Amazon pay వాడుతున్నారా? బ్యాలెన్స్‌ను మీ అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేసుకోండిలా..!
అమెజాన్ పేలో ఉన్న బ్యాలెన్స్‌ను ఇకపై బ్యాంక్ ఖాతాకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కేవైసీ చేసిన వారికే ఈ సదుపాయం ఉంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: అమెజాన్ షాపింగ్ యాప్ వాడేవారందరికీ దాదాపు అమెజాన్ పే (Amazon Pay) సుపరిచితమే. ఇందులో ఉండే బ్యాలెన్స్ ద్వారా రీఛార్జులు, బిల్ పేమెంట్లు, మూవీ టికెట్లు కొనుగోలు చేయొచ్చు. అమెజాన్-ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు వాడే వారికి రివార్డులు, క్యాష్‌బ్యాక్ రూపంలో వచ్చే మొత్తమూ ఇందులోనే జమ అవుతుంది. గిఫ్ట్‌కార్డును రిడీమ్ చేసుకున్నా పే బ్యాలెన్స్లోనే చూపిస్తుంది. మీకూ అలాంటి గిఫ్ట్ కార్డు ఏదైనా వచ్చిందా? లేదంటే క్యాష్‌బ్యాక్ రూపంలో కొంతమొత్తం పే బ్యాలెన్స్‌లో ఉండిపోయిందా? అయితే మీరు ఆ మొత్తాన్ని మీ బ్యాంకు ఖాతాకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికంటే ముందు మీరు అమెజాన్‌లో కేవైసీ వెరిఫికేషన్పూర్తి చేసి ఉండాలి.
బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఇలా..
- మీ ఫోన్లో అమెజాన్ యాప్ ఓపెన్ చేయండి..
- అమెజాన్ పే విభాగంలోకి వెళ్లండి.
- దిగువన కనిపించే ‘సెండ్ మనీ’పై క్లిక్ చేయండి.
- మీరు ఏ బ్యాంక్‌కు నగదు బదిలీ చేయాలనుకుంటున్నారో ఆ బ్యాంక్‌ను ఎంచుకోండి
- ఐఎఫ్ఎస్సీ కోడ్, అకౌంట్ నంబర్, ఖాతాదారుని పేరు ఎంటర్ చేయండి.
- ఎంతమొత్తం పంపించాలనుకుంటున్నారో ఎంటర్ చేయండి.
- మీకు అక్కడ పేమెంట్ విధానం కనిపిస్తుంది. మరిన్ని ఆప్షన్లపై క్లిక్‌చేస్తే పేబ్యాలెన్స్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది.
- దానిమీద క్లిక్ చేస్తే పే బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్‌కు బదిలీ అవుతుంది. పే బ్యాలెన్స్‌లో అందుకు సరిపడా నగదు ఉండాలి.
ఒకవేళ కేవైసీ పూర్తికాకుంటే మీరు బ్యాలెన్స్‌ను బ్యాంక్ అకౌంట్‌కు పంపే వీలు లేదు. ఒకవేళ కేవైసీ పూర్తి చేయాలనుకుంటే అమెజాన్ పే విభాగంలో మేనేజ్ అనే సెక్షన్లో కేవైసీ ఆప్షన్‌న ఎంచుకోండి. మీ సెల్ఫీ, డాక్యుమెంట్‌ను అప్లోడ్ చేయండి. ఆధార్ వెరిఫికేషన్ పూర్తయ్యాక.. అమెజాన్ ఏజెంట్‌తో వీడియోకాల్‌లో వెరిఫికేషన్ పూర్తి చేయండి. కేవైసీ పూర్తయ్యాక మీ పే బ్యాలెన్స్‌ను ఖాతాకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Easter Attacks: ‘నన్ను క్షమించండి..’ శ్రీలంక మాజీ అధ్యక్షుడు సిరిసేన
-
India News
Khushbu Sundar: వీల్‌ఛైర్ కోసం 30 నిమిషాలా?.. ఎయిరిండియాపై ఖుష్బూ అసహనం
-
Sports News
PCB: మికీ ఆర్థర్ పాక్ ‘ఆన్లైన్ కోచ్’.. సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువ
-
Technology News
WhatsApp: వాట్సాప్ వీడియో.. ఈ మార్పు గమనించారా..?
-
Movies News
RRR: ఆస్కార్ బరిలో నిలిచిన చిత్రాలను వెనక్కి నెట్టి.. నంబరు 1గా ‘ఆర్ఆర్ఆర్’
-
Politics News
AAP: కర్ణాటకపై ఆప్ గురి: అజెండాపై కసరత్తు.. పార్టీల హామీలపై కౌంటర్!