క్రెడిట్ కార్డు పొందేందుకు ఏం కావాలి?

క్రెడిట్ అంటే వేరొక‌రి వ‌ద్ద డ‌బ్బు అప్పుగా తీసుకోవ‌డం. క్రెడిట్ కార్డు అంటే బ్యాంకు లేదా ఆర్ధిక సంస్థ నుంచి అప్పు తీసుకుని  చెల్లింపుల‌కు వాడుకునేది. క్రెడిట్ కార్డు అనేది ఒక న‌గ‌దు చెల్లింపు కార్డు. చేసే ఉద్యోగం, సంపాద‌న వంటి అంశాల ఆధారంగా క్రెడిట్ కార్డుల‌ను జారీ చేస్తారు.

Published : 16 Dec 2020 14:57 IST

క్రెడిట్ అంటే వేరొక‌రి వ‌ద్ద డ‌బ్బు అప్పుగా తీసుకోవ‌డం. క్రెడిట్ కార్డు అంటే బ్యాంకు లేదా ఆర్ధిక సంస్థ నుంచి అప్పు తీసుకుని  చెల్లింపుల‌కు వాడుకునేది. క్రెడిట్ కార్డు అనేది ఒక న‌గ‌దు చెల్లింపు కార్డు. చేసే ఉద్యోగం, సంపాద‌న వంటి అంశాల ఆధారంగా క్రెడిట్ కార్డుల‌ను జారీ చేస్తారు.

క్రెడిట్‌ కార్డు పొందేందుకు అర్హతలు:
* 18 ఏళ్లు నిండి ఉండాలి.
* ఉద్యోగులైనా, వృత్తి నిపుణులైనా, స్వయం ఉపాధి కలిగిన వారైనా క్రెడిట్‌ కార్డు పొందాలంటే సంస్థ సూచించిన విధంగా స్థిర ఆదాయం వచ్చే విధంగా ఉండాలి.
* పొదుపు ఖాతా కలిగి ఉండాలి.
* మంచి రుణ చరిత్ర కలిగి ఉండాలి.
* క్రెడిట్‌ కార్డు పొందేందుకు అవసరమయ్యే పత్రాలు:
వ్యక్తిగత గుర్తింపు: ఓటరు గుర్తింపు కార్డు/పాస్‌పోర్టు/పాన్‌కార్డు/డైవింగ్‌ లైసెన్స్‌/ఆధార్‌ కార్డు/ప్రభుత్వ ఉద్యోగుల గుర్తింపు కార్డు.
చిరునామా గుర్తింపు: ఓటరు గుర్తింపు పత్రం, అద్దె ఒప్పంద పత్రం, బ్యాంకు స్టేట్‌మెంట్‌, రేషన్‌ కార్డు, పాస్‌పోర్ట్‌, డ్రైవింగ్‌ లైసెన్సు, టెలిఫోన్‌ లేదా మొబైల్‌  బిల్లు, విద్యుత్‌ బిల్లు, ఆస్తి పన్ను చెల్లింపు పత్రం. (ఇందులో ఒకటి )
వయసు ధ్రువీకరణ: ఓటరు గుర్తింపు పత్రం, 10వ తరగతి మార్కుల జాబితా, జనన ధ్రువీకరణ పత్రం, పాస్‌పోర్ట్‌, ఆధార్‌ కార్డు, పింఛను చెల్లించిన రశీదు, ఎల్‌ఐసీ పాలసీ పత్రం
ఆదాయ గుర్తింపు:
వేతన ఉద్యోగులైతే - ఇటీవలి 3 నెలల వేతన వివరాలు, ఇటీవలి 6 నెలల బ్యాంకు స్టేట్‌మెంట్లు
స్వయం ఉపాధి ఉద్యోగులైతే - ఇటీవలి ఐటీ రిటర్న్సు, వ్యాపారం కొనసాగింపు హామీ పత్రం.
షాపింగ్‌లు, ఆన్‌లైన్‌లో వ‌స్తువులు కొన్నప్పుడు న‌గ‌దు రూపంలో డ‌బ్బు చెల్లించ‌కుండా కార్డు ద్వారా మొద‌ట చెల్లింపులు జ‌ర‌ప‌వ‌చ్చు. కార్డు ద్వారా పొందిన రుణాన్ని క్రెడిట్ కార్డు కంపెనీకి తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని