Aadhaar: ఆధార్‌కార్డుపై మీ ఫొటో నచ్చలేదా? మరి మార్చుకోవడం ఎలా?
ప్రతి భారతీయుడు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాల్సిన గుర్తింపు కార్డు ఆధార్. ప్రభుత్వానికి సంబంధించి ఏ సేవలు పొందాలన్నా ఇది లేనిదే పని
ఇంటర్నెట్ డెస్క్: ప్రతి భారతీయుడు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాల్సిన గుర్తింపు కార్డు ఆధార్. ప్రభుత్వానికి సంబంధించి ఏ సేవలు పొందాలన్నా ఇది లేనిదే పని జరగదు. చివరకు విద్యాలయాల్లో అడ్మిషన్లు, సిమ్ కార్డులు, బ్యాంకుల్లో ఖాతా తెరవడం, పింఛను.. ఇలా ప్రతిదానికీ ఆధార్ కార్డు ఉండాల్సిందే. వ్యక్తిగత వివరాలతో పాటు బయోమెట్రిక్ సమాచారం కూడా ఈ 12 అంకెలతో కూడిన కార్డులో నిక్షిప్తమై ఉన్నందున దీని భద్రత చాలా ముఖ్యం.
అయితే, చాలా మంది ఆధార్ కార్డుల్లో తప్పుల్ని సరిచేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఇదే క్రమంలో చాలా మందికి ఆధార్‌కార్డుపై ఉన్న తమ ఫొటో నచ్చదు. అలాగే వయసు పెరుగుతున్న కొద్దీ మనిషి ముఖంలో మార్పులు వస్తుంటాయి. మరి చాలా ఏళ్ల క్రితం తీసిన ఆధార్‌పై ఫొటోకు ఇప్పటి మన ముఖానికి పోలికలే ఉండవు. అలాంటప్పుడు గుర్తింపు తప్పనిసరైన చోట ఇబ్బందులు ఎదురుకావొచ్చు. మరి ఆధార్‌కార్డుపై ఫొటోను మార్చుకునే ప్రక్రియ ఏంటో చూద్దాం...
1. యూఐడీఏఐ (UIDAI) వెబ్సైట్ (https://uidai.gov.in/) నుంచి ఆధార్ ఎన్రోల్మెంట్/కరెక్షన్/అప్డేట్ ఫారంను డౌన్లోడ్ చేసుకొని సరైన వివరాలతో పూరించాలి.
2. దగ్గర్లోని ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లి ఫారంను సమర్పించాలి.
3. అక్కడ వారు కొత్త ఫొటోను తీసుకుంటారు.
4. మీ బయోమెట్రిక్‌తో వివరాలను ధ్రువపరుస్తారు.
5. రూ.100+ జీఎస్టీ చెల్లించాలి.
6. అక్నాలెడ్జ్మెంట్ స్లిప్‌తో పాటు అప్డేట్ రిక్వెస్ట్ నంబర్(URN)ను తీసుకోవాలి.
7. యూఆర్‌ఎన్‌తో కొన్ని రోజుల తర్వాత మీ అప్డేట్ స్థితిని తెలుసుకోవచ్చు.
కొత్త ఫొటోతో మీ ఆధార్ అప్డేట్ కావడానికి గరిష్ఠంగా 90రోజుల వరకు పట్టొచ్చు. అలాగే ఫొటో అప్డేట్ చేయడానికి ఎలాంటి అదనపు పత్రాలు సమర్పించాల్సిన అసవరం ఉండదు.
డౌన్లోడ్ ఇలా..
1. UIDAI అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి ‘డౌన్లోడ్ ఆధార్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
2. ఆధార్ నంబర్/ఎన్రోల్మెంట్ ఐడీ/ వర్చువల్ ఐడీ నంబర్‌ను ఎంటర్ చేయాలి.
3. ఆధార్‌ను డౌన్లోడ్ చేసుకునేముందు అక్కడ ఉన్న క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.
4. ఆ తర్వాత సెండ్ ఓటీపీ బటన్‌పై క్లిక్ చేసి.. ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి. తర్వాత డౌన్లోడ్పై క్లిక్ చేయాలి.
5. ఆ తర్వాత మీకు పీడీఎఫ్ రూపంలో ఆధార్ డౌన్లోడ్ అవుతుంది. దీనికి పాస్వర్డ్ ఉంటుంది. దానికి సంబంధించిన వివరాలు ఈ-మెయిల్ ద్వారా వస్తాయి.
6. లేదా దగ్గర్లోని ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లి యూఆర్ఎన్ సహా ఇతర వివరాలు చెప్పి కూడా ఆధార్‌కార్డు తీసుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడిలో మదుపు 10 శాతమే..
నాకు నెలకు రూ.60వేల వేతనం వస్తోంది. నా వయసు 39. ఇప్పటి వరకూ ఎలాంటి జీవిత బీమా పాలసీలనూ తీసుకోలేదు. ఇప్పుడు ఎలాంటి పాలసీలను తీసుకోవాలి. -
ఆరోగ్య బీమా: సమాచారం ఇస్తేనే మేలు
ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు అప్పటి వరకూ ఉన్న ముందస్తు వ్యాధుల గురించి బీమా సంస్థకు తప్పనిసరిగా తెలియజేయాలి. -
మ్యూచువల్ ఫండ్స్‌లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్‌లైన్!
March 31 deadline: మ్యూచువల్ ఫండ్లలో మదుపు ప్రారంభించినప్పుడు విద్యుత్, గ్యాస్ బిల్లులు, బ్యాంకు ఖాతాలు సమర్పించి కేవైసీ నిబంధనలు పూర్తి చేసిన వారు.. మరోసారి తమ వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంది. -
Digilocker: డిజీ లాకర్‌తో ఆధార్, పాన్ వంటి పత్రాలు ఎప్పుడూ మీ వెంటే.. ఎలా దాచుకోవాలి?
DigiLocker: ప్రభుత్వం జారీ చేసిన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఇలా అన్నీ ఒకేచోట డిజిటల్‌గా అందుబాటులో ఉంచేందుకు డిజీలాకర్‌ను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇంతకీ ఇదెలా ఉపయోగపడుతుందో తెలుసా? -
కేవైసీ అప్డేట్ చేశారా?
బ్యాంకులో ఖాతా ఉందా? మ్యూచువల్ ఫండ్‌లో మదుపు చేస్తున్నారా? జీవిత, ఆరోగ్య బీమా పాలసీలున్నాయా? మరి, మీ కేవైసీ (మీ ఖాతాదారు గురించి తెలుసుకోండి) వివరాలు తెలియజేయడం తప్పనిసరి. -
IRCTC refund: ఐఆర్సీటీసీ రిఫండ్స్ ఇక వేగవంతం.. గంటలోనే నగదు వెనక్కి?
IRCTC refund process: రైలు టికెట్ బుక్ చేసినప్పుడు డబ్బులు డెబిట్ అయ్యాయా? ఇకపై ఆ సొమ్ము కోసం రోజులతరబడి ఎదురు చూడాల్సిన పనిలేదు. ఈ ప్రక్రియ వేగవంతం కానుంది. -
Paytm పేమెంట్స్ బ్యాంక్‌లో ఈ సేవలకు.. మరికొన్ని రోజులే గడువు
Paytm payments bank: ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో కొన్ని సేవలకు గడువు మార్చి 15తో ముగియనుంది. ఆ తర్వాత వాటిని కొనసాగించలేరు. -
Aadhaar Update: ఆధార్ ఉచిత అప్డేట్కు మరోసారి గడువు పొడిగింపు
ఆధార్‌లో వివరాలు ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు విధించిన గడువు తేదీని మరోసారి పొడిగిస్తున్నట్లు ఉడాయ్ తెలిపింది. -
ఆదాయపు పన్ను ఈ పొరపాట్లు చేయొద్దు
ఆదాయపు పన్ను భారం తగ్గించుకునేందుకు వివిధ పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు చట్టం అవకాశం కల్పించింది. కేవలం ఇలా మదుపు చేయడంతోనే పన్ను ప్రణాళిక పూర్తయినట్లు చాలామంది భావిస్తారు. ఆర్థిక ప్రణాళికలో పన్ను ఆదా పథకాలూ ఎంతో కీలకం. -
EPFO: పీఎఫ్ ఖాతాలో వివరాలు మార్చుకోవాలా? ఆన్లైన్లో సులువుగా..
