SBI: బ్రాంచ్‌కి వెళ్లకుండానే ఎస్‌బీఐలో పొదుపు ఖాతా తెరవొచ్చు.. ఎలాగంటే..

ఎస్‌బీఐ..వీడియో కేవైసి ద్వారా బ్రాంచీకి వెళ్లాల్సిన అవసరం లేకుండా పొదుపు ఖాతాను తెరిచే వీలు కల్పిస్తోంది.

Published : 28 Jan 2023 20:11 IST


స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI)లో పొదుపు ఖాతాను తెరవాలనుకుంటున్నారా? ఇప్పుడు బ్యాంకు బ్రాంచీకి వెళ్లకుండానే పొదుపు ఖాతాను తెరవచ్చు. మీరు ఉన్న చోటి నుంచే ఎప్పుడైనా ఆన్‌లైన్‌ ద్వారా ఎస్‌బీఐ 'ఇన్‌స్టా ప్లస్‌' పొదుపు ఖాతాను తెరిచే వీలు కల్పిస్తోంది. వీడియో కేవైసి ఆధారంగా ఈ ఖాతాను తెరవవచ్చు. 

ఫీచర్లు..

  • ఎస్‌బీఐ ఇన్‌స్టా ప్లస్‌ సేవింగ్స్‌ బ్యాంకు ఖాతాను వీడీయో కేవైసీ ద్వారా తెరవొచ్చు. బ్యాంకును సందర్శించాల్సిన అవసరం లేదు. 
  • ఆధార్‌, పాన్‌(ఫిజికల్‌) కార్డులు అవసరమవుతాయి. 
  • కస్టమర్లు ఎస్‌బీఐ యోనో యాప్‌ ద్వారా గానీ, ఆన్‌లైన్‌(ఇంటర్‌ నెట్‌ బ్యాంకింగ్‌) ద్వారా గానీ నెఫ్ట్‌, ఐఎంపీఎస్‌, యూపీఐ, ఇతర పద్ధతుల ద్వారా గానీ నిధులను బదిలీ చేయవచ్చు.
  • ఈ పొదుపు ఖాతాకు ఎస్‌బీఐ క్లాసికల్‌ రూపే కార్డును జారీ చేస్తుంది. 
  • యోనో యాప్‌, ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ సేవలు వారంలో 7 రోజులు, 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. 
  • ఎస్‌ఎంఎస్‌ అలర్టులు, ఎస్‌బీఐ క్విక్‌ మిస్డ్‌ కాల్స్‌ రెండూ అందుబాటులో ఉంటాయి. 
  • నామినేషన్‌ సదుపాయం అందుబాటులో ఉంటుంది. 
  • వీడియో కేవైసీ ప్రాసెస్‌లో కస్టమర్‌ సంతకం క్యాప్చర్‌ చేస్తారు. 
  • ఖాతా విజయవంతంగా తెరిచిన తర్వాత యోనో/ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌/బ్రాంచీ ద్వారా చెక్‌బుక్‌ కోసం దరఖాస్తు చేసుకోవొచ్చు. 
  • ఖాతాదారులు కోరితే పాస్‌బుక్‌ను కూడా జారీ చేస్తారు. 
  • రెగ్యులర్‌ సేవింగ్స్‌ బ్యాంకు ఖాతాలకు వర్తించే సేవా ఛార్జీలు ఈ ఖాతాకు వర్తిస్తాయి. 
  • 18 ఏళ్లు పైబడిన వారు ఈ ఖాతాను తెరవొచ్చు. ఈ ఖాతా తెరిచేవారు బ్యాంకుకు కొత్త కస్టమర్‌ అయ్యి ఉండాలి. 

ఎస్‌బీఐ ఇన్‌స్టా పొదుపు ఖాతాను తెరిచే విధానం..

  • ముందుగా ఎస్‌బీఐ ‘యోనో యాప్‌’ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. 
  • ఇప్పుడు ‘న్యూ టు ఎస్‌బీఐ’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
  • ఇక్కడ పొదుపు ఖాతాపై క్లిక్‌ చేసి ‘విత్‌ అవుట్‌ బ్రాంచ్‌ విజిట్‌’ ఆప్షన్‌ ఎంపిక చేసుకొని, ఇన్‌స్టా ప్లస్‌ సేవింగ్స్‌ అక్కౌంట్‌పై క్లిక్‌ చేయాలి. 
  • ఆ తర్వాత పాన్‌, ఆధార్‌ కార్డుల వివరాలను ఎంటర్‌ చేయాలి. 
  • మీ ఆధార్‌ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబరుకు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్‌ చేయాలి. 
  • సంబంధిత ఇతర సమాచారాన్ని ఇచ్చి, వీడియో కాల్‌ చేయవలసిన సమయాన్ని ఎంపిక చేసుకోవాలి. 
  • వీడియో కాల్‌ సమయానికి యోనో యాప్‌కు లాగిన్‌ అయ్యి, వీడియో కేవైసీ పూర్తి చేయాలి.  
  • బ్యాంకు అధికారులు ధ్రువీకరించిన తర్వాత మీ ఇన్‌స్టా ప్లస్‌ ఖాతా అందుబాటులోకి వస్తుంది.          

గుర్తుంచుకోండి..

వీడియో కేవైసి కోసం పాన్‌, ఆధార్‌ ఒరిజినల్‌ కార్డులను దగ్గర పెట్టుకోవాలి. ఆధార్‌లో ఖాతాదారుని ప్రస్తుత చిరునామా ఉండాలి. మీ మొబైల్‌ నంబరు ఆధార్‌తో అనుసంధానించి ఉండాలి. ఓటీపీ, ఆధార్‌ అనుసంధానిత మొబైల్‌ నంబరుకు మాత్రమే వస్తుంది. కాబట్టి, ఈ వివరాలను ముందుగానే అప్‌డేట్‌ చేసుకోవాలి. అలాగే, ఖాతా తెరిచే ప్రక్రియ పూర్తి అయ్యేంత వరకు ఖాతాదారుడు భారత దేశంలోనే ఉండాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని