అటల్ పెన్షన్ యోజన పథకంలో చేరండిలా..

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, అటల్ పెన్షన్ యోజన హామీ ఇచ్చిన పింఛను ప్రయోజనాలను కచ్చితంగా అందిస్తుంది​​​​​​....

Updated : 01 Jan 2021 20:13 IST

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, అటల్ పెన్షన్ యోజన హామీ ఇచ్చిన పింఛను ప్రయోజనాలను కచ్చితంగా అందిస్తుంది

అటల్ పెన్షన్ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అసంఘటిత రంగం వారి కోసం ప్రవేశపెట్టింది. దీనిని మే 2015 సంవత్సరంలో ప్రారంభించారు. ఇప్పటి వరకు ఈ పథకం కింద 1.08 కోట్ల మంది చందాదారులు నమోదు చేసుకోగా, ఇది రూ. 4500 కోట్ల ను సేకరించింది. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన భారతీయులు ఈ పథకంలో చేరవచ్చు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, అటల్ పెన్షన్ యోజన హామీ ఇచ్చిన పింఛను ప్రయోజనాలను కచ్చితంగా అందిస్తుంది. ఇది చందాదారులకు, వారి జీవిత భాగస్వాములకు హామీ ఇచ్చిన పింఛను ప్రయోజనాలను నిలబెట్టుకోవడానికి కావలసిన నిధులను సమకూరుస్తుంది.

అటల్ పెన్షన్ యోజన పథకంలో పెట్టుబడులు పెట్టడానికి మీరు తెలుసుకోవలసి విషయాలను కింద తెలియచేశాము :

  1. అర్హత :

ఈ పథకంలో చేరాలనుకునే వారికి ఏదైనా బ్యాంకులో లేదా పోస్ట్ ఆఫీసు లో పొదుపు ఖాతా తప్పనిసరిగా ఉండాలి. అలాగే వ్యక్తి వయస్సు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి.

నిపుణుల సూచనల ప్రకారం, ఈ పథకంలో త్వరగా చేరితే ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు.

  1. చెల్లించాల్సిన మొత్తం :

ఈ పథకంలో చేరాలనుకునే వారు చెల్లించాల్సిన మొత్తం రూ. 42 నుంచి రూ. 210 మధ్య ఉంటుంది. ఇది చందాదారుడి పథకంలో చేరిన సమయంలో అతని వయస్సు, పెన్షన్ స్లాబ్ ఆధారంగా మారుతూ ఉంటుంది. అలాగే చెల్లించాల్సిన మొత్తం ప్రతినెలా చందాదారుడి బ్యాంకు ఖాతా నుంచి ఆటోమేటిక్ గా డెబిట్ అవుతుంది. చందాదారుడు ప్రతి నెలా, మూడు నెలలకోసారి లేదా ఆరు నెలలకోసారి చెల్లించే ఆప్షన్ ను ఎంచుకోవచ్చు.

  1. కనీస కాలవ్యవధి :

ఈ పథకం కింద చెల్లింపు చేయవలసిన కనీస కాలవ్యవధి 20 సంవత్సరాలుగా ఉంటుంది. ఉదాహరణకు ఒక చందాదారుడు 40 సంవత్సరాల వయస్సులో ఈ పథకంలో చేరాడనుకుంటే, అతనికి 60 సంవత్సరాల వయస్సు వచ్చిన తరువాత నుంచి పెన్షన్ తీసుకోవడం మొదలు పెడతాడు. అంటే అతను 20 సంవత్సరాల పాటు చెల్లించాల్సి ఉంటుంది.

  1. పెన్షన్ మొత్తం :

ఈ పథకం కింద చందాదారుడు నెలకు రూ. 1000, రూ. 2000, రూ. 3000, రూ. 4000, రూ. 5000 వరకు మాత్రమే పెన్షన్ గా పొందగలడు. పథకంలో చేరే సమయంలో చందాదారుడు పైన తెలిపిన వాటిలో ఎంత మొత్తాన్ని పెన్షన్ గా పొందాలనుకుంటున్నాడో ఎంచుకోవాల్సి ఉంటుంది.

  1. ఆదాయ పన్ను ప్రయోజనాలు :

నేషనల్ పెన్షన్ సిస్టమ్ మాదిరిగానే ఈ పెన్షన్ పథకం కింద చెల్లించే మొత్తానికి కూడా పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80సీసీడీ (1బీ) కింద చెల్లించిన మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. సెక్షన్ 80సీసీడీ (1బీ) ఆదాయ పన్ను మినహాయింపు ప్రకారం ప్రస్తుత పరిమితి రూ. 50,000 గా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని