Insurance: బీమా సంస్థను ఎంచుకునేటప్పుడు ఏమేం చూడాలి?
చాలా మంది కస్టమర్లు పాలసీని ఎంచుకునేటప్పుడు ఖర్చు, కవరేజీలను మాత్రమే చూస్తారు. అయితే బీమా సంస్థ ఎంపికకు ఇవి మాత్రమే సరిపోవు.
ఇంటర్నెట్ డెస్క్: అనుకోని ప్రమాదాల కారణంగా వచ్చే నష్ట భయం (Risk) తగ్గించడంలో బీమాది (Insurance) కీలక పాత్ర. అందువల్ల ప్రతి ఒక్కరూ తమ ఆర్థిక ప్రణాళిక (Financial Plan)లో జీవిత, ఆరోగ్య, మోటారు, సైబర్, వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీ వంటి ప్రాథమిక బీమా పథకాలను తీసుకోవాలి. అయితే బీమా ప్లాను కొనుగోలు చేసేటప్పుడు ధర, కవరేజీని మాత్రం చూస్తే సరిపోతుందా? అంటే కాదనే చెప్పాలి. సాధారణంగా బీమా కవరేజీ కోసం వెతుకుతున్నప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్న అనేక బీమా పాలసీలను అంచనా వేయడం, అందులో నుంచి కొనుగోలు చేయాలనుకుంటున్న బీమా పాలసీలను అందిస్తున్న అగ్ర బీమా సంస్థల జాబితాను రూపొందించుకోవడం చేస్తుంటారు. అయితే, ఇది మాత్రమే సరిపోదు. బీమా పాలసీని అందించే సంస్థను ఎంపిక విషయంలో కొన్ని పారామితులు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
బీమా సంస్థ చెల్లింపుల సామర్థ్యం..
బీమాలో అత్యంత కీలకమైంది క్లెయింలు. ఆమోదయోగ్యమైన క్లెయింలను గౌరవించడం బీమా సంస్థ విధి. బీమా సంస్థ క్లెయిం సెటిల్మెంట్ రేషియో (CSR) వారి క్లెయిం చెల్లింపు సామర్థ్యాన్ని స్పష్టం చేస్తుంది. దీన్ని శాతంలో తెలుపుతారు. బీమా సంస్థ అందుకున్న మొత్తం క్లెయింలలో సెటిల్ చేసిన క్లెయింలను లెక్కించడం ద్వారా సీఎస్ఆర్ వస్తుంది. ఉదాహరణకు బీమా సంస్థ 100 క్లెయింలను స్వీకరించి 95 క్లెయింలను పరిష్కరించినట్లయితే ఆ సంస్థ క్లెయిం సెటిల్మెంట్ రేషియో 95%గా ఉంటుంది. సీఎస్ఆర్ ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. క్లెయిం సెటిల్మెంట్ రేషియోతో పాటు.. ఆ కంపెనీ ఎంత త్వరగా క్లెయింలను పరిష్కరిస్తుందో కూడా చూడాలి. క్లెయిం సెటిల్మెంట్ ప్రక్రియ దీర్ఘకాలం సాగే రోజులు పోయాయి. బీమా సంస్థలు సాంకేతికతలను, సాధనాలను అందిపుచ్చుకుని నిమిషాలు, గంటల వ్యవధిలోనే క్లెయిం సెటిల్మెంట్ చేస్తున్నాయి.
సాల్వెన్సీ రేషియో..
సాల్వెన్సీ రేషియో (Solvency Ratio) అనేది బీమా సంస్థకున్న నగదు ప్రవాహాన్ని ప్రతిబింబిస్తుంది. బాధ్యతలను నెరవేర్చేందుకు సంస్థకు ఉన్న సామర్థ్యాన్ని సూచిస్తుంది. సరళంగా చెప్పాలంటే ఇది బీమా సంస్థ ఆర్థిక ఆరోగ్యాన్ని తెలియజేస్తుంది. అన్ని సంస్థలు 150% లేదా 1.50 సాల్వెన్సీ రేషియోను నిర్వహించాలని బీమా నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ ఆదేశించింది. అధిక సాల్వెన్సీ రేషియో ఉన్న సంస్థకు మెరుగైన క్లెయిం చెల్లింపు సామర్థ్యం ఉంటుంది.
క్యాష్ లెస్ నెట్వర్క్..
ప్రతి బీమా సంస్థా.. వివిధ నగరాల్లో విస్తరించి ఉన్న నెట్వర్క్ ఆసుపత్రులు, గ్యారేజీల జాబితాను కలిగి ఉంటుంది. బీమా చేసిన వ్యక్తి, ఈ జాబితాలోని ఆసుపత్రులు, గ్యారేజీల్లో నగదు రహిత క్లెయిం సెటిల్మెంట్ సౌకర్యాన్ని పొందొచ్చు. బీమా చేసిన వ్యక్తి ఎటువంటి ఖర్చు లేకుండా, అవాంతరాలు లేని, వేగవంతమైన, నాణ్యమైన సేవలను పొందగలగడమే ఈ నెట్వర్క్ ఆసుపత్రులు, గ్యారేజీలు అందించే అతి పెద్ద ప్రయోజనం. నాన్-నెట్వర్క్ ఆసుపత్రులు, గ్యారెజీల్లో మాదిరిగా బీమా చేసిన వ్యక్తి ముందుగా చెల్లించి, రీయింబర్స్మెంట్ క్లెయిం చేయాల్సిన పనిలేదు. కాబట్టి, విస్తృతమైన నెట్వర్క్ ఉన్న బీమా సంస్థను ఎంచుకోవడం ద్వారా బీమా చేసిన వ్యక్తి మొత్తం ప్రక్రియను సున్నితంగా, ఎటువంటి ఒత్తిడి లేకుండా పూర్తి చేయవచ్చు.
చివరిగా..
పైన పేర్కొన్న అంశాలతో పాటు, బీమా సంస్థను ఖరారు చేసేముందు బీమా సంస్థ కీర్తి, సంస్థ వినియోగదారులకు అందిస్తున్న సేవలనూ తెలుసుకోవడమూ ముఖ్యమే. అనేక ఉత్పత్తులను అందిస్తున్న బీమా సంస్థలను మార్కెట్లో చూస్తుంటాం. కొన్ని సంస్థలు ఆశ్చర్యం కలిగించేలా తక్కువ ధరతో పాలసీలను ఆఫర్ చేస్తుంటాయి. ఇవి కస్టమర్లను ఆకర్షించేందుకు మాత్రమే కావొచ్చు. ఇలాంటి కంపెనీలు క్లెయిం సమయంలో ముందుకు రాకపోవచ్చు. బీమాదారునికి కావాల్సిన మద్దతును ఇవ్వకపోవచ్చు. మెరుగైన సేవలను అందించే బీమా సంస్థల పాలసీలు కాస్త ఖరీదైనవిగా ఉండొచ్చు. కాబట్టి కేవలం ‘ధర’పైనే దృష్టి పెట్టడం కంటే బీమా సంస్థ ఇచ్చే ‘విలువ’కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.
-టి.ఎ. రామలింగం, చీఫ్ టెక్నికల్ ఆఫీసర్, బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిన్న, మధ్యస్త REITS ద్వారా స్థిరాస్తిలో పెట్టుబడులు.. సురక్షితమేనా?
తరతరాలుగా భారతీయులు స్థిరాస్తి, బంగారం వంటి సంప్రదాయ పెట్టుబడులను గౌరవిస్తున్నారు. మారుతున్న కాలంలో స్థిరాస్తి పెట్టుబడులకు మారో రూపమే SM REITS.. వీటి గురించి తెలుసుకోండి. -
PPF vs VPF: పీపీఎఫ్, వీపీఎఫ్‌లో ఏది బెటర్..?
PPF or VPF: వాలంటరీ ప్రావిడెండ్ ఫండ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో ఏది బెటర్ అని ఆలోచిస్తున్నారా? ఈ విషయాల్ని పరిశీలించాక మీ నిర్ణయం తీసుకోండి.. -
Foreign Trip: విదేశీ టూర్‌ను ఇబ్బంది లేకుండా ఎలా ప్లాన్ చేసుకోవాలి?
విదేశీ వెకేషన్‌ను ప్లాన్ చేయడానికి అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రయాణం ఇబ్బంది లేకుండా, సజావుగా జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. -
Claim Ratio: ఆరోగ్య బీమా కంపెనీల క్లెయిమ్స్ రేషియో ఎంతెంత?
దేశంలో వివిధ బీమా సంస్థలకు సంబంధించి.. ఆరోగ్య బీమా పాలసీల క్లెయిం సెటిల్మెంట్ రేషియో ఎంత ఉందో ఇక్కడ చూడండి. -
కుటుంబానికి ధీమానిచ్చేలా.. బీమా పాలసీ
సంపాదించిన మొత్తంలో నుంచి పొదుపు, పెట్టుబడులకు కొంత కేటాయిస్తుంటాం. కుటుంబానికి ఆర్థికంగా అవసరమైన లక్ష్యాల సాధనకు ఇవి ఉపయోగడేలా చూసుకుంటాం. -
పన్ను ఆదా ఇలా చేద్దాం
ఆర్థిక సంవత్సరం ముగింపు దగ్గరకు వచ్చేసింది. పాత పన్ను విధానాన్ని ఎంచుకున్న వారు తమ పొదుపు,పెట్టుబడులను వెంటనే పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. -
డెట్ ఫండ్లలో మదుపు చేస్తున్నారా?
ఈక్విటీ మార్కెట్లలో అనిశ్చితి కనిపిస్తుండటంతో చాలామంది సురక్షిత పథకాలపై దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీటిలో మదుపు చేసేటప్పుడు పరిశీలించాల్సిన అంశాలను తెలుసుకుందాం. -
Credit cards: క్రెడిట్ కార్డుదారులకు అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్!
Credit Cards: క్రెడిట్ కార్డుల విషయంలో ఏప్రిల్ 1 నుంచి మార్పులు రానున్నాయి. రివార్డులు, ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ విషయంలో బ్యాంకులు కీలక మార్పులు చేపట్టాయి. -
Health Insurance Claims: ఆరోగ్య బీమా క్లెయిమ్ విషయంలో ఈ తప్పులు చేయొద్దు!
Insurance claims: ఆరోగ్య బీమా క్లెయిమ్‌లు కొన్నిసార్లు తిరస్కరణకు గురవుతుంటాయి. కాబట్టి ఈ తప్పులు చేయొద్దు.. -
Health Emergency: ఆరోగ్య అత్యవసర పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి?
జీవితంలో ఎలాంటి ఇబ్బంది వచ్చినా దాన్ని ఎదుర్కోడానికి మనం ఆర్థికంగా సిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా ఆరోగ్య అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోండి.. -
Mutual Funds: మ్యూచువల్ ఫండ్ల ఉపసంహరణ సమస్య.. ఎన్ని రోజులు పడుతోందంటే?
మార్కెట్లలో మిడ్, స్మాల్‌క్యాప్ ఫండ్లలో ఉన్న తమ నిధులను మదుపుదార్లు ఉపసంహరించుకున్నప్పుడు నిధుల బదిలీకి వివిధ సంస్థలు కొంత సమయాన్ని తీసుకుంటున్నాయి. ఎంత మొత్తం ఉపసంహరణకు.. ఎంత సమయం తీసుకుంటున్నాయో ఇక్కడ చూడండి. -
Insurance Agent: బీమా ఏజెంట్‌ను ఎలా ఎంపిక చేసుకోవాలి?
చాలా మందికి వారి వ్యక్తిగత జీవితంలో బీమా చాలా అవసరం. పాలసీ కొనుగోలు సమయంలో ఏజెంట్/అడ్వైజర్ అవసరం పడొచ్చు. వీరి గురించి ఇక్కడ తెలుసుకోండి. -
ఆరోగ్య బీమా రోజువారీ ఖర్చులను అందించేలా...
వైద్య ఖర్చులు ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి. అదే సమయంలో ఆరోగ్య బీమా రంగంలోనూ ఎన్నో మార్పులు వస్తున్నాయి. -
స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గుల్లో అప్రమత్తంగా
స్టాక్ మార్కెట్ అంటేనే అనిశ్చితికి మారు పేరు. చిన్న వార్త వచ్చినా దానికి ప్రతికూలంగానో, అనుకూలంగానో స్పందిస్తుంటాయి. ఒక్క రోజులోనే మదుపరుల సంపద కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఆవిరవుతుంది. -
స్థిరాస్తి రంగంలో...
హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ కొత్తగా హెచ్డీఎఫ్సీ నిఫ్టీ రియాల్టీ ఇండెక్స్ ఫండ్ అనే పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్ఓ) ఈ నెల 21న ముగుస్తుంది. -
Health Insurance: విదేశాల్లో విద్యనభ్యసించే విద్యార్ధుల కోసం ఆరోగ్య బీమా
విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు ఆరోగ్య బీమా తప్పనిసరి. భారత్‌లో ప్రముఖ బీమా సంస్థలు విదేశీ విద్యార్థులకు అందించే బీమా సౌకర్యాలు ఇక్కడ తెలుసుకుందాం. -
Post office: ఈ పోస్టాఫీసు పథకంతో నెలకు ₹9 వేలు ఆదాయం
Monthly Income Scheme: ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా స్థిరమైన ఆదాయం వచ్చే పథకం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ పోస్టాఫీసు పథకంపై లుక్కేయండి... -
Personal Finance: మీ వ్యక్తిగత ఆర్థిక ప్రయాణాన్ని ఎలా ప్రారంభించాలి?
జీవితంలో వివిధ దశలలో అవసరాలను తీర్చుకోగలిగే విధంగా ఆర్థిక ప్రయాణాన్ని కొనసాగించడానికి ఎలాంటి పద్ధతులు పాటించాలో ఇక్కడ చూడండి.. -
Insurance: బీమా సంస్థలందించే వివిధ పాలసీలు ఇవిగో..
నేడు మార్కెట్లో అనేక నష్టాలను కవర్ చేసే బీమా పథకాలు ఉన్నాయి. చాలా బీమా పాలసీలను వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా బీమా సంస్థలు తీర్చిదిద్దాయి. వీటిలో కొన్ని ముఖ్యమైన పథకాల గురించి ఇక్కడ తెలుసుకోండి. -
Money mistakes: కొత్తగా ఉద్యోగంలో చేరారా? ఈ ఆర్థిక తప్పులు చేయొద్దు!
Money mistakes: కొత్తగా ఉద్యోగంలో చేరినవారు ఆర్థికంగా ఎదగడానికి కొన్ని తప్పులను నివారించాలి. అవేంటో చూద్దాం..! -
ఆర్థిక స్వేచ్ఛ సాధించేద్దాం
భారతీయ మహిళలు కొత్త శిఖరాలను అధిరోహిస్తున్నారు. అవిశ్రాంతంగా శ్రమిస్తూ.. మెరుగైన భవిష్యత్తును సాధించే దిశగా ముందుకు సాగుతున్నారు. అన్ని రంగాల్లోనూ తమ సత్తా చాటుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థపైనా, ప్రజల జీవితాలపైనా తమ ప్రభావాన్ని చూపిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్‌కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