Property Documents: ఆస్తి దస్తావేజులు పోగొట్టుకున్నారా? ఇలా చేయండి..
రిజిస్టర్డ్ ఆస్తులకు సంబంధించిన వివరాలను రిజిస్ట్రేషన్ కార్యాలయం వారు తమ రికార్డుల్లో భద్రపరుస్తారు. అక్కడి నుంచి డూప్లికేట్ కాపీని పొందవచ్చు. అదెలాగో చూద్దాం..
ఇంటర్నెట్ డెస్క్: ఇల్లు, స్థలం, వ్యవసాయ భూమి.. ఇలా ఏ స్థిరాస్తి కొనుగోలు చేసినా ఆస్తి యాజమాన్య హక్కులను కొనుగోలుదారునికి బదిలీ చేయడంలో టైటిల్ డీడ్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఆస్తి కొనుగోలు చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అంటే, ప్రభుత్వ రికార్డులో ఆస్తి కొనుగోలుదారుని పేరిట అధికారికంగా బదిలీ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఆస్తి కొనుగోలుదారుని పేరుతో నమోదైనట్లు పత్రాలు చేతికి వస్తాయి.
టైటిల్ డీడ్ అంటే?
టైటిల్ డీడ్ అంటే.. యాజమాన్య పత్రం. ఏదైనా ఆస్తికి సంబంధించి చట్టపరమైన హక్కును తెలియజేస్తుంది. ఆస్తిని అమ్మాలన్నా, తాకట్టు పెట్టి రుణం పొందాలన్నా, ఆ ఆస్తి తమ పేరుపై ఉన్నదని రుజువు చేయాలన్నా.. ఈ డాక్యుమెంట్ అవసరం. అమ్మకం లేదా రుణం పొందే వేళల్లో ఆస్తికి సంబంధించిన ఒరిజినల్ పత్రాలను ఇవ్వాల్సి ఉంటుంది.
ఒరిజినల్ డాక్యుమెంట్స్ పోతే..
ఆస్తికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లు లేకపోతే ఆస్తికి సంబంధించిన లావాదేవీల (అమ్మకం, రుణం వంటివి) విషయంలో అడ్డంకులు ఎదురవుతాయి. అలాగే స్థలం, వ్యవసాయ భూమి విషయంలో కొన్ని సార్లు వివాదాలు ఏర్పడతాయి. పక్కన స్థలంవారు మీ భూమిలో కొంత భాగాన్ని ఆక్రమించే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీ వద్ద ఆస్తి పత్రాలు లేకపోతే ఆ భూమి మీద మీకు హక్కును నిరూపించుకోవడం కష్టం అవుతుంది. కాబట్టి, ఆస్తికి సంబంధించిన పత్రాలు జాగ్రత్తగా భద్రపరచాలి. ఒకవేళ మీ ఆస్తికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లు పోతే డూప్లికేట్ కాపీ పొందవచ్చు. రిజిస్టర్డ్ ఆస్తులకు సంబంధించిన వివరాలను రిజిస్ట్రేషన్ కార్యాలయం వారు తమ రికార్డుల్లో భద్రపరుస్తారు. అక్కడి నుంచి డూప్లికేట్ కాపీ పొందవచ్చు. అయితే దీనికి కొంత ప్రొసీజర్ అనుసరించాల్సి ఉంటుంది.
ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి..
ఆస్తికి సంబంధించిన పత్రాలు పోయినా లేదా దొంగిలించారని తెలిసిన వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ (ఫస్ట్ ఇన్షర్మేషన్ రిపోర్ట్) లేదా ఎన్సీఆర్ (నాన్ కాగ్నిజిబుల్ రిపోర్ట్)ను ఫైల్ చేయాలి. దానికి సంబంధించిన ఒక కాపీని మీ వద్ద భద్రపరుచుకోవాలి. ఇది భవిష్యత్‌లో ఉపయోగపడుతుంది. మీరు పోలీస్ స్టేషన్‌కు నేరుగా లేదా ఆన్లైన్లో కూడా ఫిర్యాదు చేయవచ్చు.
ఎఫ్ఐఆర్ను నమోదు చేసిన తర్వాత మీరు ఇచ్చిన వివరాల ఆధారంగా పోలీసు శాఖ అధికారులు పరిశోధన చేసి పత్రాలను కనుగొనేందకు ప్రయత్నిస్తారు. ఒకవేళ పత్రాలను పోలీసులు ట్రేస్ చేయడంలో విఫలం అయితే నాన్-ట్రేసబుల్ సర్టిఫికేట్ (ఎన్టీసీ)ను జారీచేస్తారు. ఫిర్యాదులకు సంబంధించి పోలీసు అధికారులు ట్రేస్ చేయని వాటికి సంబంధించిన నాన్-ట్రేసబుల్ రికార్డును ప్రతి పోలీసు స్టేషన్లోనూ నిర్వహిస్తారు. ఎన్టీసీ వాస్తవంగా నష్టం జరిగిందని తెలియజేస్తుంది. డూప్లికేట్ ఆస్తి పత్రాలను పొందేందుకు కావాల్సిన కీలక పత్రం ఇది. అలాగే, దుర్వినియోగం లేదా మోసాలను నివారించడంలోనూ సహాయపడుతుంది. ఎఫ్ఐఆర్ను ఆస్తి ఉన్న ప్రదేశంలోని సమీప పోలీస్ స్టేషన్లో నమోదు చేయనవసరం లేదు. ఆస్తి దేశంలో ఎక్కడ ఉన్నా వ్యక్తులు తాము నివసించే ప్రదేశానికి సమీపంలోని పోలీస్ స్టేషన్లో నమోదు చేయవచ్చు.
వార్తా పత్రిక ద్వారా నోటీసు..
ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత.. దీనికి సంబంధించిన నోటీసును కనీసం రెండు వార్తా పత్రికల్లో వచ్చేట్లు చూసుకోవాలి. ఒకటి ఆంగ్లంలో, మరొకటి స్థానిక భాషలో ఉండాలి. ఆస్తికి సంబంధించిన మొత్తం వివరాలు, పోగొట్టుకున్న పత్రాలు, మీ సంప్రదింపు వివరాలతో ప్రకటన ఇవ్వాలి. ఒకవేళ పోయిన పత్రాలు వేరొకరికి దొరికి ఉంటే.. వారు ఆస్తి యజమానికి తిరిగి ఇచ్చే అవకాశం ఉంటుంది.
ఈ నోటీసు ద్వారా యజమాని ఆస్తికి ఉన్న యాజమాన్య హక్కును క్లెయిం చేస్తూ ప్రజలకు సమాచారం ఇవ్వాలి. ఒకవేళ ఆస్తికి సంబంధించి ప్రజల్లో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ప్రచురణ తేదీ నుంచి 15 రోజుల లోపు క్లెయిం చేసేందుకు ఆహ్వానిస్తూ ఈ నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. నోటీసు ఇచ్చేందుకు న్యాయవాది లేఖ, ఈ నోటీసు ఇచ్చేందుకు గల కారణాలను వివరిస్తూ నోటరీ చేసిన అఫిడవిట్లతో పబ్లిషర్‌ను సంప్రదించవచ్చు.
ఈ నోటీసు ఇచ్చేందుకు పత్రికను అనుసరించి ప్రచురణకు రూ.3500 వరకు, న్యాయవాదికి చెల్లించాల్సి చట్టపరమైన రుసుముల కోసం దాదాపు రూ.5000 వరకు ఖర్చు చేయాల్సి రావచ్చు.
షేర్ సర్టిఫికెట్..
హౌసింగ్ సొసైటీలో ఆస్తి ఉంటే రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ (RWA) నుంచి డూప్లికేట్ షేర్ సర్టిఫికెట్‌ను పొందవచ్చు. ఆర్డబ్ల్యూఏ నుంచి డూప్లికేట్ షేర్ సర్టిఫికెట్ పొందేందుకు ఎఫ్ఐఆర్ కాపీని, వార్తాపత్రికలో ముద్రించిన నోటీసు క్లిప్పింగ్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. ఇవి ఇచ్చిన తర్వాత ఆర్డబ్ల్యూఏ సమావేశాన్ని ఏర్పాటు చేసి పత్రాలను పరిశీలించి, సంఘటన నిజమని తేలితే డూప్లికేట్ షేర్ సర్టిఫికెట్ కాపీని జారీ చేస్తారు. అయితే దీని కోసం కొంత రుసుములను ఛార్జ్ చేస్తారు. అలాగే తదుపరి లావాదేవీల కోసం నాన్-అబ్జెక్షన్ సర్టిఫికేట్(ఎన్ఓసీ) అడగొచ్చు.
* హౌసింగ్ సొసైటీలోని ప్రతి సభ్యుడికీ షేర్ సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఇది ఆ వ్యక్తికి సొసైటీలో ఉన్న ఆస్తి షేర్‌ను తెలియజేస్తుంది.
నోటరీ చేయించాలి..
డూప్లికేట్ సర్టిఫికెట్ కాపీ కోసం దరఖాస్తు చేసుకునే ముందు.. రూ.10 నాన్ జుడీషియల్ స్టాంప్ పేపర్‌పై అఫిడవిట్ నోటరీ చేయించాలి. ఇందులో ఎఫ్ఐఆర్ నంబరుతో పాటు, ఆస్తికి సంబంధించిన (పోయిన) పత్రాల వివరాలు, వార్తాపత్రికలలో ప్రచురించిన నోటీసు, ప్రచురణ చెల్లుబాటుకు సంబంధించిన లాయర్ సర్టిఫికెట్, దరఖాస్తు చేయడానికి గల కారణాన్ని పేర్కొనాలి.
డూప్లికేట్ పత్రాలు..
15-రోజుల నోటీసు వ్యవధి ముగిసిన తర్వాత, మీరు తప్పనిసరిగా సంబంధిత సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సందర్శించి, ఆస్తికి సంబంధించిన పూర్తి వివరాలు, పోగొట్టుకున్న పత్రాల వివరాలు, ఎఫ్ఐఆర్ కాపీ, నాన్ ట్రేసబుల్ సర్టిఫికెట్, నోటరీ అఫిడవిట్లను సమర్పించి డూప్లికేట్/సర్టిఫైడ్ కాపీ కోసం దరఖాస్తు చేసుకోవాలి. సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి 7 నుంచి 10 పని దినాల్లో డూప్లికేట్ సేల్ డీడ్ లేదా టైటిల్ డీడ్ కాపీని పొందుతారు.
చివరిగా..
డూప్లికేట్ ఆస్తి పత్రాలు సబ్ రిజిస్ట్రార్ ఆమోదంతో స్టాంపింగ్‌తో పొందుతారు కాబట్టి ఇవి చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయి. ఈ సర్టిఫైడ్ కాపీ ద్వారా ఆస్తి క్రయవిక్రయాలతో పాటు రుణ దరఖాస్తు వంటి లావాదేవీలను కూడా చేయవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్‌లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా
ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది. -
ఉన్నత చదువులకు భరోసానిద్దాం...
పిల్లల చదువుల ఖర్చులు ఏటా 7-10 శాతం పెరుగుతున్నాయి. మరోవైపు క్షీణిస్తున్న రూపాయి విలువ దీనికి అదనం. ఒకప్పటితో పోలిస్తే పిల్లల ఉన్నత చదువుల ప్రణాళిక ఇప్పుడు క్లిష్టంగా మారింది. -
వెండిలో పెట్టుబడి లాభమేనా?
బంగారం, వెండి.. ఈ రెండు లోహాలతో భారతీయులకు విడదీయలేని సంబంధం ఉంది. ఆభరణాలు, వస్తువుల రూపంలో వీటిని కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు -
సరైన బీమా హామీ మొత్తాన్ని ఎలా ఎంచుకోవాలి?
ప్రస్తుత కాలంలో సంపాదించే ప్రతి వ్యక్తికి, ముఖ్యంగా తనపై ఆధారపడిన వారు ఉన్నప్పుడు తగిన జీవిత బీమా మొత్తం ఉండడం ఎంతో అవసరం. ఎంత బీమా ఉంటే కుటుంబ సభ్యులకు సరిపోవచ్చో ఇక్కడ చూడండి. -
ఆరోగ్య బీమా రూల్స్‌లో మార్పులు.. పాలసీదారులకు ప్రయోజనం
IRDAI : ఆరోగ్య బీమా పాలసీల నిబంధనల విషయంలో బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. వీటి ద్వారా బీమా కస్టమర్లకు మరింత ప్రయోజనం చేకూరనుంది. -
మిడ్ క్యాప్ ఫండ్లపై రాబడులు ఎంతెంత?
దేశీయంగా పెట్టుబడులకు వివిధ మ్యూచువల్ ఫండ్ల పథకాలు ఉన్నాయి. ఈ మ్యూచువల్ ఫండ్లలో మంచి ఫలితాలను అందించిన కొన్ని మిడ్ క్యాప్ ఫండ్లను ఇక్కడ చూడొచ్చు. -
కొత్త ఏడాదిలో పన్ను విధానం ఎంచుకుంటున్నారా? ఇవి తెలుసుకున్నాకే..!
Income tax: కొత్త ఆర్థిక సంవత్సరంలో వేతన జీవులు పన్ను విధానం యాజమాన్యానికి తెలియజేయాలి. టీడీఎస్ కోసం మీకు నప్పే పన్ను విధానం ఎంచుకోవడం మంచిది. -
పదవీ విరమణ తర్వాత రూ.1 కోటి నిధి సరిపోతుందా?
చాలా మంది పదవీ విరమణ నిధికి రూ.1 కోటి సరిపోతుందని అనుకుంటారు. ఎలాంటి విషయాలు పదవీ విరమణ నిధిని, రాబడిని ప్రభావితం చేస్తాయి. రూ.1 కోటి నిధి సరిపోతుందా? లేదా? ఇక్కడ తెలుసుకోండి.. -
జీవిత బీమా.. అనుబంధ పాలసీలు తీసుకున్నారా?
ఊహించని పరిస్థితుల నుంచి మీ కుటుంబ ఆర్థిక భవిష్యత్తుకు రక్షణ కల్పించేది జీవిత బీమా. సంపాదించే ప్రతి ఒక్కరూ తన ఆర్థిక ప్రణాళికల్లో దీనికి తగిన స్థానం ఇవ్వాల్సిందే. ఆయుర్దాయం పెరుగుతోంది. అదే సమయంలో జీవన శైలీ మారుతోంది. -
లక్ష్య సాధనకు సిప్ మార్గం
స్టాక్ మార్కెట్లో చిన్న మొత్తాలతోనూ మదుపు చేసేందుకు క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్) తోడ్పడుతుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు సిప్ ద్వారా మదుపు చేసే వారు పెరిగారు. యాంఫీ గణాంకాల ప్రకారం చూస్తే.. గత నెలలో దాదాపు 42.87 లక్షల కొత్త సిప్ ఖాతాలు ప్రారంభమయ్యాయి. -
విహార యాత్రలో ధీమాగా
వేసవి సెలవులు వచ్చేశాయి. ఈ కాలంలో చల్లని ప్రాంతాలకు వెళ్లేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇందులో చాలామంది విదేశాలకు వెళ్లేవారూ ఉంటారు. ఈ నేపథ్యంలో విదేశీ ప్రయాణాల్లో అనుకోని అవాంతరాలు, అనారోగ్యం వచ్చినప్పుడు తోడుండేలా బీమా తీసుకోవడం మంచిది. -
టర్మ్ బీమా ప్రీమియంలు ఎంతెంత?
చిన్న వయసులోనే జీవిత బీమా తీసుకుంటే ప్రీమియం తక్కువగా ఉంటుంది. వివిధ బీమా సంస్థలు వసూలు చేసే ప్రీమియంలు ఎంతెంతున్నాయో ఇక్కడ చూడండి. -
రెగ్యులర్ Vs డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్.. ఏది బెటర్?
Mutual Funds: మ్యూచువల్ ఫండ్లలో మదుపర్లకు రెండు రకాల పథకాలు అందుబాటులో ఉంటాయి. వాటిలో ఏది ఎంచుకోవాలో చాలా మందికి అవగాహన ఉండదు. -
వివిధ లార్జ్ క్యాప్ ఫండ్లపై రాబడులు ఇలా ఉన్నాయి
3, 5, 10 సంవత్సరాల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ పథకాలు ఇక్కడ ఉన్నాయి. -
స్థిరాస్తుల్లో మదుపు చేద్దామా
పెట్టుబడులు పెట్టేందుకు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. షేర్లు, బాండ్లు, ఫిక్స్డ్ డిపాజిట్లలాంటి పెట్టుబడి పథకాలు, బంగారం, స్థిరాస్తుల వరకూ ఎన్నో విస్తృత శ్రేణి ఎంపికలు ఉన్నాయి. -
ఓటీపీ ఆ అంకెలు జాగ్రత్త
ఒక్క క్లిక్‌తో కావాల్సినవన్నీ కొనేస్తున్నాం. బ్యాంకింగ్ లావాదేవీలన్నీ చేసేస్తున్నాం. వీటన్నింటికీ ఆరంకెల ఓటీపీ (వన్ టైమ్ పాస్వర్డ్) చాలు.. ఇంత సౌలభ్యంతోపాటు, కొన్ని ప్రమాదాలూ పొంచి ఉన్నాయి -
పన్ను ప్రణాళికకు తరుణమిదే..
ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడంతో.. ఆదాయపు పన్ను మినహాయింపుల గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పాత పన్నువిధానంలోనే ముందుకెళ్లాలని ఆలోచిస్తున్న వారు -
రెస్టరంట్లో డబ్బు ఆదా చేయడానికి చిట్కాలు
ఎప్పుడైనా కుటుంబంతో కలిసి రెస్టరంట్‌కు వెళ్లాలనుకునేవారు బిల్లుపై తగ్గింపు పొందాలనుకుంటారు. అలాంటి వారికోసమే కొన్ని చిట్కాలు. -
ఆన్లైన్ vs ఆఫ్‌లైన్ బీమా.. ఏది మెరుగైనది?
ప్రస్తుతం అన్ని రకాల బీమా పాలసీలు ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో లభిస్తున్నాయి. ఇవి వినియోగదారులకు ఎలాంటి సేవలు అందిస్తాయి? ఎలా మెరుగైనవి అనేది ఇక్కడ తెలుసుకోండి. -
ఎన్పీఎస్ లాగిన్, క్రెడిట్ కార్డ్ రూల్స్.. ఏప్రిల్ 1 నుంచి రాబోతున్న మార్పులివీ..
Changes from april 1st: కొత్త ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక పరమైన మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. అవేంటో చూసేయండి..
తాజా వార్తలు (Latest News)
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్‌గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!