EPFO: ఉద్యోగుల భవిష్య నిధి (EPF) చందాదారులా? మీ పీఎఫ్ ఖాతాలో వ్యక్తిగత వివరాలను మార్చుకోవాలనుకుంటున్నారా? ఈ ఆన్లైన్ ఫారమ్‌తో సులువుగా మార్చుకోవచ్చు. -
Indian Railways: ట్రైన్ టికెట్ చిరిగిపోయిందా? అయితే ఇలా చేయండి!
train ticket lost: ట్రైన్ టికెట్ పోయిందా? ప్రయాణం ఎలా అని కంగారు పడుతున్నారా? అయితే రైల్వే అందిస్తున్న ఈ సదుపాయం గురించి తెలుసుకోవాల్సిందే.. -
Solar rooftop: ‘సూర్యఘర్’కు దరఖాస్తు ఎలా? ₹78 వేల రాయితీ ఎలా పొందాలి?
PM Surya Ghar Muft Bijli Yojana: ఇంటిపై సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే సబ్సిడీ ఇచ్చే పథకానికి కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది. ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? సబ్సిడీ ఎలా పొందాలి? -
ఆరోగ్య బీమా క్లెయిం తిరస్కరిస్తే
చిన్న అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్తేనే వేల రూపాయలు ఖర్చవుతున్నాయి. దీన్ని తట్టుకోవాలంటే.. ఆరోగ్య బీమా ఇప్పుడు ఒక తప్పనిసరి అవసరంగా మారింది. చాలామంది ఈ పాలసీని తీసుకుంటున్నప్పటికీ.. దీన్ని పూర్తిగా అర్థం చేసు కోవడంలో కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. -
FasTag: పేటీఎం ఫాస్టాగ్ వాడుతున్నారా? ప్రత్యామ్నాయాలు ఇవే..!
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన ఫాస్టాగ్‌లు త్వరలో చెల్లుబాటుకాకుండా పోనున్నాయి. దీంతో కొత్తవి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రత్యామ్నాయాలు ఇవీ.. -
PM Kisan: రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులు ఎప్పుడంటే?
PM Kisan 16th installment: పీఎం కిసాన్ లబ్ధిదారులకు గుడ్‌న్యూస్. ఫిబ్రవరి 28వ తేదీన ఈ నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. -
పేటీఎం ఫాస్టాగ్‌లు ఏం చేయాలి? సౌండ్ బాక్స్‌ల మాటేంటి? RBI సమాధానాలివే..!
RBI releases Paytm FAQs: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు సంబంధించి వినియోగదారుల నుంచి తరచూ ఎదురవుతున్న ప్రశ్నలకు ఆర్బీఐ సమాధానాలు ఇచ్చింది. -
8 ఏళ్లలో రూ.45లక్షలు..
నాకు నెలకు రూ.55వేల వేతనం వస్తోంది. వయసు 38. ఇప్పటి వరకూ ఎలాంటి జీవిత బీమా పాలసీలు లేవు. నేను ఎంత మొత్తానికి పాలసీ తీసుకోవాలి? -
IPO: ఐపీఓకి దరఖాస్తు చేస్తుంటే
IPO: స్టాక్ మార్కెట్లో ఇప్పుడు ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్)లు జోరు నడుస్తోంది. అనేక సంస్థలు ప్రజల నుంచి మూలధన నిధులను సమీకరించేందుకు ముందుకు వస్తున్నాయి -
PM Surya Ghar: ఉచిత విద్యుత్ పథకం.. ‘రూఫ్‌టాప్ సోలార్’ కోసం దరఖాస్తు ఇలా..
PM Surya Ghar- Muft Bijli Yojana: కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్ అందించేందుకు కేంద్రం ‘పీఎం సూర్య ఘర్’ పథకం ప్రారంభించింది. దీని కింద ‘రూఫ్‌టాప్ సోలార్’ కోసం దరఖాస్తు చేసుకోండిలా..! -
Blue Aadhaar: బ్లూ ఆధార్ కార్డు ఎవరికిస్తారు? దరఖాస్తు ఎలా?
Blue Aadhaar Card: యూఐడీఏఐ పిల్లల కోసం ప్రత్యేకంగా నీలం రంగులో ఆధార్ కార్డుల (Blue Aadhaar card)ను జారీ చేస్తోంది. దీన్ని బాల ఆధార్ (Baal Aadhaar) కార్డుగా వ్యవహరిస్తారు. -
Fastag KYC: ఫాస్టాగ్ కేవైసీ గడువు పొడిగించిన ఎన్హెచ్ఏఐ
ఫాస్టాగ్ కేవైసీ అప్డేట్ గడువును పొడిగిస్తున్నట్లు ఎన్హెచ్ఏఐ ప్రకటించింది. ఫిబ్రవరి 29 వరకు వెసులుబాటు కల్పించింది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్‌సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్