క్రెడిట్ కార్డ్ రుణం తీసుకోవాలి అ‌నుకుంటున్నారా ?

మీరు మీ క్రెడిట్ కార్డ్ ద్వారా వ్య‌క్తిగ‌త రుణం పొందాల‌నుకుంటే ఇప్ప‌టివ‌ర‌కు వాడిన క్రెడిట్‌కార్డుల బిల్లుల‌ను స‌కాలంలో చెల్లించి ఉండాలి.

Updated : 10 Feb 2021 19:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వివిధ బ్యాంకులు, క్రెడిట్ కార్డ్‌ ప్రొవైడ‌ర్లు త‌మ క్రెడిట్ కార్డులు పొందిన వ్య‌క్తుల‌కు టాప్‌-అప్ రుణాల‌ను అందిస్తున్నాయి. ఈ క్రెడిట్ కార్డ్ రుణాల‌ను ఆమోదం పొందేందుకు స్థిర‌మైన చెల్లింపుల విధానంలో క్లీన్ క్రెడిట్ చ‌రిత్ర‌ను క‌లిగి ఉండాలి.

క్రెడిట్ కార్డుల‌పై రుణాలు ఇవ్వ‌డం సాధార‌ణ‌మే. క్రెడిట్ కార్డుదారుల‌కు వారు లోన్ అడగ‌కుండానే గ‌తంలో చెల్లింపులు చెల్లించిన విధానం బాగుంటే బ్యాంకులే వారిని ఫోన్‌లో లోన్ తీసుకోమ‌ని కోర‌తాయి. క్రెడిట్ కార్డుదారుల అంగీకారంతో లోన్స్ ఇస్తారు. వీటిని ఫ్రీ అప్రూవ్డ్‌ లోన్స్ అంటారు. ఉదాహ‌ర‌ణ‌కు.. మీరు మీ క్రెడిట్ కార్డ్ ద్వారా వ్య‌క్తిగ‌త రుణం పొందాల‌నుకుంటే ఇప్ప‌టి వ‌ర‌కు వాడిన క్రెడిట్‌కార్డుల బిల్లుల‌ను స‌కాలంలో చెల్లించి ఉండాలి. ఈ విధంగా రుణ చెల్లింపులు స‌త్వ‌రం చేసేవారికి ప‌ర్స‌న‌ల్ లోన్స్ వేగంగా ఇస్తారు. ఒక్కోసారి ప్రాసెసింగ్ ఛార్జీల్లో కూడా మిన‌హాయింపులు ఉంటాయి.

ఈ క్రెడిట్ కార్డు రుణాల వ‌డ్డీ రేట్లు వ్య‌క్తిగ‌త రుణంగా ప‌రిగ‌ణించి వ‌సూలు చేస్తారు. సుమారు 11% మేర వడ్డీ ఉంటుంది. వ‌డ్డీ రేట్లు మారుతూ ఉంటాయి. ఎప్పుడూ ఒకేలా ఉండ‌వు. అయితే నిర్ణీత కాలానికి స్థిర వ‌డ్డీ రేటుతో రుణాలు ఇస్తారు. రుణం ఆమోదించిన కార్డుకు గ‌రిష్ఠ రుణ మొత్తం కార్డు క్రెడిట్ ప‌రిమితిని మించ‌దు. క్రెడిట్ కార్డు రుణం తీసుకున్న‌ప్పుడు రుణ మొత్తంలో ప్రాసెసింగ్ ఫీజు విధిస్తారు. సాధార‌ణంగా ఈ రుణాల‌పై ప్రాసెసింగ్ ఛార్జీలు 1% నుంచి 5% వ‌ర‌కు ఉంటాయి. రుణం తీర్చ‌డానికి 12 నెల‌ల నుంచి గ‌రిష్ఠంగా 36 నెల‌ల వ‌ర‌కు గడువు ఉంటుంది. మీరు ఎప్పుడైనా మీ క్రెడిట్ కార్డ్ రుణాన్ని ముందే తీర్చేయొచ్చు. అయితే బ్యాంకు నిర్ణ‌యించిన ముంద‌స్తు మూసివేత (ఫ్రీ క్లోజ్‌) ఛార్జీలు వర్తిస్తాయి.

రుణ చెల్లింపుల్లో ఎగ‌వేత‌లు జ‌రిగితే.. రుణ డిఫాల్ట్‌గా గుర్తిస్తారు. అయితే క్రెడిట్ కార్డు డిఫాల్ట్‌గా ప‌రిగ‌ణించ‌రు. క్రెడిట్ కార్డు డిఫాల్ట్‌లు క్రెడిట్ స్కోర్‌ల‌ను చాలా ఎక్కువ‌గా ప్ర‌భావితం చేస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని