Education: విదేశీ విద్యకు ఎలా ప్లాన్ చేసుకోవాలి?
విదేశీ విద్య పట్ల నానాటికి పెరుగుతున్న కోరికతో.. విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రత్యేక ఆసక్తితో ఉంటున్నారు. ప్రస్తుతం విద్యార్థులు, విద్యా సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలపై బాగా అవగాహన ఉన్న రుణ సంస్థలు దేశానికి ఎంతో అవసరం.
ఇంటర్నెట్ డెస్క్: ఇప్పుడు చాలా మంది విద్యార్థులు భారత్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఉన్నత విద్యకు విదేశాలకు వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రతిష్ఠాత్మక విదేశీ విశ్వవిద్యాలయంలో చదువుకోవడం అనేది భారతీయ విద్యార్థుల ఆకాంక్షల్లో ఒకటి. ప్రతి సంవత్సరం 8 లక్షలకు పైగా భారతీయ విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళుతున్నారు. దీనికై దేశ జీడీపీలో దాదాపు 1 శాతం.. 28 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నారు. అయితే, విదేశాల్లో చదువుకోవాలనే ఆశయానికి ముందస్తు సన్నద్ధత కూడా చాలా అవసరం. చివరి నిమిషంలో అవాంతరాలు, మోసం బారిన పడకుండా ఉండడానికి నిధులను కూడా ముందుగానే ఏర్పాటుకోవడం చాలా అవసరం.
అడ్మిషన్ సీజన్
అడ్మిషన్ల గడువు కాలాన్ని సరిగ్గా ఎంచుకోవాలి. ప్రతి దేశంలో విద్యార్థులకు నూతన అడ్మిషన్ల కోసం ఒక సీజన్ ఉంటుంది. అవి సెప్టెంబరు, జనవరి, వేసవిలో మూడు ప్రధాన కాలాలుగా విభజించి ఉంటాయి. ఇందులో సెప్టెంబరు నెల అత్యంత ప్రాచుర్యం పొందిన నెలగా చాలా మంది పరిగణనలోకి తీసుకుంటారు. ప్రవేశానికి దరఖాస్తు గడువు విషయంలో తేదీల కోసం తగిన జాగ్రత్తలతో వేచి చూడాలి.
మందస్తు ప్రణాళిక
విదేశాల్లో మీ అధ్యయనానికి ముందస్తు ఫైనాన్సింగ్ ప్లాన్ చాలా కీలకమైంది. ముందుగా మీకు ఆసక్తి, అవసరం ఉన్న ప్రాంతాన్ని గుర్తించాలి. ఏ దేశానికి చెందిన విశ్వవిద్యాలయం మీ విద్యకు సరైందో, ప్రవేశం సులభతరమో తెలుసుకోవాలి. ఆ దేశంలోనే కాకుండా ఆయా విద్యాలయాల పరిధిలో సగటు జీవన వ్యయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. అంతర్జాతీయ విద్య విషయాలు పెట్టుబడులతో కూడుకున్నవి. కాబట్టి, ఈ వ్యయ పరిమాణాన్ని లెక్కించేటప్పుడు పరిగణించవలసిన అనేక అంశాలు ఉన్నాయి. బడ్జెట్ వేసేటప్పుడు ఇలాంటివి చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
విదేశీ విద్యకు ఫీజులు పెరిగాయా?
అమెరికానే ఉదాహరణగా తీసుకుంటే ఉన్న ఒక్కో యూనివర్సిటీలో ఫీజులు ఒక్కోవిధంగా ఉంటాయి. అక్కడ ట్యూషన్ ఫీజు, జీవన వ్యయానికి అయ్యే ఖర్చులు ఎక్కువ భాగాన్ని ఆక్రమిస్తాయి. రూపాయి పతనమైన కొలదీ.. ఫీజులు భారం పెరుగుతుంది. జీవన ఖర్చులు కూడా ఎక్కువవుతాయి. అమెరికాలో సగటు యూనివర్సిటీలో 2010-11లో 4 ఏళ్ల డిగ్రీ కోర్సు సగటు ఫీజు 32,000 డాలర్లు (అప్పటి భారత కరెన్సీలో రూ.14.40 లక్షలు) కావల్సివస్తే. ఇదే డిగ్రీ కోర్సుకు 2022-23లో 43,000 డాలర్లు (ఇప్పటి భారత కరెన్సీలో దాదాపు రూ.35 లక్షలు) అవసరం పడుతుంది. భారత రూపాయి విలువ క్షీణించడంతో పాటు అమెరికాలో మొత్తం విద్యా వ్యయంలో సాధారణ వార్షిక పెరుగుదల దాదాపు 10% గా ఉంది. అక్కడ ద్రవ్యోల్బణం పెరగడంతో జీవన వ్యయం బాగా పెరిగింది. దీని మూలంగా అక్కడికి వెళ్లిన విద్యార్థులు అదనంగా డాలర్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.
స్కాలర్‌షిప్స్
ఆయా ప్రాంతాల విశ్వవిద్యాలయాల ప్రాధాన్యం ఆధారంగా డబ్బును తగినంత ఏర్పాటు చేసుకోవాలి. మీరు దరఖాస్తు చేసుకునే విశ్వవిద్యాలయంలో స్కాలర్‌షిప్‌లు, ప్రైవేటు గ్రాంట్లు, యూనివర్సిటీ గ్రాంట్ల కోసం సకాలంలో దరఖాస్తు చేసుకుంటే మీరు ఆర్థిక భారాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. సాధారణంగా ఈ నిబంధనలు అవసరం లేదా యోగ్యతపై ఆధారపడి ఉంటాయి. అనేక విద్యాసంస్థలు విద్యార్థులకు వారి అధ్యయనాలను కొనసాగించడంలో సహాయపడడానికి పాక్షిక స్కాలర్‌షిప్‌లను కూడా అందిస్తాయి. మీరు ఇష్టపడే కళాశాలకు దరఖాస్తు చేసుకునే ముందు తగిన స్కాలర్‌షిప్ కోసం ప్రయత్నించాలి. ఆ విధంగా మీ విద్యా రుణం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. టాటా ఫౌండేషన్, అగాఖాన్ ఫౌండేషన్ వంటి సంస్థలు గ్రాంట్లు, జీరో శాతానికి రుణ పథకాలను అమలు చేస్తాయి. ఇంకా, అనేక దేశాల ప్రభుత్వాలు ఎక్కువ మంది అంతర్జాతీయ విద్యార్థులను ఆకర్షించడానికి స్కాలర్‌షిప్‌లు, అవార్డులను ఇస్తాయి.
ఆర్థిక ఆసరా
ప్రతి దేశం విదేశీ విద్యార్థులను పార్ట్-టైమ్ పని చేయడానికి వీలు కల్పిస్తుంది. కాబట్టి, ప్రతి విద్యార్థీ ఆర్థిక భద్రత గురించి ఆలోచించడం ఎల్లప్పుడూ మంచిది. ఆర్థిక ఆసరా కోసం పార్ట్ టైమ్ పనికోసం దరఖాస్తు చేసుకోవచ్చు. చాలా దేశాలు వారానికి 20 గంటలు పనిచేసుకోవడానికి అవకాశాలు ఇస్తున్నాయి. పార్ట్-టైమ్ కెరీర్ అవకాశాలకు సంబంధించిన సమాచారాన్ని విశ్వవిద్యాలయాలు తరచుగా ప్రచారం కూడా చేస్తాయి. వీటిని ఉపయోగిచుకుంటే మంచిది.
విద్యా రుణాన్ని ఎంచుకోవడం
సాధారణంగా విదేశీ విద్యా రుణాలు అధిక మొత్తంతో కూడుకున్నవి. కాబట్టి పూచీకత్తుతోనే ఉంటాయి. ఇవి ప్రభుత్వ ఆర్థిక సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, కొత్త ఎడ్‌టెక్ రుణసంస్థల నుంచి విద్యా రుణాలు అందుబాటులో ఉంటున్నాయి. వడ్డీ రేట్లు ఎంచుకునేటప్పుడు కూడా జాగ్రత్త వహించాలి. వడ్డీ రేట్లలో స్థిర వడ్డీ రేట్లు. ఫ్లోటింగ్ వడ్డీ రేట్లు రెండూ ఉంటాయి. స్థిర వడ్డీ రేట్లు ఎంచుకుంటే రుణ కాలపరిమితి మొత్తం ఒకేలా వడ్డీ రేటు ఉంటుంది. కానీ ఫ్లోటింగ్ వడ్డీ రేట్లు కాలక్రమంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. కాబట్టి మీరు రుణం తీసుకున్నప్పుడు ఉన్న పరిస్థితుల బట్టి అనుకూలంగా ఉండే వడ్డీ రేట్లు ఎంచుకోవాలి. ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులే కాకుండా విద్యా రుణం ఇవ్వడానికి ఇతర రుణ సంస్థలు కూడా ఉన్నాయి. కుహూ ఎడ్‌ఫిన్‌టెక్, లీప్ ఫైనాన్స్, ఇన్‌క్రెడ్, ప్రాడిజీ వంటి రుణ సంస్థలు విదేశాలలో చదువుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులకు విద్యా రుణం అందచేయడానికి ముందుకు వస్తున్నాయి. కుహూ ఎడ్‌ఫిన్‌టెక్ అయితే గ్యారంటీలు, తనఖాలు లేకుండా, తల్లిదండ్రుల ప్రమేయం కూడా లేకుండా విద్యా రుణాలను అందిస్తుంది. ముఖ్యంగా ఫిన్‌టెక్ సొల్యూషన్‌ల కారణంగా విద్యార్థులు కొన్ని సేవలను పొందుతున్నారు.
చివరిగా: ఆధునిక ఫిన్‌టెక్ సొల్యూషన్లు, ఇంటిగ్రేటెడ్ ప్లాట్‌ఫామ్స్ అంతర్జాతీయ విద్యకు సంబంధించిన ఎండ్-టు-ఎండ్ ప్రక్రియలను డిజిటల్‌గా అందిస్తున్నాయి. ఈ సేవలు విద్యార్థులకు తగిన ఆర్థిక ఎంపికలను అందించడమే కాకుండా వారి అవకాశాలను వేగవంతం చేస్తాయి. విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు అనేక ప్రక్రియల్లో ఇవి ఎంతగానో సహాయపడుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Rupert Murdoch: ‘ఫాక్స్’ ఛైర్మన్ బాధ్యతల నుంచి వైదొలిగిన రూపర్ట్ మర్దోక్
-
Stomach Pain: కడుపు నొప్పితో ఆస్పత్రికి.. ‘ఎక్స్-రే’ చూస్తే షాక్!
-
World Cup: ఆ ఇద్దరూ ఉండటం వల్లే సంజూ శాంసన్‌ను ఎంపిక చేయలేదు: హర్భజన్ సింగ్
-
TDP: వైకాపా దౌర్జన్యాలను ఎలా ఎదుర్కొందాం? టీడీఎల్పీలో చర్చ
-
Flipkart: మరోసారి బిగ్ బిలియన్ డేస్ సేల్.. వాటిపై భారీ డిస్కౌంట్!
-
LEO Movie: పోస్టర్లతోనే ‘లియో’ కథను హింట్ ఇచ్చారా? ఆ జాబితాలోనూ నెం.1