Car Insurance: కారు బీమా ప్రీమియం తగ్గించుకోవాలా? ఇలా చేయండి..
ప్రీమియం ఎక్కువవుతుందని కారు బీమాను తీసుకునేందుకు ఆలోచిస్తున్నారా? బీమా కవరేజీని ఏమాత్రం తగ్గించుకోకుండా ప్రీమియం కొంత వరకు తగ్గించుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
ఇంటర్నెట్ డెస్క్: కారు కొనుగోలుకు లక్షలాది రూపాయిలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా పరిశోధన చేసి, అవసరమైతే రుణం తీసుకుని కొంటుంటాం. అలా కొన్న కారుకు భద్రత ఉండాలంటే బీమా ఉండాల్సిందే. కొంత మంది.. వారి డ్రైవింగ్ మీద ఉన్న నమ్మకంతో ఖర్చుతో కూడుకున్నదని బీమాను నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ, ఎంత జాగ్రత్తగా డ్రైవ్ చేసినా ఒక్కోసారి అనుకోని ప్రమాదాలు జరగొచ్చు. అదీకాక మన దేశంలో వాహనం రోడ్డు మీదకు రావాలంటే కచ్చితంగా థర్డ్‌పార్టీ ఇన్సురెన్స్ తీసుకోవాల్సిందే. లేదంటే జరిమానా తప్పదు.
వాస్తవానికి బీమాను భద్రతగా చూడాలే తప్ప ఖర్చు అనుకోకూడదు. అధిక మొత్తంలో డబ్బు పెట్టుబడి పెడుతున్నాం కాబట్టి థర్డ్ పార్టీ ఇన్సురెన్స్‌తో పాటు తగిన కవరేజీతో సమగ్ర బీమాను తీసుకోవడం మంచిది. ఒకవేళ మీరు బీమా ప్రీమియం ఎక్కువవుతుందని ఆలోచిస్తున్నట్లయితే తగ్గించుకునేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి. బీమా కవరేజీని ఏమాత్రం తగ్గించుకోకుండా ప్రీమియం కొంత వరకు తగ్గించుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
ఆన్లైన్లో కొనుగోలు..
కారు/ ద్విచక్ర వాహన డీలర్లు.. తమతో ఒప్పందం ఉన్న బీమా సంస్థల నుంచి పాలసీలు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటారు. మనం వారు చెప్పిన పాలసీ తీసుకోవాలనే నిబంధన ఏదీ లేదు. కాబట్టి ఆన్లైన్లో అందుబాటులో ఉన్న వివిధ పాలసీల గురించి తెలుసుకోండి. మీకు సరిపోయే పాలసీని ఎంచుకుని.. ఆ పాలసీకి వివిధ సంస్థలు అందించే ప్రీమియంను పోల్చి చూడండి. ప్రీమియం ఒక్కటే కాదు క్లెయిం సెటిల్మెంట్ రేషియో వంటి వాటిని దృష్టిలో ఉంచుకుని మీకు నచ్చిన సంస్థ నుంచి నేరుగా పాలసీ కొనుగోలు చేయండి. బీమా సంస్థల వెబ్సైట్ల నుంచి నేరుగా పాలసీ కొనుగోలు చేయడం వల్ల ఏజెంట్లు ఉండరు కాబట్టి ప్రీమియం చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. దీంతో మీకు అన్ని విధాలా సరిపోయే పాలసీని బడ్జెట్లోనే కొనుగోలు చేయొచ్చు.
నో-క్లెయిం బోనస్..
పాలసీ కాలవ్యవధిలో ఎలాంటి క్లెయింలూ చేయనివారికి నో-క్లెయిం బోనస్ పొందేందుకు అర్హత ఉంటుంది. ప్రతి క్లెయిం రహిత సంవత్సరానికి బీమా సంస్థ నో-క్లెయిం బోనస్ (ఎన్సీబీ) రివార్డు అందిస్తుంది. ఇలా వరుసగా 5 ఏళ్ల పాటు మీరు ఎటువంటి క్లెయిమూ చేయకపోతే గరిష్ఠంగా 50% వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఏదైనా ఏడాది క్లెయిం చేస్తే.. రెన్యువల్ సమయంలో ఎన్సీబీ జీరో అయిపోతుంది. కాబట్టి, చిన్న చిన్న రిపేర్లకు క్లెయిం చేయకుండా ఉంటే ఎన్సీబీతో ప్రీమియంను చాలా వరకు తగ్గించుకోవచ్చు.
డిడక్టిబుల్స్..
కారు బీమా ప్రీమియంను తగ్గించుకునేందుకు ఉన్న మరో ముఖ్య మార్గం డిడక్టిబుల్స్. వీటిని ఎంచుకోవడం కొంత వరకు ప్రయోజనకరమే. డిడక్టిబుల్స్ ఉంటే.. కారుకు ఏదైనా నష్టం జరిగినప్పుడు కొంత సొంత డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. కాబట్టి డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉంటారు. అలాగే చిన్న చిన్న నష్టాలకు బీమా క్లెయిం చేయరు. తద్వారా ఎన్సీబీ కోల్పోకుండా ఉంటారు.
డిడక్టిబుల్ అంటే..?: బీమా సంస్థకు, పాలసీదారుడికి మధ్య జరిగే కాస్ట్ షేరింగ్ ఎగ్రిమెంటు (ఖర్చు భాగస్వామ్యం ఒప్పందం)నే డిడక్టిబుల్స్ అంటారు. అంటే ప్రమాదం కారణంగా కారుకు ఏదైనా నష్టం జరిగితే.. క్లెయిం మొత్తంలో కొంత భాగం పాలసీదారుడు చెల్లించాలి. ఆ తర్వాత మాత్రమే బీమా సంస్థ క్లెయిం సెటిల్మెంట్ చేస్తుంది. అంటే, ఖర్చు కనీస మొత్తం దాటితేనే బీమా క్లెయిం చేయగలుగుతారు. ఒకవేళ మీరు డిడక్టిబుల్ జీరోగా ఎంచుకుంటే ప్రీమియం మొత్తం పెరుగుతుంది. అదే, కొంత మొత్తాన్ని భరించగలిగితే ప్రీమియం చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. ఈ డిడక్టిబుల్స్ రెండు రకాలుగా ఉంటాయి. 1. కంపల్సరీ డిడక్టిబుల్ 2. వాలంటరీ డిడక్టిబుల్.
కంపల్సరీ డిడక్టిబుల్: బీమా నియంత్రణ సంస్థ నిబంధనల ప్రకారం.. బీమా చేసిన అన్ని వాహనాలకూ ఇది వర్తిస్తుంది. పాలసీలో తప్పనిసరిగా పాలసీదారుడు చెల్లించవలసిన భాగాన్ని కంపల్సరీ డిడక్టిబుల్ అంటారు. ఎంత మొత్తం అనేది వాహన ఇంజిన్ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. 1499 సీసీ వరకు ఇంజిన్ కెపాసిటీ ఉన్న ప్రైవేట్ కార్లకు తప్పనిసరి మినహాయింపు రూ.1,000, అంతకంటే ఎక్కువ ఉన్న వాటికి రూ.2,000 ఉంటుంది. కంపల్సరీ డిడక్టిబుల్తో ప్రీమియం ఏమాత్రం తగ్గదు. పాలసీదారుడు క్లెయిం చేసినప్పుడు ఫీజు కింద ఈ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.
వాలంటరీ డిడక్టిబుల్: ప్రీమియం తగ్గించడంలో వాలంటరీ డిడక్టిబుల్ సాయపడుతుంది. క్లెయిం మొత్తంలో కొంత భాగాన్ని మీరు స్వచ్ఛందంగా భరించడానికి అంగీకరించడమే వాలంటరీ డిడక్టిబుల్. క్లెయిం చేయాల్సివచ్చినప్పుడు పాలసీదారుడు ఖర్చులను భరించగలిగే సామర్థ్యాన్ని, కారు ఉపయోగించే తీరును అనుసరించి, ఎంత వరకు వాలంటరీ డిడక్టిబుల్‌ను ఎంచుకోవాలో నిర్ణియంచుకోవచ్చు. ఉదాహరణకు కారు వినియోగం తక్కువగా ఉండి, ప్రమాదాలకు గురయ్యే అవకాశం తక్కువగా ఉందనుకున్నప్పుడు ఎక్కువ మినహాయింపుతో పాలసీ తీసుకోవచ్చు. డ్రైవింగ్ నైపుణ్యాలు, కారు తిరిగే ప్రాంతం, కారుకు ఉన్న భద్రతా ఫీచర్లు వీటిన్నింటినీ కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఎంత ఎక్కువ వాలంటరీ డిడక్టిబుల్ తీసుకుంటే అంత ప్రీమియం తగ్గుతుంది. అయితే క్లెయిం చేయాల్సి వచ్చినప్పుడు అధిక భాగం పాలసీదారుడే చెల్లించాలి. కాబట్టి జాగ్రత్తగా ఎంచుకోవడం మేలు.
ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వేల్యూ(ఐడీవీ)..
మోటారు బీమాలో ప్రీమియంపై నేరుగా ప్రభావం చూపే అంశాల్లో ఐడీవీ ఒకటి. ఏదైనా ప్రమాదం కారణంగా వాహనం పూర్తిగా ధ్వంసమైనప్పుడు (రిపేరు చేసేందుకు వీలులేని విధంగా) లేదా దొంగిలించినప్పుడు బీమా సంస్థ, పాలసీదారునికి చెల్లించే గరిష్ఠ బీమా విలువే ఐడీవీ. సాధారణంగా పాలసీ కొనుగోలు చేసినప్పుడు లేదా పునరుద్ధరణ సమయంలో కారు మోడల్, తయారీదారు ఇచ్చిన అమ్మకం ధర ఆధారంగా ఐడీవీ నిర్ణయిస్తారు. ఐదేళ్లకు పైబడిన వాహనాలకు, వాహన కండీషన్ ఆధారంగా ఐడీవీ అంచనా వేస్తారు. పాలసీదారుడు, బీమా సంస్థ పరస్పర అంగీకారంతో కూడా ఐడీవీ నిర్ణయించవచ్చు. ఎక్కువ ఐడీవీ ఎంచుకుంటే ప్రీమియం పెరుగుతుంది. కాబట్టి వాహన కండీషన్‌ను బట్టి సరిపోయే ఐడీవీ ఎంచుకుంటే బీమా ప్రీమియంను తగ్గించుకోవచ్చు.
యాంటీ థెఫ్ట్ పరికరం..
మీ వాహనంలో యాంటీ థెఫ్ట్ పరికరాన్ని అమర్చడం ద్వారా మీ వాహనం దొంగతనానికి గురికాకుండా కాపాడుకోవడం మాత్రమే కాకుండా, బీమా ప్రీమియంను కూడా తగ్గించుకోవచ్చు. ఒకవేళ మీరు ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సర్టిఫై చేసిన యాంటీ థెఫ్ట్ పరికరాన్ని అమర్చినట్లయితే, బీమా కంపెనీలు మీ పాలసీ ప్రీమియంపై డిస్కౌంటును అందిస్తాయి.
చివరిగా..
వాహన బీమా పాలసీను సకాలంలో పునరుద్ధరించాలి.. లేకపోతే అప్పటి వరకు పొందిన నో-క్లెయిం బోనస్ కోల్పోవడంతో పాటు.. దురదృష్టవశాత్తు, బీమా కాలపరిమితి పూర్తయిన తర్వాత ప్రమాదం జరిగితే ఎలాంటి కవరేజీ లభించదు. ఖర్చు మొత్తం మీరే భరించాల్సి ఉంటుంది. అలాగే బీమా కవరేజీని పెంచుకునేందుకు ఇంజిన్ ప్రొటక్షన్, జీరో డిప్రిసియేషన్, నో క్లెయిం బోనస్ ప్రొటెక్షన్, ఇన్వాయిస్ కవర్ రిటర్న్, రోడ్‌సైడ్ అసిస్టెన్స్, లాక్/కీ రీప్లేస్మెంట్ కవర్ వంటి అనేక రకాల యాడ్-ఆన్లు అందుబాటులో ఉన్నాయి. వీటితో తక్కువ ఖర్చుతోనే కవరేజీని పెంచుకోవచ్చు. మీ అవసరాలకు తగినట్లుగా యాడ్-ఆన్‌లను ఎంచుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
Mutual Funds: స్మాల్ క్యాప్ ఫండ్లపై రాబడులివే
స్మాల్ క్యాప్ ఫండ్లలో రిస్క్ ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో గణనీయమైన రాబడిని అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ ఫండ్లలో మంచి ఫలితాలను అందించిన కొన్నింటిని ఇక్కడ చూడొచ్చు. -
సెకండ్ హ్యాండ్ లగ్జరీ కారు కొనుగోలు ప్రయోజనమేనా?
నాన్ లగ్జరీ కారు కొనుగోలు కంటే కొద్దిగా ఎక్కువ ఖర్చు చేస్తే అధునాతన ఫీచర్లు గల సెకండ్ హ్యాండ్ లగ్జరీ కారు కొనుగోలు చేయొచ్చు. ఇలాంటి కార్ల కొనుగోలుతో ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అనేది చూద్దాం. -
జీవిత బీమాలో క్లెయిం సెటిల్మెంట్ ఎలా?
జీవిత బీమా క్లెయిమ్స్ సెటిల్మెంట్ అనేది బీమా సంస్థకు సంబంధించిన ముఖ్యమైన సేవల్లో కీలకమైనది. క్లెయిం సెటిల్మెంట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. -
ఆరోగ్య బీమా కొనుగోలుకు వయో పరిమితి తొలగింపు
ఆరోగ్య బీమా కొనుగోలుకు ఉన్న వయో పరిమితిని ఐఆర్డీఏ తొలగించింది. దీంతో అన్ని వయసుల వారూ బీమా పాలసీని తీసుకునే అవకాశం లభించనుంది. -
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్‌లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా
ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది. -
ఉన్నత చదువులకు భరోసానిద్దాం...
పిల్లల చదువుల ఖర్చులు ఏటా 7-10 శాతం పెరుగుతున్నాయి. మరోవైపు క్షీణిస్తున్న రూపాయి విలువ దీనికి అదనం. ఒకప్పటితో పోలిస్తే పిల్లల ఉన్నత చదువుల ప్రణాళిక ఇప్పుడు క్లిష్టంగా మారింది. -
వెండిలో పెట్టుబడి లాభమేనా?
బంగారం, వెండి.. ఈ రెండు లోహాలతో భారతీయులకు విడదీయలేని సంబంధం ఉంది. ఆభరణాలు, వస్తువుల రూపంలో వీటిని కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు -
సరైన బీమా హామీ మొత్తాన్ని ఎలా ఎంచుకోవాలి?
ప్రస్తుత కాలంలో సంపాదించే ప్రతి వ్యక్తికి, ముఖ్యంగా తనపై ఆధారపడిన వారు ఉన్నప్పుడు తగిన జీవిత బీమా మొత్తం ఉండడం ఎంతో అవసరం. ఎంత బీమా ఉంటే కుటుంబ సభ్యులకు సరిపోవచ్చో ఇక్కడ చూడండి. -
ఆరోగ్య బీమా రూల్స్‌లో మార్పులు.. పాలసీదారులకు ప్రయోజనం
IRDAI : ఆరోగ్య బీమా పాలసీల నిబంధనల విషయంలో బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. వీటి ద్వారా బీమా కస్టమర్లకు మరింత ప్రయోజనం చేకూరనుంది. -
మిడ్ క్యాప్ ఫండ్లపై రాబడులు ఎంతెంత?
దేశీయంగా పెట్టుబడులకు వివిధ మ్యూచువల్ ఫండ్ల పథకాలు ఉన్నాయి. ఈ మ్యూచువల్ ఫండ్లలో మంచి ఫలితాలను అందించిన కొన్ని మిడ్ క్యాప్ ఫండ్లను ఇక్కడ చూడొచ్చు. -
కొత్త ఏడాదిలో పన్ను విధానం ఎంచుకుంటున్నారా? ఇవి తెలుసుకున్నాకే..!
Income tax: కొత్త ఆర్థిక సంవత్సరంలో వేతన జీవులు పన్ను విధానం యాజమాన్యానికి తెలియజేయాలి. టీడీఎస్ కోసం మీకు నప్పే పన్ను విధానం ఎంచుకోవడం మంచిది. -
పదవీ విరమణ తర్వాత రూ.1 కోటి నిధి సరిపోతుందా?
చాలా మంది పదవీ విరమణ నిధికి రూ.1 కోటి సరిపోతుందని అనుకుంటారు. ఎలాంటి విషయాలు పదవీ విరమణ నిధిని, రాబడిని ప్రభావితం చేస్తాయి. రూ.1 కోటి నిధి సరిపోతుందా? లేదా? ఇక్కడ తెలుసుకోండి.. -
జీవిత బీమా.. అనుబంధ పాలసీలు తీసుకున్నారా?
ఊహించని పరిస్థితుల నుంచి మీ కుటుంబ ఆర్థిక భవిష్యత్తుకు రక్షణ కల్పించేది జీవిత బీమా. సంపాదించే ప్రతి ఒక్కరూ తన ఆర్థిక ప్రణాళికల్లో దీనికి తగిన స్థానం ఇవ్వాల్సిందే. ఆయుర్దాయం పెరుగుతోంది. అదే సమయంలో జీవన శైలీ మారుతోంది. -
లక్ష్య సాధనకు సిప్ మార్గం
స్టాక్ మార్కెట్లో చిన్న మొత్తాలతోనూ మదుపు చేసేందుకు క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్) తోడ్పడుతుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు సిప్ ద్వారా మదుపు చేసే వారు పెరిగారు. యాంఫీ గణాంకాల ప్రకారం చూస్తే.. గత నెలలో దాదాపు 42.87 లక్షల కొత్త సిప్ ఖాతాలు ప్రారంభమయ్యాయి. -
విహార యాత్రలో ధీమాగా
వేసవి సెలవులు వచ్చేశాయి. ఈ కాలంలో చల్లని ప్రాంతాలకు వెళ్లేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇందులో చాలామంది విదేశాలకు వెళ్లేవారూ ఉంటారు. ఈ నేపథ్యంలో విదేశీ ప్రయాణాల్లో అనుకోని అవాంతరాలు, అనారోగ్యం వచ్చినప్పుడు తోడుండేలా బీమా తీసుకోవడం మంచిది. -
టర్మ్ బీమా ప్రీమియంలు ఎంతెంత?
చిన్న వయసులోనే జీవిత బీమా తీసుకుంటే ప్రీమియం తక్కువగా ఉంటుంది. వివిధ బీమా సంస్థలు వసూలు చేసే ప్రీమియంలు ఎంతెంతున్నాయో ఇక్కడ చూడండి.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్‌ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా