బ్రాంచ్‌కు వెళ్లే పనిలేకుండా.. ఆన్లైన్లో సులువుగా SBI సేవింగ్స్ అకౌంట్
SBI savings account online: సింపుల్‌గా ఆన్లైన్లోనే వీడియో కేవైసీ ఆధారంగా ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా సేవింగ్స్ బ్యాంక్ ఖాతాను తెరుచుకోవచ్చని SBI చెబుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఒకప్పుడు స్టేట్‌బ్యాంక్‌లో సేవింగ్స్ ఖాతా తెరవడం అంటే మామూలు విషయం కాదు. పేజీలకు పేజీలుండే దరఖాస్తు ఫారం నింపి, ఫొటోలు అతికించి, వీలైనన్ని చోట్ల సంతకాలు చేసి తీరా సంబంధిత బ్యాంక్ అధికారి దగ్గరికి వెళితే బారెడంత క్యూ మన ముందు కనిపించేది. దరఖాస్తులో ఏ చిన్న పొరపాటు జరిగినా, ఏ ధ్రువపత్రమో మిస్ అయినా ఇక ఆరోజు అకౌంట్ తెరవడం వీలుపడేదే కాదు. కానీ, డిజిటల్ పుణ్యామా అని బ్యాంకింగ్ సేవలు ఇప్పుడు సులువయ్యాయి. బ్యాంక్ ఖాతా తెరవడానికి బ్యాంక్ శాఖకు వెళ్లాల్సిన అవసరం లేదంటోంది ఎస్బీఐ. సింపుల్‌గా ఆన్లైన్లోనే వీడియో కేవైసీ ఆధారంగా ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా సేవింగ్స్ బ్యాంక్ ఖాతాను తెరుచుకోవచ్చని చెబుతోంది. అదెలాగో చూద్దాం..
ఖాతా తెరవడం ఎలా...?
- ఆన్లైన్లో బ్యాంక్ ఖాతా తెరవాలంటే ఎస్బీఐ యోనో యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
- అందులో ఎస్బీఐ సేవింగ్స్ ఖాతా తెరవాలనుకుంటున్నారా? అనే ఆప్షన్ ఎంచుకోవాలి.
- పాన్, ఆధార్ వివరాలు ఎంటర్ చేయాలి.
- అప్పుడు ఆధార్ అనుసంధానమై ఉన్న మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది దాన్ని ఎంటర్ చేయాలి.
- ఆ తర్వాత సంబంధిత సమాచారాన్ని ఎంటర్ చేయాలి.
- వీడియో కాల్‌కు షెడ్యూల్ చేయాలి.
- షెడ్యూల్ సమయంలో మళ్లీ యోనో యాప్ తెరిచి కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.
- వీడియో కేవైసీ సమయంలో ఒరిజినల్ ఆధార్, పాన్ కార్డులను చూపించాల్సి ఉంటుంది.
- కేవైసీ ప్రక్రియ పూర్తయ్యాక బ్యాంక్ అధికారులు వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారు. అనంతరం మీ పేరున ఖాతా ఓపెన్ అవుతంది.
పేపర్‌తో పనిలేదు.. బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు..
కొత్తగా సేవింగ్స్ ఖాతా తెరవాలనుకునేవారు, ఇంకో ఖాతా ఉండాలని కోరుకునే వారు బ్యాంక్ శాఖకు వెళ్లాల్సిన పనిలేకుండా ఈ సేవల్ని వినియోగించుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా ఖాతా తెరిచిన వారు యోనో యాప్, ఇంటర్నెట్ బ్యాంక్ ద్వారా నెఫ్ట్, ఐఎంపీఎస్, యూపీఐ ద్వారా చెల్లింపులు చేయొచ్చు. ఆన్లైన్లో ఖాతా తెరిచిన వారికి ఎస్బీఐ రూపే కార్డును అందిస్తుంది. ఈ ఖాతాలకు చెక్‌బుక్ మాత్రం అందివ్వరు. సంతకంతో కూడిన ఈ తరహా సేవలను పొందాలంటే బ్రాంచ్‌ను సందర్శించాల్సి ఉంటుంది. అవసరం అనుకుంటే పాస్‌బుక్ జారీ చేస్తారు. సాధారణ సేవింగ్స్ ఖాతాను తెరిచేందుకయ్యే ఫీజే ఈ ఖాతా తెరిచేందుకు చెల్లించాల్సి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డెబిట్ కార్డు ఛార్జీలను పెంచిన ఎస్బీఐ
డెబిట్ కార్డులపై నిర్వహణ ఛార్జీలను ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సవరించింది. కొత్త ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. -
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
యాక్సిస్ బ్యాంకు కస్టమర్లు కొందరు తమ క్రెడిట్ కార్డుల్లో అనధికారిక లావాదేవీలు జరుగుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. దీనిపై బ్యాంక్ స్పందించింది. -
Flash Pay: కీ చైన్‌తో పేమెంట్స్.. ఫెడరల్ బ్యాంక్ నుంచి ఫ్లాష్ పే
Federal Bank flash pay: ఫెడరల్ బ్యాంక్ స్మార్ట్ కీ చైన్‌ను తీసుకొచ్చింది. కాంటాక్ట్ లెస్ పేమెంట్ల కోసం దీన్ని వినియోగించుకోవచ్చు. -
పిల్లల పేరిట ఎఫ్డీ
పెట్టుబడికి రక్షణ, రాబడికి హామీ ఉన్న పథకాల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీ) ముందుంటాయి. పిల్లల చదువులు, ఇతర అవసరాల కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటున్న తల్లిదండ్రులు వీటికి ప్రాధాన్యం ఇస్తుంటారు -
సిబిల్ నివేదికలో తప్పులుంటే
రుణం తీసుకోవాలంటే.. బ్యాంకులు ముందుగా పరిశీలించేది క్రెడిట్ నివేదికనే. ఇందులో ఎలాంటి తప్పులూ దొర్లకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే మనకు అవసరం ఉన్నప్పుడు రుణం కోసం వెళ్తే దరఖాస్తును తిరస్కరించే అవకాశం ఉంది. -
Personal Loans: వ్యక్తిగత రుణాల వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయ్?
ప్రస్తుతం అన్ని బ్యాంకులు వ్యక్తిగత రుణాలను అందిస్తున్నాయి. వివిధ బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు ఎంతెంతో ఇక్కడ చూద్దాం... -
Home loan: జీరో ప్రాసెసింగ్ ఫీజు.. 8.3% వడ్డీకే హోమ్‌లోన్
Bank of India home loan offer: బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణాలపై వడ్డీ తగ్గించింది. ప్రాసెసింగ్ ఫీజు సైతం రద్దు చేసింది. మార్చి 31 వరకు ఈ ఆఫర్ ప్రకటించింది. -
ప్రత్యేక ఎఫ్డీలను ప్రారంభించిన నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్లపై గరిష్ఠంగా 9.25% వడ్డీ వరకు పొందొచ్చు. -
Credit Card: క్రెడిట్ కార్డును పరిమితికి మించి వాడుకోవచ్చా?
Credit Card: క్రెడిట్ వాడకంపై తరచూ ఎదురయ్యే కొన్ని కీలక సందేహాలకు ఇటీవల ఆర్బీఐ సమాధానాలు ఇచ్చింది. అవేంటో చూద్దాం..! -
వ్యక్తిగత రుణాలు మోసాల బారిన పడొద్దు
ఎలాంటి హామీ లేకుండా లభించే వ్యక్తిగత రుణాలు అవసరమైనప్పుడు ఎంతో ఉపయోగపడతాయి. మన అవసరాలను ఆసరాగా తీసుకొని, సైబర్ మోసగాళ్లు మన కష్టార్జితాన్ని కాజేసేందుకు సిద్ధంగా ఉంటారు. -
Gold Loans: బంగారు రుణాలపై వడ్డీ రేట్లు ఏ బ్యాంకులో ఎంతెంత?
సురక్షితమైన రుణం కాబట్టి బ్యాంకులు బంగారంపై సరసమైన వడ్డీ రేట్లకు వేగంగా రుణాలందిస్తున్నాయి. వివిధ బ్యాంకులు వసూలుచేసే వడ్డీ రేట్లు ఇక్కడ చూద్దాం.. -
FD Rates: సీనియర్ సిటిజన్ల ఎఫ్డీలపై వడ్డీ రేట్లు ఇవే..
చాలా ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు అత్యధిక వడ్డీ రేటును అందిస్తున్నాయి. 1, 3, 5 ఏళ్ల ఎఫ్డీలపై వడ్డీ రేట్లను ఇక్కడ చూడండి. -
పొదుపు ఖాతాలో ఎంత డబ్బు ఉండాలి?
వ్యక్తిగత ఆర్థిక విషయాల్లో పొదుపు ఖాతాకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. మనం చేసే ఆదాయ-వ్యయాలన్నింటికీ ఆధారం ఇదే. బ్యాంకు, మీరు ఎంచుకున్న ఖాతా రకాన్ని బట్టి, ఇందులో కనీస నిల్వ ఎంత ఉండాలన్నది ఆధారపడి ఉంటుంది. వేతనం ఖాతాలో సున్నా నిల్వ ఉన్నా ఇబ్బందేమీ ఉండదు. -
Car Loans: కారు రుణాలపై ఏ బ్యాంకులో వడ్డీ రేట్లు ఎంతెంత?
దాదాపుగా అన్ని బ్యాంకులు వాహన రుణాలందిస్తున్నాయి. ఈ రుణాలకై వివిధ బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు ఇక్కడ చూద్దాం. -
Credit Cards: హెచ్డీఎఫ్సీ నుంచి ఐదు కొత్త బిజినెస్ క్రెడిట్ కార్డులు
Credit Cards: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఇటీవల నాలుగు కొత్త బిజినెస్ క్రెడిట్ కార్డులను విడుదల చేసింది. వాటి ఫీచర్లు, జాయినింగ్ ఫీజు, అర్హతల వంటి వివరాలను చూద్దాం.. -
Two wheeler insurance: బైక్ ఇన్సూరెన్స్.. ఇవన్నీ తెలుసుకున్నాకే..!
Two wheeler insurance: మీ టూవీలర్‌కు బీమా చేయించాలని చూస్తున్నారా? మంచి పాలసీ తెలుసుకోలేకపోతున్నారా? ఈ కింది విషయాలపై ఓ లుక్కేయండి. -
గృహరుణం ఇప్పుడేం చేయాలి?
ఏడాది కాలంగా రెపో రేటు 6.50 శాతం వద్ద కొనసాగుతోంది. దీన్ని పెంచకపోవడం మంచి పరిణామమే. అదే సమయంలో ద్రవ్యోల్బణం స్థిరంగా ఉన్నప్పటికీ, వడ్డీ రేట్లను తగ్గించేంతగా సహకరించడం లేదు. -
కార్పొరేట్ బాండ్లు ఎంచుకోండి జాగ్రత్తగా
మన దేశంలో అత్యంత సురక్షితమైన, ప్రజాదరణ పొందిన పొదుపు పథకాల్లో బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీ) ముందుంటాయి. నిర్ణీత కాలానికి, స్థిరమైన వడ్డీని అందించే వీటిని చాలామంది ఇష్టపడతారు. -
Saving Account: పొదుపు ఖాతా గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
బ్యాంకులో పొదుపు ఖాతా అనేది ఖాతాదారుడికి ఒక విభిన్నమైన ఆర్థిక సాధనం. ఇది ఖాతాదారుడికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. -
Fixed Deposits: ఎఫ్డీలపై వడ్డీ రేట్లను సవరించిన ఐసీఐసీఐ
ఐసీఐసీఐ బ్యాంకు ఎంపిక చేసిన కొన్ని కాలవ్యవధుల ఎఫ్డీలపై వడ్డీ రేట్లు పెంచింది. ఈ బ్యాంకులో సీనియర్ సిటిజన్లు గరిష్ఠంగా 7.75% వడ్డీని పొందుతారు. -
కారు రుణంపై టాపప్
మీకు ఇప్పటికే కారు రుణం ఉందా? అత్యవసరంగా డబ్బు కావాలా? కారు రుణంపై టాపప్ తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. మంచి రుణ చరిత్ర ఉన్న వారికి బ్యాంకులు సులభంగానే ఈ టాపప్‌ను అందిస్తాయి.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్