SBI FD: ఆన్‌లైన్‌లో ఎస్‌బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాను ఎలా తెర‌వాలి?

'ఎస్‌బీఐ' సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు 2.90% - 5.50%, సీనియ‌ర్ సిటిజ‌న్‌ల‌కు 3.40% - 6.30% వ‌ర‌కు వ‌డ్డీ రేటును అందిస్తోంది.

Updated : 25 Jul 2022 16:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రూ. 2 కోట్ల కంటే త‌క్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై వ‌డ్డీ రేట్ల‌ను చివ‌రి సారిగా జూన్‌ 14వ తేదీన స‌వ‌రించింది. స‌వ‌ర‌ణ త‌ర్వాత బ్యాంకు ఇప్పుడు సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు 2.90% - 5.50%, సీనియ‌ర్ సిటిజ‌న్లకు 3.40% - 6.30% వ‌ర‌కు వ‌డ్డీ రేటును అందిస్తోంది. ప‌న్ను ఆదా చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై ఎస్‌బీఐ సీనియ‌ర్ సిటిజ‌న్లకు 5.50%, 6.30% వ‌డ్డీ రేటును అందిస్తోంది. ఎస్‌బీఐలో ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌ను బ్యాంకుకు వెళ్లి ఎఫ్‌డీల‌ను చేయ‌డం చాలా మందికి తెలిసిందే. కానీ ఆన్‌లైన్‌లో కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్‌ చేయవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం..

  • https://retail.onlinesbi.com/retail/login.htm కి లాగిన్ అయ్యి Continue to login పై క్లిక్ చేయండి.
  • ఇప్పుడు మీ యూజ‌ర్ నేమ్‌, పాస్‌వ‌ర్డ్ ఎంట‌ర్ చేసి లాగిన్‌పై క్లిక్ చేయండి.
  • ఆ త‌ర్వాత డిపాజిట్ & ఇన్వెస్ట్‌మెంట్ ఎంపిక‌పై క్లిక్ చేసి, డ్రాప్‌-డౌన్ మెనూ కింద‌ ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను సెల‌క్ట్ చేయండి.
  • ఇప్పుడు ఫిక్స్‌డ్ డిపాజిట్ (e-TDR/e-STDR)పై క్లిక్ చేసి ఆపై మీ రిజిస్ట‌ర్డ్ మొబైల్ నంబ‌ర్‌కి పంపిన ఓటీపీని న‌మోదు చేయండి.
  • అనంతరం ప్రోసీడ్‌పై క్లిక్ చేసి మీరు డిపాజిట్ చేయాల‌నుకుంటున్న మొత్తాన్ని న‌మోదు చేయండి.
  • మీరు సీనియ‌ర్ సిటిజ‌న్ అయితే ఆ కేట‌గిరిని టిక్ చేయండి.
  • ఇప్పుడు STDR నుంచి పెట్టుబ‌డి ర‌కాన్ని క్యుములేటివ్ ఎంపిక గానీ TDR నుంచి నాన్‌-క్యుములేటివ్ ఎంపిక గానీ సెల‌క్ట్ చేసుకోండి.
  • త‌ర్వాత డిపాజిట్ కాల‌వ్య‌వధి, మెచ్యూరిటీ సూచ‌న‌ల‌ను ఎంచుకోండి.
  • నిబంధ‌న‌లు, ష‌ర‌తుల‌ను అంగీక‌రించి స‌బ్మిట్‌పై క్లిక్ చేయండి.
  • స‌మ‌ర్పించిన వివ‌రాల‌ను ధ్రువీక‌రించుకొని Confirmపై క్లిక్ చేయండి.
  • మీకు ఇప్పుడు స్క్రీన్‌పై ఎఫ్‌డీ విజ‌య‌వంతం అయిన‌ట్లు చూపిస్తుంది. మీ ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతా వివ‌రాలు Account Summaryలో చూడొచ్చు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని