10 నిమిషాల‌లోనే ఈ-పాన్ పొందొచ్చు! ద‌ర‌ఖాస్తు ఎలాగంటే..?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆర్థిక లావాదేవీల నిర్వ‌హ‌ణ‌లో పాన్ కార్డ్ చాలా ముఖ్యం. బ్యాంకు ఖాతా ద‌గ్గ‌ర నుంచి ఐటీ రిట‌ర్నుల ఫైలింగ్‌ వ‌ర‌కు అన్నింటికీ పాన్ కార్డ్ అవ‌స‌ర‌మే. కొత్త‌గా పాన్ కార్డు కోసం ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు రోజుల త‌ర‌బ‌డి ఎదురు చూడాల్సిన ప‌నిలేకుండా త‌క్ష‌ణ‌మే ఈ-పాన్ పొందొచ్చు. అలాగే, పాన్ కార్డు పోయినా కార్డును తిరిగి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. వ్య‌క్తిగ‌త ప‌న్ను చెల్లింపుదారులకు ఈ స‌దుపాయాన్ని అందిస్తోంది ఆదాయపు ప‌న్ను శాఖ‌. అయితే, ఇందుకు ఆధార్ నంబర్‌ ఉండాలి. అలాగే ఆధార్ నంబర్‌కు మీ మొబైల్ నంబర్‌ అనుసంధానించి ఉండాలి. ఈ-పాన్ అనేది ఐటీ శాఖ వారు ఎల‌క్ట్రానిక్ ఫార్మట్‌లో జారీ చేస్తారు. దీనిపై డిజిట‌ల్ సంత‌కం ఉంటుంది.

ఐటీ పోర్ట‌ల్ ద్వారా త‌క్ష‌ణ‌మే ఈ-పాన్ పొందే విధానం..
వ్య‌క్తిగ‌త ప‌న్ను చెల్లింపుదారులు ముందుగా కొత్త ఐటీ పోర్ట‌ల్‌కి https://eportal.incometax.gov.in లాగిన్ అవ్వాలి. ఇక్క‌డ హోమ్ పేజ్‌ని క్లిక్ చేసి క్విక్ లింక్స్‌లో అందుబాటులో ఉన్న ఇన్స్టెంట్ ఈ-పాన్‌పై క్లిక్ చేయాలి. ఇక్క‌డ రెండు ఆప్ష‌న్లు అందుబాటులోకి వ‌స్తాయి. మొద‌టిది 'గెట్ న్యూ ఈ-పాన్'. కొత్త‌గా రిజిస్ట‌ర్ చేసుకునే వారు ఈ ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి. త‌ర్వాత 12 అంకెల ఆధార్ నంబర్‌ను ఎంటర్‌ చేయాలి. మీ రిజిస్ట‌ర్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఒక‌సారి కోడ్‌ను ఎంట‌ర్ చేసిన త‌ర్వాత మీ ఫోటో, చిరునామా, పుట్టిన తేదీ, జెండ‌ర్ వంటి వ్య‌క్తిగ‌త వివరాలు క‌నిపిస్తాయి. వాటిని ధ్రువీకరిస్తే ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ విజ‌య‌వంతంగా పూర్త‌వుతుంది. భ‌విష్య‌త్‌ రిఫ‌రెన్స్ కోసం ఎక్నాలెజ్‌మెంట్‌ నంబర్‌ జనరేట్‌ అవుతుంది. ఇక రెండో ఆప్ష‌న్ ‘చెక్ స్టేట‌స్‌/డౌన్‌లోడ్ పాన్’. ఇక్క‌డ నుంచి ఈ-పాన్ పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. ఇది ఉచిత స‌ర్వీస్‌. ఈ-పాన్ కేటాయించినందుకు ఛార్జీలు చెల్లించ‌న‌ అవ‌స‌రం లేదు. ఈ-పాన్ మీ ఈ-మెయిల్ ఐడీకి వ‌స్తుంది.

పాన్ స‌ర్వీస్ పోర్టల్ ద్వారా..
పాన్ స‌ర్వీస్ పోర్టల్ ద్వారా కూడా ఈ-పాన్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. https://www.pan.utiitsl.com/PAN/ సంద‌ర్శించి పాన్ కార్డుకు సంబంధించి ప‌లు స‌ర్వీసుల‌ను పొందొచ్చు. పాన్ ద‌ర‌ఖాస్తుతో పాటు స‌మాచారంలో త‌ప్పులు ఉంటే దిద్దుబాట్లు చేసుకోవ‌చ్చు. అలాగే అడ్ర‌స్ అప్‌డేట్‌, ఈ-పాన్‌ డౌన్‌లోడ్, ఆధార్‌-పాన్ లింక్ స్టేట‌స్ వంటి ఇత‌ర సేవ‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా ఫిజిక‌ల్ కార్డు కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఒక‌వేళ ఈ-పాన్, ఫిజిక‌ల్ కార్డు రెండూ కావాలంటే రూ.107 చెల్లించాలి. ఫిజిక‌ల్ కార్డు అవ‌స‌రం లేద‌నుకుంటే రూ.72 చెల్లిస్తే స‌రిపోతుంది. ఈ-పాన్ ఆదాయ‌పు ప‌న్ను శాఖ రికార్డుల్లో ఉన్న మీ ఈ-మెయిల్ ఐడీకి పంపిస్తారు. https://www.utiitsl.com/  పోర్ట‌ల్ ద్వారా కూడా పాన్ కార్డు కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

ఆదాయ‌పు ప‌న్ను శాఖ ఆధార్‌-పాన్ అనుసంధాన గ‌డువును మార్చి 31, 2022 వ‌ర‌కు పొడిగించింది. ఇంకా ఆధార్‌-పాన్‌ల‌ను లింక్ చేయని వారు ఐటీ శాఖ ఈ-పోర్ట్‌ల్ ద్వారా గానీ, ఏదైనా మొబైల్ నంబర్‌ నుంచి UIDPAN అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి 12 అంకెల ఆధార్ నంబర్‌ టైప్‌ చేసి స్పేస్ ఇచ్చి 10 అంకెల పాన్ నంబర్‌ను టైప్ చేసి 56677కి ఎస్సెమ్మెస్‌ చేయడం ద్వారా లింక్ చేయ‌వ‌చ్చు.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని