HP Laptop: ₹29 వేలకే HP కొత్త ల్యాప్‌టాప్‌.. ఫీచర్లివే..

HP Chromebook: విద్యార్థుల కోసం హెచ్‌పీ కొత్త ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. హెచ్‌పీ క్రోమ్‌బుక్‌ 15.6 పేరుతో ఈ ల్యాప్‌టాప్‌ తీసుకొచ్చారు.

Updated : 14 Mar 2023 16:19 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: గూగుల్‌ క్రోమ్‌ ఓఎస్‌తో హెచ్‌పీ (HP) సరికొత్త ల్యాప్‌టాప్‌ తీసుకొచ్చింది. హెచ్‌పీ క్రోమ్‌బుక్‌ 15.6 (HP Chromebook 15.6.) పేరుతో దీన్ని మంగళవారం విడుదల చేసింది. స్కూల్‌, కాలేజీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఈ ల్యాప్‌టాప్‌ను తీర్చిదిద్దిన్నట్లు హెచ్‌పీ వెల్లడించింది. ఈ ల్యాప్‌ ఎంతో స్టైలిష్‌గా తీర్చిదిద్దినట్లు పేర్కొంది. చదువుతో పాటు గేమింగ్‌ కూడా సపోర్ట్‌ చేస్తుందని తెలిపింది. దీని ధరను రూ.28,999గా నిర్ణయించింది. రెండు రంగుల్లో లభించే ఈ ల్యాప్‌టాప్‌ను ఆన్‌లైన్‌లో దీన్ని కొనుగోలు చేయొచ్చు.

ఈ కొత్త హెచ్‌పీ ల్యాప్‌టాప్‌లో ఇంటెల్‌  N4500 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 15.6 అంగుళాల హెచ్‌డీ స్క్రీన్‌ ఉంది. ఇందులో 250 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ఉంటుంది. వీడియో కాల్స్‌ కోసం వైడ్‌ విజన్‌ హెచ్‌డీ కెమెరా, మైక్రోఫోన్‌ ఉన్నాయి. ట్రాక్‌ ప్యాడ్‌ను పెద్దగా ఇచ్చారు. వివిధ రకాల గెశ్చర్స్‌కు ఇది సపోర్ట్‌ చేస్తుంది. ఆడియో కోసం రెండు స్పీకర్లను అమర్చారు. ఈ ల్యాప్‌టాప్‌లో అమర్చిన బ్యాటరీ 11.5 గంటల వరకు పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. గూగుల్‌ అసిస్టెంట్‌, గూగుల్‌ క్లాస్‌రూమ్‌ సర్వీస్‌లకు ఈ ల్యాప్‌టాప్‌ సపోర్ట్‌ చేస్తుంది. ఫైల్స్‌, ఫొటోలను తొందరగా పంపిచటానికి హెచ్‌పీ క్విక్‌ డ్రాప్‌ సదుపాయం ఉంది. వేగవంతమైన కనెక్టివిటీ కోసం వైఫై 6 అందిస్తున్నారు. మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌ 365కూ ఈ ల్యాప్‌టాప్‌ సపోర్ట్‌ చేస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని