Health Insurance: అధిక ప్రీమియం చెల్లించకుండానే కవరేజీ పెంచుకోవాలా?
వయసు పెరిగే కొద్దీ అనారోగ్యాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవి మీ వైద్య ఖర్చులను పెంచుతాయి. అందువల్ల తగిన కవరేజీతో ఆరోగ్య బీమా ఉండడం అవసరం.
ఆరోగ్యంగా ఉంటే..మన వద్ద సంపద ఉన్నట్లే. అయితే, వయసు పెరిగే కొద్ది అనారోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. 20, 30లతో పోలిస్తే 40లలో అనారోగ్యాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది మీ వైద్య ఖర్చులను పెంచుతుంది. వీటిని ముందుగానే ప్లాన్ చేయకపోతే ఆసుపత్రి బిల్లులు మీ పొదుపు, పెట్టుబడులను హరిస్తాయి. అందువల్ల తగిన కవరేజీతో ఆరోగ్య బీమా ఉండడం అవసరం.
40 ఏళ్లలో కవరేజీ సరిపోకపోవచ్చు
సాధారణంగా 20, 30 ఏళ్లలోనే ఆరోగ్య బీమా తీసుకుంటుంటాం. అయితే అప్పుడు ఉన్న ఆరోగ్య, ఆర్థిక స్థితిగతులను అనుసరించి చాలా మంది తక్కువ కవరేజీతో కూడిన ఆరోగ్య బీమాను తీసుకుంటుంటారు. మరికొంత మంది యజమాని అందించే బృంద బీమాపై ఆధారపడతారు. అయితే యజమాని అందించే బృంద బీమా కొంత మేరకు మాత్రమే కవర్ చేస్తుంది.
40 ఏళ్లు వచ్చే సరికి ఆరోగ్య బీమా అవసరం పెరుగుతుంది. అదీకాకుండా రోజు రోజుకి పెరుగుతున్న వైద్య ద్రవ్యోల్బణంతో వైద్య ఖర్చులు పెరిగిపోతున్నాయి. కాబట్టి 20, 30 ఏళ్లలో తక్కువ కవరేజీతో కొనుగోలు చేసిన సాధారణ బీమా లేదా సంస్థ అందించే బృంద బీమాతో ఈ ఖర్చులను పొందడం సాధ్యం కాకపోవచ్చు. అలాగని 40 ఏళ్ల వయసులో కవరేజీ పెంచుకునేందుకు కొత్త పాలసీ కొనుగోలు చేయాలంటే..ప్రీమియం ఎక్కువవుతుంది. పెద్ద వయసు కారణంగా ఎక్కువ మొత్తం కవరేజీ కోసం చాలా ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి రావచ్చు. అందువల్ల ఈ వయసులో కొత్త పాలసీ భారమే అవుతుంది. ఇందుకు ఒక చక్కటి పరిష్కారం టాప్-అప్ పాలసీ.
టాప్-అప్ అంటే..
మీ ప్రస్తుత బీమా ప్లాన్‌పై అదనపు కవరేజీని కొనుగోలు చేయడమే టాప్-అప్. ఒకవేళ వైద్య బిల్లులు ఆరోగ్య బీమా పరిమితిని మించితే..అదనపు మొత్తాన్ని టాప్-అప్ ప్లాన్ కవర్ చేస్తుంది. తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజీని పొందేందుకు అనువైన మార్గం టాప్-అప్ ప్లాన్.
ఉదాహరణకి, మీ ప్రస్తుత ఆరోగ్య బీమా రూ.10 లక్షలు, టాప్ అప్ బీమా కవరేజీ రూ.30 లక్షలు, టాప్-అప్ డిడక్ట్‌బుల్ మొత్తం రూ.10 లక్షలు అనుకుందాం. ఇప్పుడు..మీ ఆసుపత్రి బిల్లు రూ.20 లక్షలు అయితే..రూ. 10 లక్షలు సాధారణ ఆరోగ్య బీమా, మిగిలిన రూ.10 లక్షలు టాప్-అప్ ప్లాన్ చెల్లిస్తుంది. ఒకవేళ టాప్-అప్ ప్లాన్ లేకపోతే రూ.10 లక్షలు మీ జేబు నుంచి చెల్లించాల్సి వచ్చేది.
పైన తెలిపినట్టుగా, టాప్-అప్ ప్లాన్‌లో డిడక్టబుల్ ఉంటుంది. వైద్య బిల్లులు ఈ పరిమితిని దాటినప్పుడు మాత్రమే టాప్-అప్ పాలసీ చెల్లిస్తుంది. కాబట్టి మీ సాధారణ ఆరోగ్య బీమా కవరేజీ పరిమితి వరకు డిడక్ట్‌బుల్ పెట్టుకుంటే మంచిది. మీ బేస్ పాలసీని కొనుగోలు చేసిన అదే బీమా సంస్థ నుంచి టాప్-అప్ ప్లాన్‌ను పొందడం ప్రయోజనకరంగా ఉంటుంది. మీ వ్యక్తిగత లేదా ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్‌లపై కూడా టాప్-అప్‌ను తీసుకోవచ్చు. మీరు 40 ఏళ్ల వయసులో హెల్త్ టాప్-అప్ కొనుగోలుకు ప్లాన్ చేస్తుంటే..ముందుగా మీ బేస్ పాలసీ కవరేజీ చూడాలి. ఆ తర్వాత మీ కుటుంబ వైద్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని టాప్-అప్ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. హెల్త్ టాప్-అప్‌లు రెండు రకాలుగా ఉంటాయి. 1. రెగ్యులర్ టాప్-అప్, 2. సూపర్ టాప్-అప్
ఈ రెండింటికి వ్యత్యాసం ఏంటి?
టాప్ అప్ పాలసీ..
పాలసీదారుడు క్లెయిం చేసిన ప్రతీసారి డిడక్టబుల్ లిమిట్‌ను పరిగణలోకి తీసుకుంటారు. డిడక్ట్‌బుల్ లిమిట్ దాటిన క్లెయింలను హామీ ఇచ్చిన మొత్తం మేరకు చెల్లిస్తారు.
ఉదాహరణకు, మీరు రూ.10 లక్షల హామీ మొత్తంలో రూ.2 లక్షల డిడక్ట్‌బుల్‌తో టాప్ ప్లాన్ తీసుకున్నారు అనుకుందాం. ఇప్పుడు ఒక ఏడాదిలో మొదటి సారి రూ.5 లక్షల ఆసుపత్రి బిల్లు అయితే, ఇందులో రూ.2 లక్షలు మీరు చెల్లించాలి. మిగిలిన రూ.3 లక్షలు టాప్-అప్ పాలసీ చెల్లిస్తుంది. అదే ఏడాదిలో రెండో సారి మరో రూ.6 లక్షలు ఆసుపత్రి బిల్లు అయితే అందులో కూడా రూ. 2 లక్షలు మీరు చెల్లించాలి. రూ.4 లక్షలు టాప్ పాలసీ కవర్ చేస్తుంది. అంటే క్లెయిం చేసిన ప్రతీసారి డిడక్ట్‌బుల్ మొత్తం వరకు పాలసీదారుడే చెల్లించాలి. మిగిలిన మొత్తాన్ని(హామీ మొత్తానికి లోబడి) టాప్-అప్ పాలసీ చెల్లిస్తుంది.
సూపర్ టాప్-అప్ పాలసీ..
ఒక ఏడాదిలో చేసిన అన్ని క్లెయింలను పరిగణలోకి తీసుకుంటారు. డిడక్ట్‌బుల్ లిమిట్ దాటితే..ఏడాదిలో అన్ని క్లెయింలను హామీ ఇచ్చిన మొత్తం వరకు చెల్లిస్తారు.
ఉదాహరణకు, మీరు రూ.10 లక్షల హామీ మొత్తంలో రూ. 2 లక్షల డిడక్ట్‌బుల్‌తో సూపర్ టాప్-అప్ ప్లాన్ తీసుకున్నారు అనుకుందాం. ఒక ఏడాదిలో మొదటి సారి రూ.5 లక్షల ఆసుపత్రి బిల్లు అయ్యింది. ఇందులో రూ.2 లక్షలు మీరు చెల్లించాలి. మిగిలిన రూ.3 లక్షలు సూపర్ టాప్-అప్ పాలసీ చెల్లిస్తుంది. అదే ఏడాదిలో రెండో సారి మరో రూ.6 లక్షలు ఆసుపత్రి బిల్లు అయితే రూ.6 లక్షలు టాప్ పాలసీ కవర్ చేస్తుంది. అంటే సూపర్ టాప్-అప్ ఏడాది మొత్తంలో ఉన్న క్లెయింలను పరిగణలోకి తీసుకుని హామీ మొత్తానికి లోబడి క్లెయింలను చెల్లిస్తుంది.
చివరిగా..
అధిక ప్రీమియం చెల్లించకుండానే, ఆరోగ్య బీమా కవరేజీని పెంచుకోవడం కోసం టాప్-అప్/సూపర్ టాప్ అప్ ప్లాన్‌లను ఎంచుకోవచ్చు. అయితే ప్లాన్‌లను ఎంచుకునే ముందు పాలసీలో కవరయ్యే వ్యాధులు, కవర్ కాని వ్యాధులను తనిఖీ చేసి మీ కుటుంబ ఆరోగ్య చరిత్ర ఆధారంగా పాలసీ ఎంపిక చేసుకోవడం మంచిది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
NEET PG 2023: ఎంబీబీఎస్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. నీట్ పీజీ పరీక్షకు ఇంటర్న్‌షిప్ కటాఫ్ గడువు పెంపు
-
Crime News
Aaftab: శ్రద్ధాను చంపి.. చికెన్ రోల్ తిన్నాడు
-
India News
రూ.50వేల చొప్పున తీసుకున్నారు.. భర్తల్ని వదిలేసి ప్రియుళ్లతో వెళ్లిపోయారు
-
Crime News
Crime News: మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ భార్య బలవన్మరణం
-
Politics News
Kotamreddy: అభిమానం ఉండాలి.. రూ.కోట్లుంటే గెలవలేరు: కోటంరెడ్డి
-
Politics News
జగన్ గ్రాఫ్ పడిపోతోంది.. ఏపీ వెళ్లి పాదయాత్ర చేసుకో: షర్మిలకు కడియం సూచన