Updated : 25 Jan 2022 12:55 IST

SSY: సుక‌న్య స‌మృద్ధి యోజ‌న ఖాతా తెరిచే విధానం


సుక‌న్య సృమృద్ధి యోజ‌న‌ ప్ర‌భుత్వ మ‌ద్ద‌తు ఉన్న చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కం. ఆడ‌పిల్ల‌ల భ‌విష్యత్తు కోసం పెట్టుబ‌డి చేయాల‌నుకునే త‌ల్లిదండ్రుల‌కు ఈ ప‌థ‌కం మంచి ఎంపిక‌.  10 ఏళ్ల లోపు బాలిక‌ల కోసం 2014లో ప్ర‌భుత్వం ఈ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. పోస్టాఫీసులో గానీ, అథీకృత వాణిజ్య బ్యాంకులో గానీ మీ చిన్నారి పేరుతో ఈ ఖాతాను తెర‌వ‌చ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనూ ఎస్ఎస్‌వై ఖాతాను తెర‌వ‌చ్చు. ఎలా తెర‌వాలో తెలుసుకుందాం.

ఎస్‌బీఐలో సుక‌న్య స‌మృద్ధి యోజ‌న ఖాతా తెరిచే విధానం..
కావాల్సిన ప‌త్రాలు..
*
ఎస్.ఎస్.వై ఖాతా తెరిచేందుకు ద‌ర‌ఖాస్తు.. ఇది బ్యాంకులో ఇస్తారు.
* మీ పాప జ‌న్మ న‌మోదు ప‌త్రం (బర్త్ స‌ర్టిఫికేట్‌)
* పాప త‌ల్లిదండ్రులు లేదా గార్డియ‌న్ చిరునామా తెలియ‌జేసే రుజువు
* పాప త‌ల్లిదండ్రులు లేదా గార్డియ‌న్ గుర్తింపు ప‌త్రం
* పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు
ముందుగా ఎస్ఎస్‌వైకి సంబంధించిన ద‌ర‌ఖాస్తు ఫారంను పూర్తి చేసి, పైన తెలిపిన ప‌త్రాలు, ఫోటోల‌ను ఇచ్చిన అవ‌స‌ర‌మైన పేమెంట్ చేసి ఖాతాను తెర‌వ‌చ్చు. ఖాతా తెరిచేందుకు క‌నీస డిపాజిట్ రూ. 250.

డిపాజిట్ ప‌రిమితి..
ఈ ప‌థ‌కంలో గ‌రిష్టంగా ఏడాదికి రూ. 1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు డిపాజిట్ చేయ‌వ‌చ్చు. ఒకేసారి పెట్టుబ‌డి పెట్టాల్సిన అవ‌స‌రం లేదు. నెల‌నెలా కొంత మొత్తాన్ని జ‌మ చేయ‌వ‌చ్చు. ఏడాదికి క‌నీసం రూ. 250 పెట్టుబ‌డి పెట్టాల్సి ఉంటుంది. రూ. 50 గుణిజాల‌లో న‌గ‌దు ద్వారా గానీ, చెక్ ద్వారా గానీ నేరుగా బ్యాంకుకి వెళ్లి డిపాజిట్లు చేయ‌వ‌చ్చు. అలాగే నెట్/మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కూడా చెల్లింపులు చేయ‌వ‌చ్చు. 

వ‌డ్డీ రేటు..
ప్ర‌స్తుత త్రైమాసికానికి 7.60 శాతం వ‌డ్డీ రేటు వ‌ర్తిస్తుంది. వ‌డ్డీరేట్ల‌ను ప్ర‌భుత్వం త్రైమాసికంగా స‌మీక్షిస్తుంది. వ‌డ్డీని వార్షికంగా కాంపౌండ్ చేస్తారు. 

ప‌న్ను ప్ర‌యోజ‌నాలు..
ఈ ప‌థ‌కంలో పెట్టుబ‌డి పెట్టిన మొత్తంపై సెక్ష‌న్ 80సి కింద ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది. ఈ ప‌థ‌కంలో ఆర్జించిన వ‌డ్డీ మొత్తం, విత్‌డ్రాల‌పై కూడా ప‌న్ను వ‌ర్తించ‌దు. 

ఇత‌ర ఫీచ‌ర్లు..
* త‌ల్లిదండ్రులు త‌మ ఇద్ద‌రు ఆడ‌పిల్ల‌ల పేర్ల‌పై ఈ ఖాతాను తెర‌వ‌చ్చు. ఒక‌వేళ మొద‌టిసారి ఆడ‌పిల్ల జ‌న్మించి రెండో సారి ఇద్ద‌రు క‌వ‌ల‌లు (ఆడ‌పిల్ల‌లు) జ‌న్మిస్తే ముగ్గురి పేరుపైనా ఈ ఖాతాను తెర‌వ‌చ్చు. 
* సుక‌న్య స‌మృద్ధి ఖాతా మెచ్యూరిటీ గ‌డువు 21 సంవ‌త్స‌రాలు. ఉదాహ‌ర‌ణ‌కు 8 సంవ‌త్స‌రాల వ‌య‌సులో ఖాతా ప్రారంభిస్తే, అమ్మాయికి 29 సంవ‌త్స‌రాల వ‌య‌సు వ‌చ్చిన‌ప్పుడు మెచ్యూరిటీ పూర్తవుతుంది.
* 15 సంవ‌త్స‌రాల పాటు పెట్టుబ‌డులు చేయాల్సి ఉంటుంది. 
* సుక‌న్య స‌మృద్ధి ఖాతా నుంచి అమ్మాయికి 18 సంవ‌త్స‌రాల వ‌య‌సు వ‌చ్చిన త‌ర్వాత డ‌బ్బు తీసుకునే వీలుంది.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని