగత రుణాల వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయ్?
ప్రస్తుతం అన్ని బ్యాంకులు వ్యక్తిగత రుణాలను అందిస్తున్నాయి. వివిధ బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు ఎంతెంతో ఇక్కడ చూద్దాం... -
Home loan: జీరో ప్రాసెసింగ్ ఫీజు.. 8.3% వడ్డీకే హోమ్‌లోన్
Bank of India home loan offer: బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణాలపై వడ్డీ తగ్గించింది. ప్రాసెసింగ్ ఫీజు సైతం రద్దు చేసింది. మార్చి 31 వరకు ఈ ఆఫర్ ప్రకటించింది. -
ప్రత్యేక ఎఫ్డీలను ప్రారంభించిన నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్లపై గరిష్ఠంగా 9.25% వడ్డీ వరకు పొందొచ్చు. -
Credit Card: క్రెడిట్ కార్డును పరిమితికి మించి వాడుకోవచ్చా?
Credit Card: క్రెడిట్ వాడకంపై తరచూ ఎదురయ్యే కొన్ని కీలక సందేహాలకు ఇటీవల ఆర్బీఐ సమాధానాలు ఇచ్చింది. అవేంటో చూద్దాం..! -
వ్యక్తిగత రుణాలు మోసాల బారిన పడొద్దు
ఎలాంటి హామీ లేకుండా లభించే వ్యక్తిగత రుణాలు అవసరమైనప్పుడు ఎంతో ఉపయోగపడతాయి. మన అవసరాలను ఆసరాగా తీసుకొని, సైబర్ మోసగాళ్లు మన కష్టార్జితాన్ని కాజేసేందుకు సిద్ధంగా ఉంటారు. -
Gold Loans: బంగారు రుణాలపై వడ్డీ రేట్లు ఏ బ్యాంకులో ఎంతెంత?
సురక్షితమైన రుణం కాబట్టి బ్యాంకులు బంగారంపై సరసమైన వడ్డీ రేట్లకు వేగంగా రుణాలందిస్తున్నాయి. వివిధ బ్యాంకులు వసూలుచేసే వడ్డీ రేట్లు ఇక్కడ చూద్దాం.. -
FD Rates: సీనియర్ సిటిజన్ల ఎఫ్డీలపై వడ్డీ రేట్లు ఇవే..
చాలా ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు అత్యధిక వడ్డీ రేటును అందిస్తున్నాయి. 1, 3, 5 ఏళ్ల ఎఫ్డీలపై వడ్డీ రేట్లను ఇక్కడ చూడండి. -
పొదుపు ఖాతాలో ఎంత డబ్బు ఉండాలి?
వ్యక్తిగత ఆర్థిక విషయాల్లో పొదుపు ఖాతాకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. మనం చేసే ఆదాయ-వ్యయాలన్నింటికీ ఆధారం ఇదే. బ్యాంకు, మీరు ఎంచుకున్న ఖాతా రకాన్ని బట్టి, ఇందులో కనీస నిల్వ ఎంత ఉండాలన్నది ఆధారపడి ఉంటుంది. వేతనం ఖాతాలో సున్నా నిల్వ ఉన్నా ఇబ్బందేమీ ఉండదు. -
Car Loans: కారు రుణాలపై ఏ బ్యాంకులో వడ్డీ రేట్లు ఎంతెంత?
దాదాపుగా అన్ని బ్యాంకులు వాహన రుణాలందిస్తున్నాయి. ఈ రుణాలకై వివిధ బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు ఇక్కడ చూద్దాం. -
Credit Cards: హెచ్డీఎఫ్సీ నుంచి ఐదు కొత్త బిజినెస్ క్రెడిట్ కార్డులు
Credit Cards: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఇటీవల నాలుగు కొత్త బిజినెస్ క్రెడిట్ కార్డులను విడుదల చేసింది. వాటి ఫీచర్లు, జాయినింగ్ ఫీజు, అర్హతల వంటి వివరాలను చూద్దాం.. -
Two wheeler insurance: బైక్ ఇన్సూరెన్స్.. ఇవన్నీ తెలుసుకున్నాకే..!
Two wheeler insurance: మీ టూవీలర్‌కు బీమా చేయించాలని చూస్తున్నారా? మంచి పాలసీ తెలుసుకోలేకపోతున్నారా? ఈ కింది విషయాలపై ఓ లుక్కేయండి. -
గృహరుణం ఇప్పుడేం చేయాలి?
ఏడాది కాలంగా రెపో రేటు 6.50 శాతం వద్ద కొనసాగుతోంది. దీన్ని పెంచకపోవడం మంచి పరిణామమే. అదే సమయంలో ద్రవ్యోల్బణం స్థిరంగా ఉన్నప్పటికీ, వడ్డీ రేట్లను తగ్గించేంతగా సహకరించడం లేదు. -
కార్పొరేట్ బాండ్లు ఎంచుకోండి జాగ్రత్తగా
మన దేశంలో అత్యంత సురక్షితమైన, ప్రజాదరణ పొందిన పొదుపు పథకాల్లో బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీ) ముందుంటాయి. నిర్ణీత కాలానికి, స్థిరమైన వడ్డీని అందించే వీటిని చాలామంది ఇష్టపడతారు. -
Saving Account: పొదుపు ఖాతా గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
బ్యాంకులో పొదుపు ఖాతా అనేది ఖాతాదారుడికి ఒక విభిన్నమైన ఆర్థిక సాధనం. ఇది ఖాతాదారుడికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. -
Fixed Deposits: ఎఫ్డీలపై వడ్డీ రేట్లను సవరించిన ఐసీఐసీఐ
ఐసీఐసీఐ బ్యాంకు ఎంపిక చేసిన కొన్ని కాలవ్యవధుల ఎఫ్డీలపై వడ్డీ రేట్లు పెంచింది. ఈ బ్యాంకులో సీనియర్ సిటిజన్లు గరిష్ఠంగా 7.75% వడ్డీని పొందుతారు. -
కారు రుణంపై టాపప్
మీకు ఇప్పటికే కారు రుణం ఉందా? అత్యవసరంగా డబ్బు కావాలా? కారు రుణంపై టాపప్ తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. మంచి రుణ చరిత్ర ఉన్న వారికి బ్యాంకులు సులభంగానే ఈ టాపప్‌ను అందిస్తాయి.
తాజా వార్తలు (Latest News)
-
భయపెడుతున్న భువన్.. శివారు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను నాలుగైదు రెట్లు పెంపు
-
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
-
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
కన్నారా.. ఇది విన్నారా?
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్‌నాథ్