WhatsApp: ఒకేసారి నాలుగు ఫోన్లలో వాట్సాప్.. ఎలా ఉపయోగించాలంటే?
వాట్సాప్ (WhastApp) కొత్తగా ఒకేసారి నాలుగు ఫోన్లలో యాప్‌ను ఉపయోగించుకునేలా కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. మరి, ఈ ఫీచర్‌తో ఒకేసారి వేర్వేరు ఫోన్లలో వాట్సాప్‌ను ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం.
ఇంటర్నెట్ డెస్క్: వాట్సాప్ (WhatsApp) యాప్‌ను మొబైల్ ఫోన్‌తోపాటు అదనంగా మరో నాలుగు డివైజ్‌లలో (ల్యాప్‌టాప్, ట్యాబ్, డెస్క్‌టాప్ కంప్యూటర్) ఉపయోగించేందుకు వీలుగా మల్టీ డివైజ్ ఫీచర్ (Multidevice Feature) అందుబాటులో ఉంది. కానీ, మల్టీ డివైజ్ ఫీచర్‌లో ఒక ఫోన్‌లో మాత్రమే లాగిన్‌కు అవకాశం ఉంటుంది. మరో ఫోన్‌లో లాగిన్ అయితే ప్రైమరీ ఫోన్ నుంచి లాగౌట్ అవుతుంది. ఈ సమస్యకు పరిష్కారంగానే వాట్సాప్ కంపానియన్ ఫోన్స్ (Companion Phones) ఫీచర్‌ను పరిచయం చేసింది. ఈ ఫీచర్‌తో ఒకేసారి నాలుగు ఫోన్లలో వాట్సాప్‌ను ఉపయోగించుకోవచ్చు. ఎంతోకాలంగా యూజర్లు ఈ ఫీచర్ కోసం డిమాండ్ చేస్తున్నట్లు తెలిపింది. మరి, ఒకేసారి నాలుగు ఫోన్లలో వాట్సాప్‌ను ఎలా కనెక్ట్ చేసుకోవాలి? సెకండరీ ఫోన్‌లలో ఎన్నిరోజులపాటు వాట్సాప్ ఖాతా యాక్టివ్‌లో ఉంటుందనే వివరాలపై ఓ లుక్కేద్దాం.
నాలుగు ఫోన్లలో వాట్సాప్
- సాధారణంగా వాట్సాప్‌లో లింక్ డివైజ్ ఫీచర్‌తో డెస్క్‌టాప్, వెబ్ లేదా ట్యాబ్‌లలో లాగిన్ అవుతాం. కానీ, కంపానియన్ ఫోన్స్‌లో ముందుగా వాట్సాప్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయాలి.
- తర్వాత యాప్ ఓపెన్ చేసి అగ్రీ అండ్ కంటిన్యూపై క్లిక్ చేసి మోర్ ఆప్షన్స్ (More Options)లోకి వెళ్లాలి. అందులో లింక్ టు ఎగ్జిస్టింగ్ అకౌంట్ (Link To Existing Account) అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేస్తే క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది.
- ఆ కోడ్‌ను వాట్సాప్ ప్రధాన ఖాతా ఉన్న ఫోన్‌తో స్కాన్ చేయాలి. ఇందుకోసం ఫోన్‌లో వాట్సాప్ ఓపెన్ చేసి మోర్ ఆప్షన్స్‌పై క్లిక్ చేయాలి. అందులో లింక్ డివైజ్ (Link Device) కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి లింక్ ఏ డివైజ్ (Link A Device) ఆప్షన్‌తో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. అలా, కోడ్‌ను స్కాన్ చేస్తే కంపానియన్ ఫోన్స్‌లో వాట్సాప్ లాగిన్ అవుతుంది.
- వాట్సాప్ ప్రైమరీ ఖాతా ఉన్న ఫోన్‌లో మాదిరే.. కంపానియన్ ఫోన్స్‌లో కూడా యాప్‌ను వాడుకోవచ్చు. మెసేజింగ్, మీడియా ఫైల్ షేరింగ్, కాలింగ్ వంటి సదుపాయాలు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ భద్రతతో అందుబాటులో ఉంటాయి. అలానే, ఈ ఫోన్లలో లైవ్ లొకేషన్ చూడలేరు. బ్రాడ్‌కాస్ట్ లిస్ట్ క్రియేట్ చేయడం, చూడటం సాధ్యంకాదు. దాంతోపాటు ప్రైమరీ ఫోన్‌లో పెట్టిన స్టేటస్‌ను కంపానియన్ ఫోన్స్ నుంచి డిలీట్ చేయలేరు.
- వాట్సాప్ బిజినెస్ ఖాతాదారులు, చిన్న కంపెనీల్లో వినియోగదారుల సేవల కోసం ఒకే నంబర్‌తో వాట్సాప్‌ను ఉపయోగించే వారికి ఈ ఫీచర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఫీచర్‌తో మరో ఫోన్‌లో వాట్సాప్ లాగిన్ చేయడం వల్ల, చిన్న వ్యాపార సంస్థ యజమాని అందుబాటులో లేకపోయినా, ఉద్యోగులు ఖాతాదారులకు అవసరమైన సమాచారం అందివచ్చు.
- వాట్సాప్ ప్రైమరీ డివైజ్‌తో కంపానియన్ ఫోన్స్ పద్నాలుగు రోజుల కంటే ఎక్కువ రోజులు కనెక్ట్ కాకుండా ఉంటే.. తర్వాత ఆటోమేటిగ్గా అన్ని ఫోన్ల నుంచి వాట్సాప్ లాగౌట్ అయిపోతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ కొద్దిమంది యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. మరికొన్ని వారాల్లో సాధారణ యూజర్లకు పరిచయం చేయనున్నట్లు వాట్సాప్ తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Road Accident: యాత్రికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు- లారీ ఢీ: ఇద్దరు డ్రైవర్ల మృతి
-
Nellore: వైకాపా నేత చెప్పాడని.. సీఐ చితక బాదేశారు
-
NTR: ‘ఏఐ’ మాయ.. ఎన్టీఆర్‌ని తలపించేలా.. ఫొటో వైరల్
-
Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాజ్యసభ ఏకగ్రీవ ఆమోదం
-
IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే.. ఈ రికార్డులు నమోదవుతాయా?
-
Hyderabad: తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ నూతన ఛైర్మన్‌గా బక్కి వెంకటయ్య