Hybrid model: భారత్‌లో హైబ్రిడ్‌ విధానంవైపే మెజారిటీ ఉద్యోగుల మొగ్గు!

వారంలో కొన్ని రోజులు ఇంటి నుంచి.. మరికొన్ని రోజులు ఆఫీసు నుంచి పనిచేసే వెసులుబాటు ఉన్న హైబ్రిడ్‌ మోడల్‌ వైపే మెజారిటీ ఉద్యోగులు మొగ్గుచూపుతున్నట్లు సర్వేలో తేలింది.

Updated : 21 Oct 2022 00:42 IST

దిల్లీ: భారత్‌లో చాలా మంది ఉద్యోగులు హైబ్రిడ్‌ మోడల్‌ పని విధానం వైపే మొగ్గుచూపుతున్నట్లు ప్రముఖ సర్వేలో తేలింది. మొత్తం 700 కంపెనీలను సర్వే చేయగా.. ఆగస్టులో 70 శాతం మంది ఈ విధానమే తమకు సౌకర్యంగా ఉందని తెలిపారు. జనవరిలో ఇది 47 శాతంగా ఉండడం గమనార్హం. వారంలో కొన్ని రోజులు ఇంటి నుంచి.. మరికొన్ని రోజులు ఆఫీసు నుంచి పనిచేసే విధానాన్ని హైబ్రిడ్‌ మోడల్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సర్వేను హెచ్‌ఆర్‌ సొల్యూషన్స్‌ కంపెనీ ఏయాన్‌ నిర్వహించింది.

మరోవైపు కేవలం 9 శాతం కంపెనీలు మాత్రమే ఇంకా తమ ఉద్యోగులకు పూర్తిగా ఇంటి నుంచి పని చేసే వెసులుబాటును కల్పిస్తున్నాయి. జనవలో ఇది 38 శాతంగా నమోదైంది. కంపెనీలు తమ ఉద్యోగులను ఆఫీసులకు రమ్మని పిలుస్తుండడంతో వలసల రేట్లు పెరుగుతున్నట్లు తమ సర్వేలో వెల్లడైందని ఏయాన్‌ తెలిపింది. రానున్న రోజుల్లో ఆఫీసుకు కచ్చితంగా రావాలని ప్రకటించిన కంపెనీల్లో వలసల రేటు 29 శాతంగా నమోదైనట్లు వెల్లడించింది. భారత్‌లో పెప్పికో, ఆర్‌పీజీ గ్రూప్‌, మెర్సిడెస్‌-బెంజ్‌ ఇండియా, టెక్ మహీంద్రా, మారుతీ సుజుకీ తమ ఉద్యోగులకు హైబ్రిడ్‌ మోడ్‌లో పనిచేసే వెసులుబాటు కల్పిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని