ప‌ద‌వీ విర‌మ‌ణ అనంత‌ర ప్ర‌ణాళిక‌కు ఎలా సిద్ద‌మ‌వ్వాలి ?

మీరు ప‌ద‌వీ విర‌మ‌ణ‌కు దాదాపు 3 సంవ‌త్స‌రాల ముందు సుర‌క్షిత‌మైన స్థిర‌-ఆదాయ పెట్టుబ‌డుల‌కు మారాలి.

Published : 21 Jun 2022 15:43 IST

ఉద్యోగంలో ఉన్న‌ప్పుడు జీతం ఉంటుంది, ఆఫీస్‌లో ఇచ్చే ఆరోగ్య బీమా పాల‌సీ కూడా ఉంటుంది. ఆరోగ్యం కూడా అప్ప‌టి వ‌ర‌కు చాలా వ‌ర‌కు స‌హ‌క‌రిస్తుంది. కానీ ప‌ద‌వీ విర‌మ‌ణ అయిన త‌ర్వాత మిగిలిన జీవితాన్ని కొన‌సాగించ‌డానికి అయ్యే ఖ‌ర్చులు, ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌డానికి అయ్యే ఖ‌ర్చులు ఒక స‌వాలుగా ప‌రిణ‌మిస్తాయి. అస‌లు వ్య‌క్తులు జీవ‌న క్రీడ‌లో అస‌లైన‌, సంక్లిష్ట ప‌రిస్థితులు చూడ‌టం మొద‌ల‌య్యేది ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాతే. దీనికి ముందుగానే సిద్ధం అవ్వాలి, ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత కూడా ఆర్ధిక ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుని, కొన‌సాగిస్తూ ఉండాలి.

మీరు ప‌ద‌వీ విర‌మ‌ణ‌కు ద‌గ్గ‌ర్ల‌లో ఉన్న‌ప్పుడు  మీ ప‌ద‌వీ విర‌మ‌ణ‌ను ఎలా ప్ర‌ణాళిక‌గా చేసుకోవాలో ఇక్క‌డ ఉంది. మీరు మీ ప‌ద‌వీ విర‌మ‌ణ ల‌క్ష్యాల‌ను నిర్దేశించుకుని, అక్క‌డికి చేరుకోవ‌డానికి మీ స‌మ‌యాన్ని అంచ‌నా వేయ‌డం ద్వారా మీ ప‌ద‌వీ విర‌మ‌ణ ప్ర‌ణాళిక‌ను త‌ప్ప‌నిస‌రిగా ప్రారంభించాలి. ఉద్యోగ విర‌మ‌ణ త‌ర్వాత ఆర్ధిక అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల కోసం ఆర్ధిక ప‌రిపుష్టిని నిర్మించ‌డంలో ఇది మీకు స‌హాయ‌ప‌డుతుంది. ప‌ద‌వీ విర‌మ‌ణ ప్ర‌ణాళిక అనేది జీవిత ద‌శ‌ల ప్ర‌కారం అభివృద్ది చెందే ప్ర‌క్రియ‌. స‌రైన ఆర్ధిక ప్ర‌ణాళిక లేక‌పోతే.. వ‌య‌స్సు పెర‌గ‌డం కార‌ణం చేత‌, అనారోగ్యాల‌కి ఆసుప‌త్రుల‌కు ఖ‌ర్చుల‌ను వినియోగించే కొద్దీ ప‌ద‌వీ విర‌మ‌ణ నిధి త‌రిగిపోతుంది.

ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత అయ్యే ఖ‌ర్చుల‌ను ముందుగానే అంచ‌నా వేయాలి. పెట్టే పెట్టుబ‌డుల‌ను వ‌య‌స్సును బ‌ట్టీ మార్పులు, చేర్పులు చేస్తుండాలి. అంతేకాకుండా పెట్టుబ‌డులకు వ‌చ్చే రాబ‌డి ఆదాయ‌ ప‌న్నుతో కూడిన‌దా, ప‌న్ను ర‌హితమైన‌దా అని ముందుగానే త‌నిఖీ చేసుకొని ఒక అంచ‌నాకు రావాలి. ఉదాహ‌ర‌ణ‌కు మీరు ప‌ద‌వీ విర‌మ‌ణ కోసం ఈక్విటీ ఫండ్‌లు, స్టాక్‌లు మొద‌లైన వాటిలో పెట్టుబ‌డి పెట్టి గ‌ణ‌నీయ‌మైన నిధిని సంపాదించ‌వ‌చ్చు కానీ వీటికి ఆదాయ ప‌న్ను లింక్ ఉంటుంది స‌రిచూసుకోవాలి. మీరు పెట్టిన పెట్టుబ‌డుల‌కు ప‌న్ను అనంత‌ర రాబ‌డికి, ఉద్యోగ విర‌మ‌ణ అనంత‌రం పెట్టే ఖ‌ర్చుల‌కు బేల‌న్స్ స‌రిపోతుందా లేదా అని గ‌మ‌నించాలి. మీరు ఖ‌ర్చుల‌ను త‌క్కువ‌గా అంచ‌నా వేస్తే, మీరు మీ పోర్ట్‌ఫోలియోను మించిపోతారు. అధిక ఖ‌ర్చులు ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత మీ జీవ‌న నాణ్య‌త‌ను ప్ర‌భావితం చేస్తాయి.

మీ పెట్టుబ‌డుల‌ను మీ వ‌య‌స్సుని బ‌ట్టి మారుస్తూ ఉండాలి. మీరు సృష్టించిన సంప‌ద‌ను ఈక్విటీ నుండి డెట్ ఫండ్‌ల‌కు బ‌దిలీ చేయాలి. ఈక్విటీ పెట్టుబ‌డులు చాలా అస్థిరంగా ఉంటాయి. మీరు ప‌ద‌వీ విర‌మ‌ణ‌కు దాదాపు 3 సంవ‌త్స‌రాల ముందు సుర‌క్షిత‌మైన స్థిర‌-ఆదాయ పెట్టుబ‌డుల‌కు మారాలి. ఇది ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత ఆదాయం యొక్క సాధార‌ణ ప్ర‌వాహాన్ని నిర్ధారిస్తుంది.

మీరు ప‌ద‌వీ విర‌మ‌ణ పొందిన త‌ర్వాత.. జీవిత బీమా సంస్థకు చెందిన త‌క్ష‌ణ యాన్యుటీ ప్లాన్‌లో పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. మీరు ఒకేసారి ప్రీమియం చెల్లించాలి. జీవిత బీమా సంస్థ యాన్యుటి చెల్లింపును వెంట‌నే చేస్తుంది. జీవిత బీమా సంస్థ‌లు మీకు యాన్యుటీ చెల్లింపు ర‌కాన్ని ఎంచుకునే ఎంపిక‌ను అందిస్తాయి. ఆర్ధిక అవ‌స‌రాల ఆధారంగా మీరు త‌ప్ప‌నిస‌రిగా యాన్యుటీ ప్లాన్‌ని ఎంచుకోవాలి. ఉదా:  స్థిర యాన్యుటీ చెల్లింపు ప్ర‌తి నెలా నిర్దిష్ట హామీ మొత్తాన్ని అందిస్తుంది. మీరు జీవించి ఉన్నంత కాలం యాన్యుటీ చెల్లింపులు కొన‌సాగుతాయి. మీరు త‌ట్టుకునే రిస్క్‌ని బ‌ట్టీ అనేక ర‌కాల చెల్లింపు ఎంపిక‌ల‌ను ఎంచుకోవ‌చ్చు. ఇక్క‌డ యాన్యుటీ చెల్లింపులు స్టాక్ మార్కెట్ రాబ‌డికి లింక్ చేయ‌బ‌డ‌తాయి. అయిన‌ప్ప‌టికీ, యాన్యుటీ ప్లాన్‌లు చాలా వ‌ర‌కు స్థిర‌-ఆదాయ పెట్టుబ‌డుల కంటే కూడా త‌క్కువ రాబ‌డిని అందిస్తాయి. అంతేకాకుండా యాన్యుటీ చెల్లింపుల‌పై ఆదాయ ప‌న్ను విధించ‌బ‌డుతుంది. ఈ విష‌యాల‌ను త‌ప్ప‌నిస‌రిగా గ‌మ‌నించాలి.

ఆరోగ్య బీమా :  ప‌ద‌వీ విర‌మ‌ణ చెందిన వృద్దులు.. మ‌ధుమేహం, అధిక ర‌క్త‌పోటు మొద‌లైన అనారోగ్య ప‌రిస్థితుల‌కు ఎక్కువ‌గా గుర‌వుతారు. వీటి చికిత్సకు రోజువారీగా ఖ‌ర్చులు ఉండ‌ట‌మే కాకుండా దీర్ఘ‌కాలికమైన అనేక రోగాలు వీటి వ‌ల‌నే ఇబ్బంది పెడుతుంటాయి. వ్య‌క్తులు ప‌ద‌వీ విర‌మ‌ణ‌కు ద‌గ్గ‌ర‌గా ఉన్న స‌మ‌యంలోనే త‌ప్ప‌నిస‌రిగా సీనియ‌ర్ సిటిజ‌న్ ఆరోగ్య బీమా పాల‌సీని పొందాలి. వీరికి అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌ప్ప‌టికీ సీనియ‌ర్ సిటిజ‌న్ ఆరోగ్య బీమా పాల‌సీని పొంద‌వ‌చ్చు. ఉదా :  చాలా సీనియ‌ర్ సిటిజ‌న్ ఆరోగ్య బీమా పాల‌సీలు ముందుగా ఉన్న వ్యాధుల కోసం 2-4 సంవ‌త్స‌రాల నిరీక్ష‌ణ వ్య‌వ‌ధిని క‌లిగి ఉంటాయి. ఇది నిరీక్ష‌ణ కాలం త‌ర్వాత అనారోగ్య ప‌రిస్థితుల‌ను క‌వ‌ర్ చేస్తుంది. ఈ నిరీక్ష‌ణ బీమా పాల‌సీ ప్ర‌యోజ‌నాలు కొద్దిగా ఆల‌స్య‌మ‌యినా కూడా అప్ప‌టినుండి ఉప‌శ‌మ‌నం ఉంటుంది.

అనేక సీనియ‌ర్ సిటిజ‌న్ ఆరోగ్య బీమా పాల‌సీలు అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వ్య‌క్తుల కోసం ఒక చెల్లింపు నిబంధ‌న‌ను క‌లిగి ఉంటాయి. మీరు క్లెయిమ్ చేసిన‌ప్పుడ‌ల్లా వైద్య చికిత్స ఖ‌ర్చుల‌లో కొంత భాగాన్ని మీరు భ‌రించాలి. అయితే, మీరు దీర్ఘ‌కాలిక వ్యాధుల‌తో బాధ‌ప‌డుతుంటే త‌ప్ప‌నిస‌రిగా కో-పేమెంట్‌ను ఎంచుకోవాలి. ఆసుప‌త్రి ఖ‌ర్చుల‌లో కొంత ఖ‌ర్చుని పాల‌సీదారుడు చెల్లించాలి. మీరు సీనియ‌ర్ సిటిజ‌న్స్ ఆరోగ్య బీమా పాల‌సీకి సంబంధించిన ముఖ్యాంశాల‌ను త‌ప్ప‌క ప‌రిశీలించాలి. ఉదా: ఆసుప‌త్రిలో చేరే ముందు, త‌ర్వాత ఖ‌ర్చులు, డే కేర్ చికిత్స‌లు, పాల‌సీ జీవిత‌కాల పున‌రుద్ద‌ర‌ణ ఎంపిక‌ల‌ను బీమా క‌వ‌ర్ చేస్తుందా, లేదా అని చూడాలి. డే కేర్ చికిత్స‌లో 24 గంట‌ల కంటే త‌క్కువ ఆసుప‌త్రిలో ఉండే వైద్య విధానాలు అమ‌లులో ఉన్నాయా, లేదా అని చూడాలి. అంతేకాకుండా చాలా మంది వృద్దులు న‌గదు ర‌హిత ఆరోగ్య బీమాను ఎంచుకుంటారు. ఇక్క‌డ ఆసుప‌త్రి ఖ‌ర్చులు.. బీమా సంస్థ /  నెట్‌వ‌ర్క్ ఆసుప‌త్రి మ‌ధ్య ప‌రిష్కార‌ముంటుంది.

చివ‌ర‌గా : ప‌ద‌వీ విర‌మ‌ణ‌కు ద‌గ్గ‌ర‌గా ఉన్న‌ప్పుడు మీ డ‌బ్బుతో అన‌వ‌స‌ర‌మైన ప్ర‌యోగాలు చేయ‌కూడ‌దు, అంటే.. రిస్క్ తీసుకోకూడ‌దు. త‌ప్పుడు పెట్టుబ‌డి నిర్ణ‌యం ప‌ద‌వీ విర‌మ‌ణ ప్ర‌ణాళిక‌ల‌ను ప్ర‌భావితం చేస్తుంది. మీరు మీ నిధిలో కొంత భాగాన్ని ఈక్విటీ లేదా హైబ్రిడ్ ఫండ్‌ల‌కు కేటాయించ‌వ‌చ్చు. ఇది కాల‌క్ర‌మేణా ద్ర‌వ్యోల్బ‌ణాన్ని అధిగ‌మించే రాబ‌డిని అందిస్తుంది కాబ‌ట్టి ఇది మీ ఆదాయాన్ని పెంచుతుంది. ప‌ద‌వీ విర‌మ‌ణ‌కు ముందు అన్ని రుణ బ‌కాయిల‌ను తీర్చేయండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని