IRCTC Tour package: అండమాన్‌ ట్రిప్‌ ప్లాన్‌ చేస్తున్నారా? ప్యాకేజీ వివరాలు ఇవిగో..

Hyderabad to Andaman IRCTC Tour package: ఈ వేసవి సెలవుల్లో అండమాన్‌ నికోబార్‌ దీవులను సందర్శించాలనుకుంటే ఐఆర్‌సీటీసీ అందించే ఈ టూరిజం ప్యాకేజీపై లుక్కేయండి..

Updated : 18 May 2023 10:51 IST

ఈ వేసవి సెలవుల్లో ఎక్కడికైనా ట్రిప్‌ ప్లాన్‌ చేస్తున్నారా? ఓ వైపు సముద్ర అందాలు.. ఇసుక తిన్నెలు.. పచ్చని చెట్ల మధ్య సేద తీరాలని చూస్తున్నారా? అయితే, ఐఆర్‌సీటీసీ అండమాన్‌ టూర్‌ ప్యాకేజీపై లుక్కేయాల్సిందే. హైదరాబాద్‌ నుంచి విమాన ప్రయాణంతో మొదలై పోర్ట్‌బ్లెయిర్‌కు వెళ్లడం.. అక్కడి అందాలు వీక్షించాక తిరిగి హైదరాబాద్‌కు విమానంలో చేరుకోవడంతో టూర్‌ పూర్తవుతుంది. మొత్తం ఐదు రాత్రులు, ఆరు పగళ్లు సాగే ఈ ప్యాకేజీ మే 26న ప్రారంభం అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం.. ప్యాకేజీ వివరాలు చూద్దాం పదండి..

ట్రిప్‌ సాగేదిలా..

Day 1: మే 26న ఉదయాన్నే హైదరాబాద్‌ (Hyderabad) నుంచి విమాన ప్రయాణంతో జర్నీ ప్రారంభమవుతుంది. ప్రయాణికులంతా ఉదయం 4.35 గంటలకే విమానాశ్రయానికి చేరుకోవాలి. 6.35కి హైదరాబాద్‌లో విమానం ప్రారంభమై 9.15కి పోర్ట్‌బ్లెయిర్‌ (Port Blair) చేరుకుంటుంది. ముందుగానే బుక్‌ చేసిన హోటల్‌లో బస ఉంటుంది. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం సెల్యూలర్‌ జైల్‌ మ్యూజియం, కోర్బికోవ్‌ బీచ్‌ సందర్శన ఉంటుంది. రాత్రి సెల్యులర్‌ జైల్‌ వద్ద నిర్వహించే లైట్‌ అండ్‌ సౌండ్‌ షో వీక్షించవచ్చు. రాత్రి పోర్ట్‌బ్లెయిర్‌లోనే బస ఉంటుంది.

Day2: రెండో రోజు ఉదయం హేవ్‌లాక్‌ దీవికి (Havelock Island) ఓడలో ప్రయాణం ఉంటుంది. అల్పాహారం ప్యాక్‌ చేసి అందిస్తారు. హేవ్‌లాక్‌ చేరుకున్నాక హోటల్‌ గదిలో బస ఉంటుంది. మధ్యాహ్నం భోజన విరామం తర్వాత రాధానగర్‌ బీచ్‌ సందర్శన ఉంటుంది. హేవ్‌లాక్‌ దీవిలోనే రాత్రి బస ఉంటుంది.

Day3: మూడో రోజు హేవ్‌లాక్‌ నుంచి నెయిల్‌ దీవికి (Neil Island) బయల్దేరాల్సి ఉంటుంది. ఉదయం అల్పాహారం అనంతరం కాలాపత్తర్‌ బీచ్‌కు వెళ్లి అక్కడి నుంచి నెయిల్‌ దీవికి ఓడలో ప్రయాణం ఉంటుంది. అక్కడ మళ్లీ హోటల్‌లో బస ఉంటుంది. సాయంత్రం లక్ష్మణ్‌పూర్‌లో సూర్యాస్తమయం చూడొచ్చు. హోటల్‌లోనే రాత్రి బస ఉంటుంది.

Day4: నాలుగో రోజు నెయిల్‌ దీవి నుంచి పోర్ట్‌బ్లెయిర్‌కు పయనం అవ్వాల్సి ఉంటుంది. ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌ అనంతరం భరత్‌నగర్‌ బీచ్‌ సందర్శన ఉంటుంది. అక్కడ స్విమ్మింగ్‌, గ్లాస్‌ బాటమ్‌ బోట్‌ రైడ్‌, ఇతర వాటర్‌ స్పోర్ట్స్‌ యాక్టివిటీస్‌లో పాల్గొనొచ్చు. ఆ తర్వాత పోర్ట్‌బ్లెయిర్‌కి పయనం అవ్వాలి. రాత్రికి మళ్లీ పోర్ట్‌బ్లెయిర్‌లో బస ఉంటుంది.

Day 5: ఐదో రోజు ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌ తర్వాత రాస్‌ ఐలాండ్‌లో కాస్త సమయం గడిపాక.. నార్త్‌ బే ఐల్యాండ్‌కు తీసుకెళతారు. అక్కడ వాటర్‌ స్పోర్ట్స్‌ యాక్టివిటీస్‌లో పాల్గొనొచ్చు. పోర్ట్‌బ్లెయిర్‌లోనే మధ్యాహ్నం భోజనం ఉంటుంది. తర్వాత సాముద్రిక మెరైన్‌ మ్యూజియం వీక్షణ ఉంటుంది. సాయంత్రం షాపింగ్‌ చేసుకోవడానికి వీలుంటుంది. రాత్రి మళ్లీ పోర్ట్‌బ్లెయిర్‌లోనే హోటల్‌లో బస ఉంటుంది.

Day 6: పోర్ట్‌బ్లెయిర్‌ నుంచి ఉదయం 7.55 గంటలకు విమానాశ్రయానికి చేరుకోవాలి. ఉదయం 9.55 గంటలకు విమానం బయల్దేరుతుంది. మధ్యాహ్నం 12.10 గంటలకు హైదరాబాద్‌ చేరుకోవడంతో టూర్‌ ముగుస్తుంది.

ప్యాకేజీ ధరలు

  • సింగిల్‌ ఆక్యుపెన్సీ:  రూ.55,780
  • డబుల్‌ ఆక్యుపెన్సీ: రూ.43,170
  • ట్రిపుల్‌ ఆక్యుపెన్సీ: రూ.42,885
  • చైల్డ్‌ విత్‌ బెడ్‌ (5-11ఏళ్లు): రూ.38,600
  • చైల్డ్‌ విత్‌ ఆర్‌ వితౌట్‌ బెడ్‌ (2-11ఏళ్లు): 35,200
  • రెండేళ్లలోపు చిన్నారులకు రూ.1500 వరకు ఛార్జీ ఎయిర్‌పోర్ట్‌ కౌంటర్ల వద్ద చెల్లించాల్సి ఉంటుంది.

ప్యాకేజీలో ఉండేవి..

  • హైదరాబాద్‌ నుంచి పోర్ట్‌బ్లెయిర్‌.. పోర్ట్‌ బ్లెయిర్‌ నుంచి హైదరాబాద్‌ విమాన టికెట్లు
  • ఏసీ గదులు
  • పర్యటనలో ఒక చోటు నుంచి మరో చోటుకు ఏసీ వాహనాల్లో ప్రయాణం
  • నెయిల్‌, హేవ్‌లాక్‌, నార్త్‌బే ఐలాండ్‌కు ఓడ ప్రయాణ ఖర్చులు
  • 4 రోజుల పాటు ఉదయం పూట టిఫిన్‌, 5 రోజుల పాటు రాత్రి డిన్నర్‌ ప్యాకేజీలో భాగంగా అందిస్తారు.
  • ఐఆర్‌సీటీసీ టూర్‌ ఎస్కార్ట్‌ ఉంటారు.

వీటి బాధ్యత ప్రయాణికులదే

  • విమాన ప్రయాణ టికెట్‌ ధరల్లో మార్పు ఉంటే అధిక ధర ప్రయాణికులే చెల్లించాలి.
  • హైదరాబాద్ విమానాశ్రయానికి రాకపోకల ఏర్పాట్లు యాత్రికులే చూసుకోవాలి.
  • మధ్యాహ్నం పూట భోజన ఖర్చు యాత్రికులదే.
  • విమాన ప్రయాణంలో మీల్స్‌ ఖర్చు ప్యాకేజీలో భాగం కాదు.
  • వాటర్‌ స్పోర్ట్స్‌, ఇతర చూడదగిన ప్రదేశాల్లో టికెట్ల ఖర్చు ప్రయాణికులే భరించాలి.

ఇతర వివరాలు..

  • ప్రయాణంలో ప్రతి ఒక్క ప్రయాణికుడు తమ వ్యక్తిగత గుర్తింపు కార్డు తీసుకెళ్లాలి.
  • సమయాన్ని బట్టి సందర్శన స్థలాల్లో మార్పులు ఉండొచ్చు.
  • ఏదైనా వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే.. ఐఆర్‌సీటీసీ అందుకు ఎట్టి బాధ్యతా వహించదు.
  • ఒకవేళ ఏదైనా కారణంతో టికెట్‌ రద్దు చేసుకుంటే.. 7 రోజుల ముందు వరకు తిరిగి చెల్లింపులు ఉంటాయి. వారంలోపు అయితే ఒక్క రూపాయి కూడా తిరిగి రాదు.

మరిన్ని వివరాలకు ఐఆర్‌సీటీసీ టూరిజం వెబ్‌సైట్‌ను సందర్శించండి..

-ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని