Updated : 20 Jan 2022 16:32 IST

ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత సాధార‌ణ ఆదాయం పొంద‌డం ఎలా?

ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత సాధార‌ణ ఆదాయాన్ని పొంద‌డం ఎంత ముఖ్య‌మో ఇక్క‌డ ఉంది. ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత వారు పొందిన ఏక మొత్తాన్ని ఇత‌ర ల‌క్ష్యాల కోసం ఉప‌యోగించ‌డం చేస్తే.. మ‌ళ్లీ ఏదైనా ఉద్యోగంలో చేర‌వ‌ల్సిన పరిస్థితి ఏర్ప‌డుతుంది. మీరు జీవించి ఉన్నంత వ‌ర‌కు మీ నెల‌వారీ ఖ‌ర్చుల‌ను చూసుకోవ‌డానికి క్ర‌మం త‌ప్ప‌కుండా ఆదాయ వ‌న‌రుని క‌లిగి ఉండ‌టం చాలా ముఖ్యం. ఉద్యోగ విర‌మ‌ణ త‌ర్వాత ఎంత స‌రిపోతుంది అనే ప్ర‌శ్న‌కి స‌మాధానం చాలా మంది ద‌గ్గ‌ర లేదు. ఈ కార్ప‌స్ మొత్తం మీ ప్ర‌స్తుత ఆదాయం, జీవ‌న‌శైలి, మీపై ఆధార‌ప‌డేవారు మొద‌లైన వాటిపై ఆధార‌ప‌డి ఉంటుంది. మీకు అవ‌స‌ర‌మైనంత పొదుపు చేయ‌లేక పొవ‌చ్చు. అయితే, మీరు సంపాదించే వ‌య‌స్సులో ఉన్న‌ప్పుడే మీ ఆదాయ‌న్ని పెంచాలి, ఆదా చేయాలి, పెట్టుబడులు పెర‌గ‌నివ్వాలి.

మంచి ఆదాయం ఉన్నా కూడా కొంత మంది అనాలోచితంగానో, లేక అవసరార్ధం ఖ‌ర్చు పెట్టేస్తారు. ఉదాహ‌ర‌ణ‌కు భార్గ‌వ్ త‌న ప‌ద‌వీ విర‌మ‌ణ ప్ర‌యోజ‌నాల‌లో భాగంగా ఏక మొత్తంలో రూ. 50 ల‌క్ష‌ల‌తో ప‌ద‌వీ విర‌మ‌ణ చేశాడు. ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత 8-10 సంవ‌త్స‌రాల త‌ర్వాత అత‌ను త‌న పొదుపు మొత్తాన్ని త‌న పిల్ల‌ల ఉన్నత విద్య‌కు నిధులు స‌మ‌కూర్చ‌డం, కారు, ఆస్తిని కొనుగోలు చేయ‌డం వంటి ఇత‌ర ల‌క్ష్యాల కోసం వినియోగించినందున అత‌ను చాలా ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నాడు. దీని కార‌ణంగా త‌న ఆర్ధిక అవ‌స‌రాల‌ను తీర్చుకోవ‌డం కోసం త‌న వృద్ధాప్యంలో మ‌ళ్లీ స‌ల‌హాదారుగా ప‌ని చేయ‌డం త‌ప్ప వేరే మార్గం క‌నిపించ‌లేదు. ఇటువంటి వ్య‌క్తులు స‌మాజంలో చాలా మంది క‌నిపిస్తుంటారు.

ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత  ఆస్తి లేదా వాహ‌నం కొనుగోలు, దూర ప్రాంతాల‌కు విహార‌యాత్ర‌లు, పిల్ల‌ల ఉన్నత విద్య వంటి ఇత‌ర ల‌క్ష్యాల కోసం ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత పొందే ఏక మొత్తాన్ని ఉప‌యోగించుకునే వారు చాలా మందే ఉన్నారు. పిల్ల‌ల వివాహాం ఖ‌ర్చుల ఫ‌లితంగా వారు డ‌బ్బు కోసం ఇత‌రుల‌పై ఆధార‌ప‌డ‌తారు లేదా మ‌ళ్లీ డ్యూటీ చేప‌ట్ట‌వ‌ల‌సిన అవ‌స‌రానికి వ‌స్తుంటారు. అందువ‌ల్ల ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత కూడా సాధార‌ణ ఆదాయం వ‌చ్చేలా చూసుకోవ‌డం చాలా ముఖ్యం. ఎవ‌రికైన, ముఖ్యంగా ఉద్యోగ విర‌మ‌ణ చెందిన వారికి కూడా ఆర్ధిక స్వాతంత్య్రం చాలా ముఖ్యం. సాధార‌ణ ఆదాయం లేన‌పుడు, ఇత‌రుల‌పై ఆధార‌ప‌డ‌వ‌ల‌సి ఉంటుంది, లేదా ప్రాధ‌మిక అవ‌స‌రాల‌పై రాజీప‌డాలి. అందువ‌ల్ల రిటైర‌యినా కూడా క్ర‌మ‌మైన ఆదాయ వ‌న‌రును క‌లిగి ఉండ‌టం చాలా అవ‌స‌రం.

ఆరోగ్య స‌మ‌స్య‌ల ప‌ట్ల శ్ర‌ద్ధ వ‌హించాలి. వ‌య‌సు పెరిగే కొద్దీ అనారోగ్య స‌మ‌స్య‌లు పెరుగుతాయి. ఆరోగ్య బీమా దీనికి మంచి ప‌రిష్కారం, కానీ చాలా మంది దీనిని ఎంచుకోరు. ఉద్యోగం చేసేట‌పుడు య‌జ‌మాని అందించిన హెల్త్ ఇన్సూరెన్స్‌పై ఆధార‌ప‌డ‌తారు. ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత‌, వారికి బీమా ర‌క్ష‌ణ లేకుండా పోతుంది. ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత కూడా సాధార‌ణ ఆదాయ వ‌న‌రు ఉంటే ఇత‌ర అవ‌స‌రాల‌పై రాజీ ప‌డ‌కుండా ఉత్త‌మ‌మైన చికిత్స‌ను పొంద‌డానికి అవ‌కాశ‌ముంటుంది.

2 ద‌శాబ్దాల నుండి మ‌నుషుల స‌గ‌టు ఆయ‌ష్షు పెరిగింది. అంటే వ్య‌క్తి జీవించి ఉన్నంత‌కాలం నెల‌వారీ ఖ‌ర్చుల‌ను చూసుకోవ‌డానికి ఆదాయ వ‌న‌రును క‌లిగి ఉండ‌టం ముఖ్యం. కుటుంబ అవ‌స‌రాల‌తో, ముఖ్యంగా పిల్ల‌ల ఉన్నత విద్య‌, వివాహం వంటి అవ‌స‌రాల‌తో ముడిప‌డి ఉన్న భావోద్వేగాల కార‌ణంగా, చాలా మంది వ్య‌క్తులు త‌మ ప‌ద‌వీ విర‌మ‌ణ నిధిని ఇత‌ర ల‌క్ష్యాల‌కోసం ఖ‌ర్చుపెట్టేస్తుంటారు. ఇది సరైనది కాదు.

ప‌ద‌వీ విర‌మ‌ణ ప్ర‌ణాళిక‌ల‌కు.. వివిధ కంపెనీలు అందించే మ్యూచువ‌ల్ ఫండ్‌లు, పెన్ష‌న్ ప్లాన్‌లు వంటి అనేక పెట్టుబ‌డి ఎంపిక‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే డైరెక్ట్ ఈక్విటీ, మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డులు అధిక రాబ‌డిని పొంద‌గ‌ల సామ‌ర్ధ్యాన్ని క‌లిగి ఉన్న‌ప్ప‌టికీ, వాటితో రిస్క్ కూడా ఎక్కువ‌గా ఉంటుంది. అయితే, దీర్ఘకాలం లో రిస్క్ తగ్గుతుంది.

సౌక‌ర్య‌వంత‌మైన ప‌ద‌వీ విర‌మ‌ణ కోసం ప్ర‌ణాళిక వేసుకోవ‌డం ఒక అనివార్య‌మైన ల‌క్ష్యం కాబ‌ట్టి, వివిధ ఆర్ధిక సాధ‌నాల మ‌ధ్య త‌గిన వైవిధ్య‌త‌తో వారి పెట్టుబ‌డిని ఎంచుకోవాలి. చాలా వరకు బీమ్ కంపెనీలు అందించే యాన్యుటీ  ప్లాన్ లలో చార్జీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి రాబడి తక్కువగా ఉంటుంది. ఇలాంటి వాటి నుంచి జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎన్పీఎస్ లో మదుపు చేసినట్టయితే మంచి కార్పస్ సమకూర్చుకోవచ్చు. అలాగే, ఇందులో 60 శాతం మెచ్యూరిటీ సమయం లో తీసుకుని మిగిలిన మొత్తం తో నెలసరి పెన్షన్ పొందొచ్చు.

రిటైర‌యిన త‌ర్వాత వ‌చ్చే ఏక మొత్త నిధిని వివిధ అవ‌స‌రాల‌కు ఖ‌ర్చు పెట్టేయ‌కుండా ఎస్సిఎస్ఎస్, ఎల్ఐసి వయ వందన యోజన, ఫిక్సిడ్ డిపాజిట్ లు లాంటి వాటిల్లో మదుపు చేసి పెన్షన్ పొందవచ్చు. దీర్ఘకాలం కోసం అయితే కొంత మొత్తాన్ని రిస్క్ త‌క్కువుండే ఇండెక్స్  మ్యుచువ‌ల్ ఫండ్స్ వంటి వాటిలో పెట్టుబ‌డి పెట్ట‌డం కూడా మంచిదే.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని