CIBIL Score: సిబిల్ స్కోరును ఎలా లెక్కిస్తారు? ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి?
క్రెడిట్ స్కోరు మూడు అంకెల సంఖ్యలో జారీ చేస్తారు. సాధారణంగా సిబిట్ స్కోరు 300-900 మధ్య ఉంటుంది.
ఇంటర్నెట్ డెస్క్: క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (ఇండియా) లిమిటెడ్ (CIBIL) అందించే క్రెడిట్ స్కోరునే సిబిల్ స్కోరు అంటారు. వ్యక్తుల వారి వారి ఆర్థికతను, రుణాలను అంటే గృహ రుణం, వ్యక్తిగత రుణం, క్రెడిట్ కార్డు (Credit Card) వంటి వాటిని ఎలా నిర్వహిస్తున్నారో డేటాను సేకరించి, క్రెడిట్ స్కోరు (Credit Score)ను లెక్కిస్తుంది. బ్యాంకులు రుణాలు ఇచ్చే ముందు ఈ క్రెడిట్ స్కోరును పరిశీలించి మంచి స్కోరును నిర్వహిస్తున్నవారికి త్వరితగతిన రుణాలను మంజూరు చేస్తాయి.
క్రెడిట్ స్కోరు ఎంతుంటుంది?
క్రెడిట్ స్కోరు మూడు అంకెల సంఖ్యలో జారీ చేస్తారు. సాధారణంగా సిబిల్ స్కోరు 300-900 మధ్య ఉంటుంది. 750-900 మధ్య ఉంటే అత్యుత్తమంగా పరిగణిస్తారు. 650-750 మంచి స్కోరుగానూ, 550-650 మధ్య ఉంటే యావరేజ్‌గానూ, 300-550 మధ్య ఉంటే తక్కువ క్రెడిట్ స్కోరుగానూ పరిగణిస్తారు. 750-900 మధ్య ఉంటే రుణాలను తిరిగి చెల్లించడంలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని బ్యాంకులు నమ్ముతాయి. దీంతో తక్కువ వడ్డీ రేట్లతో రుణాలను ఆఫర్ చేస్తుంటాయి. సిబిల్ స్కోరు తక్కువగా ఉంటే నష్ట భయం (Risk) ఎక్కువగా ఉంటుంది కాబట్టి రుణాలను త్వరగా ఆమోదించవు. ఒకవేళ ఆమోదించినా వడ్డీ రేటు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.
సిబిల్ స్కోరు ఎలా లెక్కిస్తారు?
సిబిల్ నివేదికలో ఉన్న క్రెడిట్ చరిత్ర (Credit History)ను అనుసరించి సిబిల్ స్కోరును లెక్కిస్తారు. ఇందుకోసం గత 36 నెలల్లో రుణ గ్రహీతల క్రెడిట్ ప్రొఫైల్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. క్రెడిట్ ప్రొఫైల్‌లో గృహ రుణాలు, క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాలు, ఆటో మొబైల్ రుణాలు, ఓవర్ డ్రాఫ్ట్, అన్ని రకాల రుణాలు వాటి చెల్లింపుల చరిత్ర ఉంటుంది.
గత చరిత్ర..
సిబిల్ స్కోరు లెక్కింపులో అత్యధికంగా ప్రభావితం చేసే అంశం గత చెల్లింపుల చరిత్ర. 30% దీనికి ప్రాముఖ్యత ఉంటుంది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు క్రెడిట్ బ్యూరోలకు వ్యక్తిగత, క్రెడిట్ సంబంధిత సమాచారాన్ని పంపుతాయి. క్రెడిట్ బ్యూరో మీ క్రెడిట్ నివేదికలో మొత్తం సమాచారాన్ని క్రోడీకరించి క్రెడిట్ స్కోర్‌ను లెక్కిస్తుంది. ఇందుకోసం క్రెడిట్ బ్యూరోలు మీ బిల్లులు, ఈఎంఐలకు సంబంధించి గత 3 సంవత్సరాల చెల్లింపుల నెలవారీ రికార్డును పరిగణనలోకి తీసుకుంటాయి. క్రెడిట్ రిపోర్ట్‌లో ప్రతి ఖాతా వివరాలు ఉంటాయి. ఖాతా సెటిల్మెంట్, మొత్తం బకాయి వివరాలు ఉంటాయి. కాబట్టి, మీరు ఎప్పుడైనా రుణ ఎగవేతలకు పాల్పడినా, ఈఎంఐలను వాయిదా వేసినా, చెల్లించడంలో ఆలస్యం అయినా, క్రెడిట్ కార్డుపై ఆలస్యపు చెల్లింపులు చేసినా, సిబిల్ స్కోరుపై చెడు ప్రభావం పడుతుంది.
క్రెడిట్ వినియోగం..
క్రెడిట్ కార్డ్‌లో మీకు అందుబాటులో ఉన్న క్రెడిట్ పరిమితిలో మీరు ఖర్చు చేసే మొత్తాన్ని క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో (CUR)గా పరిగణిస్తారు. మీ క్రెడిట్ స్కోర్‌ను లెక్కించడంలో దీనికి 25% ప్రాముఖ్యత ఉంటుంది. కార్డు గరిష్ఠ పరిమితి వరకు తరచూ ఖర్చులు చేస్తుంటే.. డిఫాల్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇది సిబిల్ స్కోరుపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. మీ కార్డు పరిమితి, ఉయోగించే మొత్తాన్ని బట్టి క్రెడిట్ యుటిలైజేషన్ రేషియోను లెక్కించండి. సాధ్యమైనంత వరకు మీ సీయూఆర్ 40% మించకుండా చూసుకోవడం మంచిది.
క్రెడిట్ మిక్స్, వ్యవధి..
సిబిల్ (CIBIL) స్కోరు.. మీ రుణ పోర్ట్‌ఫోలియోపై కూడా ఆధారపడి ఉంటుంది. అంటే.. మీరు తీసుకున్న రుణాల్లో ఎంత శాతం సురక్షిత రుణాలు, అసురక్షిత రుణాలు ఉన్నాయి అనేది దాన్ని ఆధారం చేసుకుని కూడా క్రెడిట్ స్కోరును లెక్కిస్తారు. సురక్షిత రుణం (Secured loans) అంటే గృహ, వాహనం వంటి పూచీకత్తు ఉన్న రుణాలు. అసురక్షిత రుణాలు (unsecured loans) అంటే వ్యక్తిగత, క్రెడిట్ కార్డు లోన్ వంటివి. వీటికి పూచీకత్తు ఉండదు. తీసుకున్న రుణం ఏదైనా ఎగవేతలు, ఆలస్యపు చెల్లింపులతో క్రెడిట్ స్కోరు తగ్గుతుంది. అయితే సురక్షిత రుణ ఆలస్యపు చెల్లింపుల కంటే అసురక్షిత రుణాల ఆలస్యపు చెల్లింపులు క్రెడిట్ స్కోరును తొందరగా తగ్గిస్తాయి. అలాగే మీ దీర్ఘకాల ఆర్థిక చరిత్ర ఎలా ఉందనేది కూడా చూస్తారు. గత 10 ఏళ్లలో తీసుకున్న రుణాల చెల్లింపులను ఎలా చేస్తూ వస్తున్నారు. ఎగవేతలు ఏమైనా ఉన్నాయా కూడా చూస్తారు. సిబిల్ స్కోరు లెక్కింపుల్లో క్రెడిట్ మిక్స్ (Creditmix), ఆర్థిక చరిత్రకు 25% ప్రాముఖ్యత ఉంటుంది.
ఇతరాలు..
CIBIL స్కోర్ లెక్కింపులో మిగిలిన 20% మీరు ఇటీవలి కాలంలో ఎన్ని సార్లు రుణం కోసం దరఖాస్తు చేసారు. అందులో ఎన్ని తిరస్కరణకు గురయ్యాయి? ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి? క్రెడిట్ స్కోరు హార్డ్ ఎంక్వైరీలు (రుణం కోసం దరఖాస్తు చేసినప్పుడు రుణ సంస్థలు క్రెడిట్ చరిత్ర కోసం దరఖాస్తు చేస్తే వాటిని హార్డ్ ఎంక్వైరీలు అంటారు.) వంటివి సిబిల్ స్కోరుపై ప్రతికూల ప్రభావం చూపుతాయి.
చివరగా..
బలమైన క్రెడిట్ స్కోరు కోసం రుణ ఈఎంఐలను సకాలంలో చెల్లించండి. రుణ వినియోగ నిష్పత్తి తక్కువగా ఉండేలా చేసుకోవడం, క్రెడిట్ కార్డు బిల్లును సకాలంలో చెల్లించడం వంటివి ముఖ్య పాత్ర పోషిస్తాయి. కాబట్టి వీటి విషయంలో జాగ్రత్తగా ఉంటే క్రెడిట్ స్కోరును సులభంగా పెంచుకోవచ్చు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Odisha train tragedy: నెత్తుటి పట్టాలపై.. నలిగిపోయిన ‘ప్రేమ గీతాలు’!
-
India News
Odisha Train Accident: ఆ చిన్నారులను ఆదుకుంటాం.. అదానీ, సెహ్వాగ్‌ల చొరవ!
-
Movies News
Social Look: శ్రీలంకలో మృణాళిని రవి సెల్ఫీ.. విష్ణుప్రియ ‘ఎల్లో’ డ్రెస్సు
-
India News
Bridge Collapse: నిర్మాణంలో ఉండగానే కుప్పకూలిన వంతెన.. వీడియో వైరల్
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Crime News
Crime News: ఖమ్మంలో వైద్య విద్యార్థిని ఆత్మహత్య