వ్య‌క్తిగ‌త రుణంతో సిబిల్ స్కోర్ మెరుగుప‌రుచుకోవ‌చ్చా?

క్రెడిట్ కార్డు కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ప్పుడు, రుణ‌దాత‌లు తాము న‌ష్టాల బారిన ప‌డ‌కుండా, త‌మ భ‌ద్ర‌త కోసం మీ రుణ చ‌రిత్ర‌ను చూస్తారు. మీ అర్హ‌త‌ను వివిధ అంశాల ద్వారా నిర్ణ‌యిస్తారు. అయితే మీ రుణ విశ్వ‌స‌నీయ‌త‌ను, రుణాన్ని తిరిగి చెల్లించే సామ‌ర్ధ్యాన్ని సూచించేది మీ సిబిల్ స్కోరు. వేరువేరు ప్ర‌మాణికాల ఆధారంగా ప్ర‌తీ రుణ‌దాత నిర్ధిష్ట రుణాన్ని మంజూరు చేస్తుంటారు. ఆర్‌బీఐ సూచ‌న‌ల..

Updated : 01 Jan 2021 20:25 IST

క్రెడిట్ కార్డు కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ప్పుడు, రుణ‌దాత‌లు తాము న‌ష్టాల బారిన ప‌డ‌కుండా, త‌మ భ‌ద్ర‌త కోసం మీ రుణ చ‌రిత్ర‌ను చూస్తారు. మీ అర్హ‌త‌ను వివిధ అంశాల ద్వారా నిర్ణ‌యిస్తారు. అయితే మీ రుణ విశ్వ‌స‌నీయ‌త‌ను, రుణాన్ని తిరిగి చెల్లించే సామ‌ర్ధ్యాన్ని సూచించేది మీ సిబిల్ స్కోరు. వేరువేరు ప్ర‌మాణికాల ఆధారంగా ప్ర‌తీ రుణ‌దాత నిర్ధిష్ట రుణాన్ని మంజూరు చేస్తుంటారు. ఆర్‌బీఐ సూచ‌న‌ల ప్ర‌కారం, రుణం/ క‌్రెడిట్ కార్డు కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న ప్ర‌తీవ్య‌క్తి సిబిల్ స్కోరును, ఆర్ధిక సంస్థ‌లు త‌ప్ప‌నిస‌రిగా ప‌రిగ‌ణ‌లోనికి తీసుకోవాలి.

సిబిల్ నివేదిక:

క్రెడిట్ కార్డుల‌పై, రుణాల‌పై గ‌త చెల్లింపుల‌ను గురించిన పూర్తి స‌మాచారాం సిబిల్ నివేదిక‌లో ఉంటుంది. ఈ నివేదిక ఆధారంగా రుణ గ్ర‌హీత ప్ర‌స్తుత చెల్లింపుల‌తో పాటుగా గ‌త రుణ చ‌రిత్ర‌ను కూడా ప‌రిగ‌ణ‌లోనికి తీసుకుని భ‌విష్య‌త్తులో తిరిగిచెల్లించే సామ‌ర్ధ్యాన్ని రుణ‌దాత అంచానా వేస్తారు. స‌మ‌యానికి రుణం చెల్లించ‌క‌పోతే బ్యాంకులు రుణ‌గ్ర‌హీత‌ల‌కు త‌క్కువ క్రెడిట్ స్కోర్‌ను ఇస్తాయి. అయితే వ్య‌క్తి గ‌త రుణం ద్వారా మీ క్రెడిట్ స్కోరును చాలా సుల‌భంగా మెరుగుప‌ర‌చుకోవ‌చ్చు.

వ్య‌క్తిగ‌త రుణాల‌తో క్రెడిట్‌స్కోర్‌:

వ్య‌క్తిగ‌త రుణం అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల‌లో చాలా ఉప‌యోగ‌ప‌డుతుంది. దీనికి ఏవిధ‌మైన ఆర్ధిక భ‌ద్ర‌త అవ‌స‌రం లేదు. కొద్ది ఫార్మాలిటీల‌తోనే రుణాల‌ను అందిస్తుంది. ఇది ఖ‌రీదైన రుణ ఎంపిక కావ‌డం వ‌ల్ల ప్ర‌జాద‌ర‌ణ పొంద‌లేదు. అయితే వ్య‌క్తిగ‌త రుణాల‌ను స‌రైన ప‌ద్ధ‌తిలో ఉప‌యోగించుకుంటే మీ సిబిల్ స్కోర్‌ను మెరుగుప‌రుచుకోవ‌చ్చు.

రుణ ఏకీకరణకు వ్యక్తిగత రుణాలు:

వ్య‌క్తిగత రుణంతో క్రెడిట్ స్కోరును మెరుగుపరుచుకోవడం ఒక తెలివైన‌ మార్గం. అవుట్ స్టాండింగ్ క్రెడిట్ కార్డు బిల్లు మీ సిబిల్ స్కోరుకు హాని క‌లిగిస్తుంది. గుడువు ముగిసే స‌మ‌యానికి మీరు చెల్లించ‌ని మొత్తానికి అధిక వ‌డ్డీరేటు విధిస్తారు. దీనికి తోడు క్రెడిట్ కార్డు ప‌రిధికి మించి వాడితే విధించే రుసుములు కూడా మీకు ఆందోళ‌న క‌లిగించ‌వ‌చ్చు. ఇటువంటి అధిక రుణాల‌తో మీరు ఒక‌టి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డుల‌ను క‌లిగివుంటే అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్‌పై చెల్లించ‌వ‌ల‌సిన వ‌డ్డీ కూడా అధికంగానే ఉంటుంది.

క్రెడిట్ కార్డు బిల్లులు ప‌రిధిని మించుతున్నాయ‌ని మీరు అనుకున్న‌ప్పుడు, దీనికి బ‌దులుగా సిబిల్ స్కోరును ఉప‌యోగించి మంచి వ్యక్తిగ‌త రుణాన్ని తీసుకోవ‌చ్చు. అయితే మంచి సిబిల్ స్కోరు లేక‌పోతే ఇది సాధ్యంకాదు.

చాలా ర‌కాలైన‌ క్రెడిట్ కార్డుల‌ కంటే వ్య‌క్తిగ‌త రుణాల చాలా త‌క్కువ ఖ‌ర్చుతో ల‌భిస్తాయి. ఇటువంటి క్రెడిట్ కార్డు రుణాల‌కు బ‌దులుగా వ్య‌క్తి గ‌త రుణం తీసుకుంటే చాలా వర‌కు ఆదా చేసుకోవ‌చ్చు. వ్య‌క్తిగ‌త రుణాల‌ను ఈక్వీటెడ్ నెల‌వారీ వాయిదాల (ఈఎమ్ఐ) ద్వారా సుల‌భంగా నిర్వ‌హించ‌వ‌చ్చు.

రుణాల‌ను ఏక‌మొత్తంగా చెల్లించ‌డం ద్వారా మీ సిబిల్ స్కోరు పెర‌గ‌దు. వ్యక్తిగ‌త రుణాల‌లో నెల‌వారీ వాయిదాల‌ను క్ర‌మం త‌ప్ప‌కుండా చెల్లించ‌డం ద్వారా మంచి సిబిల్ స్కోరు పొంద‌వ‌చ్చు.

చివ‌రి మాట:

వ్య‌క్తిగ‌త రుణాల ద్వారా సిబిల్ క్రెడిట్ స్కోరు మెరుగుప‌డుతున్న‌ప్ప‌కీ, దీనిని అన‌వ‌స‌రంగా తీసుకోవ‌టం కూడా మంచిది కాదు. చిన్న‌, ప‌రిమిత సంఖ్య‌లో వ్య‌క్తిగ‌త రుణాల‌ను క‌లిగి ఉండ‌డం మంచిది. వ్య‌క్తిగ‌త రుణం కేవ‌లం అత్య‌వ‌స‌ర ఆర్థిక ప‌రిస్థితుల‌కు మాత్ర‌మే కాకుండా ఆరోగ్య‌క‌ర‌మైన‌ సిబిల్ రేటింగ్ కు స‌హాయ‌ప‌డుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని