Debit Card: డెబిట్ కార్డు ఎక్స్‌పైర్ అయ్యిందా? ఇలా చేయండి
కార్డు పాడైపోవడం, పిన్ మర్చిపోవడం, పోగొట్టుకోవడం, వ్యాలిడిటీ పూర్తవడం వంటి సందర్భాల్లో ఖాతాదారులు కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇంటర్నెట్ డెస్క్: డెబిట్ కార్డులు సాధారణంగా రెండు, మూడు సంవత్సరాల ఎక్స్‌పైరీ తేదీలతో వస్తుంటాయి. కొన్ని కార్డులకు 4 నుంచి 10 సంవత్సరాల వరకు కూడా పనిచేస్తాయి. చాలా మంది ఈ తేదీని అంతగా పట్టించుకోరు. కానీ, ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో డబ్బు విత్‌డ్రా చేయాల్సి వచ్చి కార్డు పనిచేయకపోతే ఇబ్బంది పడాలి. కాబట్టి, ఈ తేదీని కూడా గమనిస్తుండాలి. కార్డు వ్యాలిడిటీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అన్నది కార్డుపై ఉంటుంది.
కార్డు ఎక్స్‌పైరీ వరకు మాత్రమే పనిచేస్తుంది. ఉదాహరణకు మీ కార్డు ఎక్స్‌పెయిరీ తేదీ 03/2023 అని ఉంటే.. అది 2023 మార్చి 31వ తేదీ వరకు మాత్రమే పనిచేస్తుంది. ఆ తర్వాత కార్డుతో లావాదేవీలు చేయలేరు. ఒకవేళ మీ డెబిట్ కార్డు ఎక్స్‌పైరీ తేదీ పూర్తయి, మీరు ఇంకా ఆ బ్యాంకులో ఖాతాను కొనసాగిస్తున్నట్లయితే కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాకుండా కార్డు పాడైపోవడం, పిన్ మర్చిపోవడం, పోగొట్టుకోవడం వంటి సందర్భాల్లోనూ కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు గల మార్గాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నెట్ బ్యాంకింగ్..
డెబిట్ కార్డు తిరిగి పొందేందుకు సులభమైన మార్గం నెట్ బ్యాంకింగ్. ముందుగా మీ కస్టమర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో నెట్‌బ్యాంకింగ్ ఖాతాకు లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత కార్డుల విభాగానికి వెళ్లి రీప్లేస్ చేయాల్సిన డెబిట్ కార్డును ఎంచుకొని రీప్లేస్‌మెంట్ కోసం అభ్యర్థించవచ్చు. ఇక్కడ మీరు కార్డు పొందే అడ్రస్ ధ్రువీకరించాల్సి ఉంటుంది. నెట్ బ్యాంకింగ్‌కు లాగిన్ అయిన తర్వాత మీ బ్యాంకు వెబ్‌సైట్ ప్రకారం అనుసరించాల్సిన స్టెప్స్‌లో మార్పులు ఉండొచ్చు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకుంటే.. నెట్ బ్యాంకింగ్‌కు లాగిన్ అయిన తర్వాత ఇ-సర్వీసెస్ సెక్షన్‌లో ఉన్న రిక్వెస్ట్ ఏటీఎం/డెబిట్ కార్డుపై క్లిక్ చేస్తే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబరుకు ఓటీపీ వస్తుంది. దీన్ని ఎంటర్ చేసిన తర్వాత ప్రైమరీ కార్డును ఎంచుకుని, కార్డుదారుని పేరు, ఈ-మెయిల్ వివరాలు ఎంటర్ చేసిన తర్వాత నియమ నిబంధనలను అంగీకరించి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇలా ప్రాసెస్ పూర్తి చేసిన తర్వాత ఏడు పనిదినాల్లో కార్డు మీకు అందుతుంది.
మొబైల్ బ్యాంకింగ్..
ప్రస్తుతం దాదాపు అన్ని బ్యాంకులు.. వాటికి సంబంధించిన ప్రత్యేక యాప్‌లను రూపొందిస్తున్నాయి. ఈ యాప్‌ల ద్వారా రీప్లేస్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కస్టమర్ ఐడీ, పాస్‌వర్డ్ లేదా నాలుగు అంకెల త్వరిత యాక్సెస్ పిన్/పాస్‌వర్డ్‌లను ఎంటర్ చేసి ఖాతాకు లాగిన్ అవ్వాలి. కార్డ్స్ మెనూకు వెళ్లి డెబిట్ కార్డు రీప్లేస్‌మెంట్ సర్వీస్ కోసం రిక్వెస్ట్ చేయాలి. మీ బ్యాంకు, అభ్యర్థనను ప్రాసెస్ చేసి రిజిస్టర్డ్ అడ్రస్‌కు కార్డును పంపుతుంది.
కస్టమర్ కేర్..
మీ బ్యాంకు కస్టమర్ కేర్‌కు కాల్ చేసి ఎగ్జిక్యూటివ్‌ను సంప్రదించండి. మీ ఎగ్జిక్యూటివ్ మీ అభ్యర్థనను స్వీకరించి రిజిస్టర్డ్ చిరునామాకు కొత్త డెబిట్ కార్డును పంపుతారు. కస్టమర్ కేర్‌కు కాల్ చేసేటప్పుడు మీ బ్యాంకు అధికారిక వెబ్‌సైట్ నుంచి మాత్రమే నంబరు తీసుకోండి. ఆన్‌లైన్‌లో వెతికి తీసుకోవడం మంచిది కాదు. బ్యాంకువారు డెబిట్‌కార్డు పిన్, పాస్‌వర్డు వంటి సమాచారం అడగరు.
బ్రాంచీని సంప్రదించండి..
మీకు నెట్ లేదా మొబైల్ బ్యాంకింగ్ సౌకర్యం లేకపోతే నేరుగా బ్యాంకు బ్రాంచీకు వెళ్లి కూడా కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బ్రాంచీకి వెళ్లినప్పుడు తక్షణ (ఇన్స్‌టెంట్) డెబిట్ కార్డు కోసం కూడా అడగొచ్చు. అయితే, కార్డుపై మీ పేరు ఉండదు. ఒకవేళ పేరుతో కావాలనుకుంటే మీ రిజిస్టర్డ్ చిరునామాకు పంపుతారు.
గుర్తుంచుకోండి..
కార్డు రీప్లేస్‌మెంట్ కోసం బ్యాంకులు ఛార్జీలను వసూలు చేయవచ్చు. ఇవి వేరు వేరు బ్యాంకులకు వేరు వేరుగా ఉంటాయి. ఒకవేళ మీ కార్డును ఎక్కడైనా పోగొట్టుకుంటే, ముందుగా కార్డును బ్లాక్ చేసి ఆ తర్వాత కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి. కొత్త కార్డు దరఖాస్తు చేసుకున్నప్పుడు కార్డును మీ చిరునామాకు పంపుతారు, కాబట్టి మీరు బ్యాంకులో చిరునామా వివరాలను అప్‌డేట్ చేసుకోవాలి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Social look: సమంత ప్రచారం.. రాశీఖన్నా హంగామా.. బటర్‌ప్లై లావణ్య..
-
World News
Pakistan: మా దేశంలో ఎన్నికలా.. కష్టమే..!
-
Movies News
Ram gopal varma: ఆర్జీవీ నా ఫస్ట్ ఆస్కార్ అన్న కీరవాణి.. వర్మ రిప్లై ఏంటో తెలుసా?
-
Politics News
Rahul Gandhi: ‘వాజ్‌పేయీ మాటలను గుర్తుతెచ్చుకోండి’.. అనర్హత వేటుపై ప్రశాంత్ కిశోర్!
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/03/2023)
-
World News
TikTok: టిక్‌టాక్ బ్యాన్‌తో నాకూ లాభమే: జస్టిన్ ట్రూడో